మొదటిసారి లగ్జరీ కారుకి ఓనర్ అయిన 'స్మృతి మంధాన'.. ఆ కారు ఏదో తెలుసా..!!
భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో క్రికెట్ అంటే తెలియనివారు ఉండరు అనేది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ పాపులర్ అయిన ఆటల్లో క్రికెట్ ఒకటి. అయితే మన దేశంలో క్రికెట్ ఆడేవారిలో పురుషులు మాత్రమే కాకుండా స్త్రీల జట్టు కూడా ఉంది. పురుషులు ఆడే ఆటకు ఎంత ఆదరణ ఉందో స్త్రీలు ఆడే ఆటకు కూడా అంతే ఆదరణ ఉంది.
భారతదేశంలో మహిళా క్రికెట్ జట్టుకి కెప్టెన్ 'స్మృతి మంధాన' గురించి చాలామందికి తెలుసు, అయితే ఈమె ఇటీవల ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారత క్రికెటర్ స్మృతి మంధాన ఇటీవల కొనుగోలు చేసిన కొత్త కారు 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్' (Land Rover Range Rover Evoque). ఈ లగ్జరీ కారు ధర రూ. 72.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఖరీదైన కారుని ఈమె డెలివరీ తీసుకునే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్వయంగా షేర్ చేసింది.

క్రికెటర్ స్మృతి మంధాన కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంది. ఇది సిలికాన్ సిల్వర్ షేడ్ కలర్ లో ఉండటం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది ఈ వేరియంట్ యొక్క టాప్ వేరియంట్ అని తెలుస్తోంది. కావున ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

కొత్త 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్' మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో జతచేయబడిన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి ఆర్ డైనమిక్ వేరియంట్ మరియు ఎస్ వేరియంట్.

డిజైన్ పరంగా ఈ కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో కొత్త గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్ లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు కొత్త అలాయ్ వీల్స్ వంటి వాటిని చూడవచ్చు. ఇది మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ ఫీచర్స్ కూడా చాలా వరకు ఆధునికంగానే ఉంటాయి. కావున ఇందులో 3డి సరౌండ్ కెమెరా, కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఫోన్ సిగ్నల్ బూస్టర్తో వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులోని క్యాబిన్ డ్యూయల్-టోన్ (ఎబోనీ మరియు డీప్ గార్నెట్) కలర్ స్కీమ్ పొందుతుంది. కావున ఇది మరింత లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో రెండు ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. అవి 2.0 లీటర్ ఇంజెనీయం పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ ఇంజెనీయం డీజిల్ ఇంజిన్.

ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 247 బిహెచ్‌పి పవర్ మరియు 365 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.0 లీటర్ డీజిల్ యూనిట్ విషయానికి వస్తే, ఇది 178 బిహెచ్‌పి పవర్ మరియు 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

ఇండియన్ క్రికెటర్ స్మృతి మంధాన ఇప్పటికే మారుతి సుజుకి డిజైర్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి కార్లను కలిగి ఉంది. అయితే ఇప్పుడు కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ తన మొదటి లగ్జరీ కారు. ఇది వోల్వో XC60, బిఎండబ్ల్యు ఎక్స్3 మరియు మెర్సిడెస్ బెంజ్ GLC వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇక ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయిన స్మృతి మంధాన విషయానికి వస్తే, ఈమె 2018 లో ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేరు పొందింది. అంతే కాకూండా అదే సంవత్సరంలో రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డు కూడా కైవసం చేసుకుంది. 2022 సెప్టెంబర్ నెలలో వన్డే క్రికెట్ లో 3,000 పరుగులు చేసిన మూడో భారత వైస్ కెప్టెన్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications








