రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా భారత మార్కెట్లో చాలా కాలంగా విక్రయిస్తున్న స్కార్పియో ఎస్‌యూవీలో ఓ కొత్త తరం మోడల్ స్కార్పియో-ఎన్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ కేవలం రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరకే అందుబాటులో ఉంటుంది.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

ఈ ధర వద్ద మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్2 (Mahindra Scorpio-N Z2) బేస్ వేరియంట్ లభిస్తుంది. మరి ఈ బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు ఏంటి? ఈ ధర వద్ద ఇందులో విలువకు తగిన ఫీచర్లు లభిస్తాయా? ఈ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయడం వలన ప్రయోజనం ఉందా వంటి అనేక విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

సాధారణంగా, కార్ల తయారీ సంస్థలు తమ కార్లను బేస్, మిడ్, టాప్ అని మూడు వర్గాలలో విక్రయిస్తుంటారు. ఇందులో బేస్ వేరియంట్లు అతి తక్కువ ఫీచర్లను కలిగి ఉంటాయి. చాలా మంది ఈ బేస్ వేరియంట్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. సేల్స్‌మెన్స్ కూడా కస్టమర్లను టాప్-ఎండ్ వేరియంట్లను కొనేలా ప్రేరేపిస్తుంటారు. నిజానికి, బేస్ వేరియంట్లను కొనుగోలు చేయడం వలన చాలా డబ్బు ఆదా అవుతుంది.

రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

కారులో అనవసరమైన హడావిడి లేకుండా, నడపడానికి వీలుగా ఉండి, కావల్సిన ప్రాధమిక ఫీచర్లు ఉండే కార్లను కోరుకునే వారికి బేస్ వేరియంట్స్ ఎల్లప్పుడూ పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. బడ్జెట్ గురించి ఆలోచించే వారు నేరుగా బేస్ వేరియంట్లను కొనుగోలు చేయడం చాలా మంచిది. ఒకవేళ, భవిష్యత్తులో మీ వద్ద కొంత డబ్బు సమకూరినట్లయితే, అదే బేస్ వేరియంట్‌ను ఆఫ్టర్ మార్కెట్ విడిభాగాలతో టాప్-ఎండ్ వేరియంట్‌గా మార్చుకోవచ్చు.

రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

ఇక మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్2 బేస్ వేరియంట్ విషయానికి వస్తే, టాప్-ఎండ్ వేరియంట్లలో లభించే హై-ఫై టెక్ ఫీచర్లు ఈ బేస్ వేరియంట్లో లేనప్పటికీ, కంపెనీ దీని సేఫ్టీ ఫీచర్లలో మాత్రం కోతలు విధించలేదు. ఈ బేస్ వేరియంట్ స్కార్పియో-ఎన్‌లో ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు మరియు వెనుక చక్రాలపై వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లు మరియు చిన్నారుల కోసం ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్లను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా అందిస్తున్నారు. టాప్-ఎండ్ వేరియంట్లతో పోల్చుకుంటే, ఎక్స్టీరియర్స్‌లో క్రోమ్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి మరియు అల్లాయ్ వీల్స్‌కి బదులుగా 17 ఇంచ్ స్టీల్ వీల్స్ ఉంటాయి.

రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

ఇక ఈ బేస్ వేరియంట్ స్కార్పియో-ఎన్ జెడ్2లో లభించే ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, బెటర్ మైలేజ్ కోసం ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ, 2వ వరుస ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, మోనోక్రోమ్ ఎమ్ఐడి డిస్‌ప్లే యూనిట్, పవర్ విండోస్, 1-టచ్ టంబుల్ సెకండ్ రో సీట్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, సైడ్ మిర్రర్లపై అమర్చిన ఎల్ఈడి టర్న్ సిగ్నల్స్ మొదలైనవి ఉన్నాయి.

రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

పైన పేర్కొన్న ఫీచర్లను గమనిస్తే, ఎంట్రీ లెవల్ కార్లలోని మిడ్-రేంజ్ వేరియంట్లలో కూడా ఇలాంటి ఫీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే దీని అర్థం, స్కార్పియో-ఎన్ జెడ్2 బేస్ వేరియంట్ కారులోని డ్రైవర్ మరియు ప్యాసింజర్లకు అవసరమైన అన్ని కంఫర్ట్ అండ్ సేఫ్టీ పీచర్లతో లభిస్తుందని అర్థమవుతోంది. కాబట్టి, ఈ బేస్ వేరియంట్ స్కార్పియో-ఎన్ ను రూ.12 లక్షల వద్ద కొనుగోలు చేయడం వలన కస్టమర్లు చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. అదే, ఇందులో టాప్-ఎండ్ కోరుకునే వారు సుమారు రూ.19.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

టాప్-ఎండ్ వేరియంట్ స్కార్పియో-ఎన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు, రిచ్ కాఫీ బ్లాక్ లెథెరెట్ ఇంటీరియర్స్, హై పొజిషన్డ్ సీట్స్, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, యాంటీ-పించ్‌ డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ వన్ టచ్ పవర్ విండోస్, రియర్ ఏసి కంట్రోల్స్, ల్యాంప్ మరియు కూలింగ్ ఫీచర్ తో కూడిన గ్లోవ్ బాక్స్, సన్ గ్లాస్ హోల్డర్, మొబైల్ హోల్డర్‌తో కూడిన సీట్ మ్యాప్ పాకెట్, నావిగేషన్‌తో కూడిన 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సోనీ 3డి ఆడియో సిస్టమ్ వంటి అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు.

రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్2 బేస్ వేరియంట్ ఇంజన్ ఆప్షన్ల పరంగా కూడా మారదు. ఇందులోని 2.0-లీటర్ mStallion పెట్రోల్ ఇంజన్ 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 370 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కాగా, డీజిల్ ఇంజన్ మాత్రం తక్కువ ట్యూనింగ్‌తో కూడిన 2.2-లీటర్ mHark యూనిట్‌గా ఉంటుంది. ఇది 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

రూ.12 లక్షల మహీంద్రా స్కార్పియో-N (బేస్ వేరియంట్)లో లభించే ఫీచర్లు.. అసలు ఈ వేరియంట్‌ను కొనొచ్చా..?

మీరు ధర గురించి ఆలోచిస్తూ, బడ్జెట్‌లో నాణ్యమైన 7-సీటర్ ఎస్‌యూవీ కావాలనుకుంటే, మీరు ఓ సగటు 5-సీటర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ధరకే ఈ బేస్ వేరియంట్ మహీంద్రా స్కార్పియో-ఎన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ, ఒక కారులో ఉండాల్సిన అన్ని అవసరమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. కాబట్టి, దీనిని నిస్సందేహంగా కొనుగోలు చేయవ్చచు. ఒకవేళ, మీ బడ్జెట్ అనుమతిస్తే, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేసి, ఫుల్లీ టెక్ లోడెడ్ ఫీచర్లను ఆస్వాదించవచ్చు.

Most Read Articles

English summary
Is it worth to buy mahindra scorpio n z2 base variant for rs 12 lakhs lets find out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X