మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 (XUV300) కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుని, దేశంలో కెల్లా అత్యంత సురక్షితమైన కారుగా నిలిచిన సంగతి తెలిసినదే. భారతదేశంలో తయారయ్యే ఈ కారుని కంపెనీ పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది. అలాంటి ఎగుమతి మార్కెట్లలో ఆఫ్రికా మార్కెట్ కూడా ఒకటి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

ఇటీవలే ఆఫ్రికాలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కోసం నిర్వహించిన క్రాష్ టెస్టులో కూడా ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకొని, భద్రతలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. సేఫ్టీ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల ప్రకారం, భారతదేశంలో తయారు చేయబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆఫ్రికాలో అత్యంత సురక్షితమైన కారుగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయంపై కంపెనీ బాస్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, ఈ లిస్ట్‌లో ఎక్స్‌యూవీ300 ని అగ్రస్థానంలో చూసినందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 భారత మార్కెట్లో కూడా విక్రయించబడుతోంది మరియు దీని 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కారణంగా, ఇది ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన కారుగా మరియు అత్యధికంగా విక్రయించబడుతున్న కార్లలో ఒకటిగా నిలిచేలా చేసింది. వాస్తవానికి, సేఫ్టీ రేటింగ్ విషయంలో టాటా నెక్సాన్ కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ300 కన్నా కొన్ని పాయింట్లు వెనుకబడి ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈ మేడ్ ఇన్ ఇండియా కార్ బ్రాండ్ నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న మొట్టమొదటి ఎస్‌యూవీ.

మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 తర్వాత కంపెనీ ప్రవేశపెట్టిన అన్ని మోడళ్లు కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో అత్యుత్త సేఫ్టీ రేటింగ్ లను దక్కించుకున్నాయి. మహీంద్రా విడుదల చేసిన తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీ ఈ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకోగా, తాజాగా వచ్చిన ఎక్స్‌యూవీ700 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. కాగా, కొత్తగా విడుదలైన కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క క్రాష్ టెస్ట్ ఫలితాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది. మా అంచనా ప్రకారం, ఈ కొత్త స్కార్పియో కూడా ఖచ్చితంగా 5-స్టార్ రేటింగ్ ను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆఫ్రికా మోడల్ సేఫ్టీ రేటింగ్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క ఆఫ్రికన్ మోడల్ కూడా భారతీయ మోడల్ మాదిరిగానే పెద్దల భద్రతలో 5-స్టార్లను మరియు పిల్లల భద్రతలో 4-స్టార్లను దక్కించుకుని ఓవరాల్ గా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. కంపెనీ ఈ ఎస్‌యూవీ 2019 లో ఆఫ్రికాలో విడుదల చేసింది, అక్కడ ఇప్పటికే ఉన్న 60 డీలర్‌షిప్‌ల ద్వారా కంపెనీ ఈ కారును విక్రయిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆఫ్రికా యొక్క మొదటి 5-స్టార్ రేటెడ్ కారుగా మరో అరుదైన ఘనతను కలిగి ఉంది. ప్రస్తుతానికి, ఆఫ్రికాలో 5-స్టార్ సేఫ్టీని పొందిన మరో మోడల్ లేదు. కంపెనీ ఈ ఈకారులో సీట్ బెల్ట్ రిమైండర్, ఏబిఎస్, 2 ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైన వాటిని స్టాండర్డ్‌ సేఫ్టీ ఫీచర్లుగా అందిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఇండియా మోడల్ సేఫ్టీ రేటింగ్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఇండియన్ మోడల్ సేఫ్టీ రేటింగ్ లను ఓసారి గమనించినట్లయితే, ఈ కారుకి గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహింతిన క్రాష్ టెస్టులో ఇది పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గాను 16.42 పాయింట్ల స్కోర్‌తో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందగా, పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 37.44 పాయింట్ల స్కోర్‌తో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, అన్ని డిస్క్ బ్రేక్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

మహీంద్రా ఆఫ్రికన్ మార్కెట్లో ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీని రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. వీటిలో 1.5-లీటర్ డీజిల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి రెండూ కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటాయి. ఈ ఎస్‌యూవీలో 17.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, జిపిఎస్ నావిగేషన్, ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు టెయిల్‌లైట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

సేఫ్టీ విషయానికొస్తే, ఈ ఎస్‌యూవీలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, ఎలక్టానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మొదలైనవి ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300: భారతదేశంలోనే కాదు ఆఫ్రికాలో కూడా అత్యంత సురక్షితమైన కారు!

త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్ రాబోతోంది..

ఇదిలా ఉంటే, మహీంద్రా తమ ఎక్స్‌యూవీ300 మోడల్ ని ఆధారంగా చేసుకొని ఓ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీని మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400) పేరుతో పిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. కొత్త XUV400 EV యొక్క డెలివరీలు వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభమవుతాయని సమాచారం. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Monday, July 18, 2022, 15:40 [IST]
English summary
India s safest car mahindra xuv300 is also a safest car in africa details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+