ఫార్ములా ఈ రేసింగ్‌ ఆతిథ్యంతో ప్రపంచ ఖ్యాతి పొందిన హైదరాబాద్: రేస్ డేట్స్ & టికెట్ బుకింగ్స్ వివరాలు

భారతదేశంలో మొట్ట మొదటిసారిగా 'ఫార్ములా ఈ రేసింగ్‌' హైదరాబాద్ నగరంలో ప్రారంభం కానుంది. దీని కోసం ఏర్పాట్లు అన్నీ సిద్ధమవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023 ఫిబ్రవరి 11 నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్‌ లీగ్ ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. దీని కోసం రేసింగ్‌ ఈవెంట్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి.

ఫార్ములా ఈ రేసింగ్‌ ఆతిథ్యంతో ప్రపంచ ఖ్యాతి పొందిన హైదరాబాద్

హైదరాబాద్ లో జరగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పుడు రెండు రకాల పాసులు అందుబాటులో ఉన్నాయి. అవి ఒకటి సాధారణ పాస్, రెండు వీకెండ్ పాస్. సాధారణ పాస్ కొనుగోలు చేసే వారు రూ. 749 చెల్లించి పాస్ పొందవచ్చు. అయితే వీకెండ్ పాస్ రెండు రోజుల కోసం రూ. 1,249 చెల్లించాల్సి ఉంటుంది.

భారతదేశం ప్రపంచంలో 7 వ అతిపెద్ద దేశంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఇలాంటి రేస్ కి ఆతిధ్యం ఇవ్వలేదు. ఇదే మొదటిసారి. దీని కోసం హైదరాబాద్‌ నగరం ఎంతో అట్టహాసంగా ఆతిధ్యం ఇస్తోంది. హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.

ఫార్ములా ఈ రేసింగ్‌ ఆతిథ్యంతో ప్రపంచ ఖ్యాతి పొందిన హైదరాబాద్

మొదటి కమిటీ కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీలో సభ్యులుగా మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈఓ దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు మరియు ఇతర నిపుణులు ఉన్నారు. ఇక రెండవ కమిటీ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎక్జిక్యూటివ్ కమిటీ. ఇందులో హైదరాబాద్ సీపీ, పోలీసు, మున్సిపల్, విద్యుత్ మరియు రెవెన్యూ అధికారులు ఉన్నారు.

హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ లొకేషన్ విషయానికి వస్తే, ఇది హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న స్ట్రీట్ సర్క్యూట్ ఎన్టీఆర్ గార్డెన్స్ వీధుల గుండా వెళుతుంది. ఈ ట్రాక్ పొడవు సుమారు 2.83 కి.మీ వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 17 మలుపులు ఉన్నట్లు సమాచారం.

ఫార్ములా ఈ రేసింగ్‌ ఆతిథ్యంతో ప్రపంచ ఖ్యాతి పొందిన హైదరాబాద్

ఈ వారాంతంలో ప్రారంభమయ్యే హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో రేసింగ్ లో ఇద్దరు భారతీయ డ్రైవర్లతో పాటు ఇద్దరు అంతర్జాతీయ డ్రైవర్లతో కూడిన ఆరు సిటీ జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో ఉన్న నలుగురిలో ఒకరు మహిళా డ్రైవర్ కూడా ఉంటారు. ఇందులో ఆలివర్ జేమ్స్ వెబ్, అలాగే విష్ణు ప్రసాద్, అనిందిత్ రెడ్డి మరియు అఖిల్ రవీంద్ర మొదలైనవారు ఉన్నారు.

ముందు చెప్పుకున్నట్లుగా హైదరాబాద్ నగరం దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆతిధ్యం ఇస్తోంది. ఇప్పటికే బెర్లిన్, రోమ్, సియోల్‌, న్యూయార్క్, లండన్ వంటి నగరాల్లో ఈ ఈ రేసింగులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు హైదారాబాద్ లో కూడా ఈ రేసింగ్ ప్రారంభమవుతోంది. ఈ కారణంగా ఇప్పుడు భాగ్యనగరం (హైదరాబాద్) ప్రపంచ ఖ్యాతిని పొందుతుంది.

మొదటిసారి హైదరాబాద్ లో ఇంతటి ప్రపంచ ప్రసిద్ధి రేస్ జాగుతున్న సమయంలో ప్రేక్షకుల కోసం పిట్‌స్టాప్స్, సీటింగ్, ఫెన్సింగ్ నిర్మాణం వంటి పనులను జరిగాయి. ఈ రేస్ నిర్వహించడానికంటే ముందు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి. ఈ రేస్ మొత్తమ్ పూర్తయ్యే వరకు వాహనదారులు తప్పకుండా అధికారులు సూచించిన వేరే మార్గాలను ఉపయోగించుకోవాలి.

More from DriveSpark

Article Published On: Thursday, November 17, 2022, 8:00 [IST]
English summary
Indias first official street circuit in hyderabad details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+