రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

భారతదేశపు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ రేపు (సెప్టెంబర్ 8, 2022వ తేదీన) తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)ని విడుదల చేయనుంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

టాటా మోటార్స్ నుండి రాబోయే కొత్త టియాగో ఈవీ దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించనుంది. మార్కెట్లో ఇది టాటా నుండి లభ్యం కానున్న మూడవ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. కంపెనీ ఇప్పటికే, నెక్సాన్ ఈవీ మరియు టిగోర్ ఈవీలను విక్రయిస్తోన్న సంగతి తెలిసినదే. తాజాగా, టాటా మోటార్స్ తమ టియాగో ఈవీ లాంచ్‌కి సంబంధించి ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో టియాగో ఈవీ ఎక్స్టీరియర్ వివరాలను కంపెనీ వెల్లడి చేసింది.

రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో వెల్లడించిన వివరాల ప్రకారం, టాటా టియాగో ఈవీ గ్రిల్‌కు ఇరువైపులా ట్రై-యారో ప్యాటర్న్ లతో కూడిన గ్రిల్ ఉంటుంది. కాకపోతే, ఈ గ్రిల్ ట్రెడిషన్ ఓపెన్ హోల్ గ్రిల్ మాదిరిగా కాకుండా పూర్తిగా సీల్ చేయబడిన గ్లోస్-బ్లాక్ ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను దాని సాధారణ మోడల్‌ నుండి వేరు చేయడానికి వీలుగా ఈ ఫ్రంట్ గ్రిల్‌కు కుడి వైపున 'EV' బ్యాడ్జ్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

టాటా మోటార్స్ ఇదివరకు వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే టాటా టియాగో ఈవీ కంపెనీ యొక్క జీకనెక్ట్ (ZConnect) కార్ టెక్నాలజీ, లెథెరెట్ సీట్లు, క్రూయిజ్ మోడ్ మరియు వన్-పెడల్ డ్రైవ్‌లను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, కొత్త Tata Tiago EV లోని మెరుగైన బ్యాటరీ పునరుత్పత్తి (బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్) టెక్నాలజీ కారణంగా వన్-పెడల్ డ్రైవ్ సాధ్యమవుతుందని, ఫలితంగా మెరుగైన రేంజ్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

టియాగో ఈవీ బాడీ షేప్ యొక్క లైటర్ కర్బ్ వెయిట్ కారణంగా ఇది టాటా టిగోర్ ఈవీ (సబ్-4 మీటర్ ఎలక్ట్రిక్ సెడాన్)తో పోలిస్తే ఎక్కువ రేంజ్ ను మరియు మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో కూడా టాటా టిగోర్ ఈవీలో ఉపయోగిస్తున్న అదే 350V జిప్‌ట్రాన్ ఈవీ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. అంటే, దీని అర్థం రాబోయే Tata Tiago EV కూడా 26kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అంచనా.

రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) లో 350V Ziptron EV సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో 26 kWh బ్యాటరీ ప్యాక్‌ మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌, 74 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో కేవలం 65 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే సాధారణ 15A ప్లగ్ పాయింట్ ద్వారా చేస్తే సుమారు 8 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.

రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

ఈ నేపథ్యంలో, రాబోయే టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఇదే విధమైన పవర్‌ట్రైన్ సెటప్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా, ఇందులోని బ్యాటరీ ప్యాక్ టిగోర్ ఈవీ కన్నా అధిక రేంజ్‌ను కూడా ఆఫర్ చేయగలదని సమాచారం. కొత్త బ్యాటరీ సంరక్షణ ఫీచర్లు మరియు తక్కువ బరువు కారణంగా, రాబోయే Tata Tiago EV అనువైన పరిస్థితుల్లో పూర్తి చార్జ్ పై 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని అంచనా.

రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

ప్రస్తుతం, మార్కెట్లో టాటా టిగోర్ ఈవీ XE, XM, XZ+ మరియు XZ+ DT అనే నాలుగు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. వీటి ధరలు రూ.12.49 లక్షల నుండి రూ.13.64 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ రేంజ్‌ను (స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ వద్ద ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. కాగా, టియాగో ఈవీ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ టిగోర్ ఈవీలో ఉపయోగించిన అదే IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ లను ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, దీని ధరను తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులోని కొన్ని ఫీచర్లను తగ్గించే అవకాశం ఉంది.

రేపే టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) విడుదల.. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు..!?

ఇక టాటా టియాగో ఈవీ అంచనా ధర విషయానికి వస్తే, కంపెనీ ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు యొక్క ఎక్స్-షోరూమ్ ధరను సుమారు రూ. 11.00 లక్షల నుండి రూ. 13.10 లక్షల మధ్యలో నిర్ణయించవచ్చని అంచనా. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా టియాగో ఈవీని లాంచ్ చేయడం వలన దేశంలోని ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో, ముఖ్యంగా టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో తన ఆధిక్యాన్ని మరింత విస్తరించుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 27, 2022, 16:39 [IST]
English summary
India s most affordable electric car tata tiago ev launch scheduled for sep 28th details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+