హోండా కార్లపై జనవరి 2022 డిస్కౌంట్స్.. ఏ మోడల్‌పై ఎంతంటే..?

దేశంలోని దాదాపు అన్ని కార్ బ్రాండ్లు తమ కార్ల ధరలను పెంచుతుంటే, జపనీస్ కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (Honda Cars India Limites) మాత్రం జనవరి 2022లో తమ కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. హోండా అందిస్తున్న అన్ని మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో హోండా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు దాదాపు రూ. 35,596 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో నగదు తగ్గింపు, ఉపకరణాలు, పొడిగించిన వారంటీ మరియు కార్ ఎక్స్ఛేంజ్ మరియు లాయల్టీ ప్రయోజనాలు మొదలైనవి ఉన్నాయి. ఈ ఆఫర్ జనవరి 31, 2022 వరకు చెల్లుబాటు అవుతుంది.

హోండా కార్లపై జనవరి 2022 డిస్కౌంట్స్.. ఏయో మోడల్‌పై ఎంతంటే..?

1. హోండా జాజ్ (Honda Jazz)

హోండా యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన జాజ్ మోడల్ పై కంపెనీ ఈ నెలలో రూ. 10,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 12,147 విలువైన యాక్సెసరీలు అందిస్తోంది. దీనితో పాటుగా కార్ల మార్పిడిపై (ఎక్సేంజ్‌పై) అదనంగా రూ. 7000 బోనస్, రూ. 5,000 తగ్గింపు మరియు రూ. 5,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 4000 కార్పొరేట్ డిస్కౌంట్ లను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ జనవరి నెలలో హోండా జాజ్ పై కంపెనీ మొత్తంగా రూ. 33,147 వరకూ విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

హోండా కార్లపై జనవరి 2022 డిస్కౌంట్స్.. ఏయో మోడల్‌పై ఎంతంటే..?

2. హోండా అమేజ్ (Honda Amaze)

హోండా మిడ్-సైజ్ సెడాన్ అమేజ్ పై కంపెనీ ఈ నెలలో రూ. 6000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 4000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. అందించబడుతోంది. ఈ నెలలో మొత్తం హోండా సిటీ కారుపై రూ. 15,000 వరకూ ఆదా చేసుకోవచ్చు. హోండా కొంత కాలం క్రితం అమేజ్ సెడాన్ ను కొత్త అవతార్‌లో ప్రవేశపెట్టింది. ఫలితంగా, ఈ మోడల్ కంపెనీ కంపెనీ భారీ తగ్గింపులు అందించడం లేదు. కొత్త మోడల్ రాక కారణంగా, అమేజ్ అమ్మకాలు అమేజింగ్ గా జరుగుతున్నాయి.

హోండా కార్లపై జనవరి 2022 డిస్కౌంట్స్.. ఏయో మోడల్‌పై ఎంతంటే..?

3. హోండా డబ్ల్యూఆర్-వి (Honda WR-V)

హోండా నుండి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఏకైక ఎస్‌యూవీ హోండా డబ్ల్యూఆర్-వి పై కంపెనీ ఈ నెలలో మొత్తంగా రూ. 26,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులోని అన్ని వేరియంట్‌లపై కార్ల మార్పిడిపై రూ. 10,000 తగ్గింపు ఇవ్వబడుతోంది. దీనికి అదనంగా రూ. 7000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 4000 కార్పొరేట్ డిస్కౌంట్ అందించబడుతోంది.

హోండా కార్లపై జనవరి 2022 డిస్కౌంట్స్.. ఏయో మోడల్‌పై ఎంతంటే..?

4. హోండా సిటీ (Honda City)

హోండా యొక్క మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీలోని నాల్గవ తరం (పాత) మోడల్‌పై కంపెనీ మొత్తంగా రూ. 20,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 5000 లాయల్టీ బోనస్, కార్ల మార్పిడికి రూ. 7,000 బోనస్, రూ. 8000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇది హోండా నుండి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ మరియు కంపెనీ ప్రస్తుతం ఈ మోడల్ తో పాటుగా ఐదవ తరం మోడల్ ను కూడా ఏకకాలంలో విక్రయిస్తోంది.

హోండా కార్లపై జనవరి 2022 డిస్కౌంట్స్.. ఏయో మోడల్‌పై ఎంతంటే..?

ఐదవ తరం మోడల్ విషయానికి వస్తే, జనవరి 2022 నెలలో కంపెనీ ఈ కారుపై రూ. 35,596 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు లేదా రూ. 10,596 విలువైన యాక్సెసరీలు అందించబడుతున్నాయి. అలాగే, కార్ల మార్పిడిపై రూ. 7000 బోనస్, రూ. 5000 తగ్గింపు మరియు రూ. 5000 లాయల్టీ బెనిఫిట్ ఇవ్వబడుతోంది. దీనితో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 8000 కూడా అందుబాటులో ఉంది.

హోండా కార్లపై జనవరి 2022 డిస్కౌంట్స్.. ఏయో మోడల్‌పై ఎంతంటే..?

ఈ ఆఫర్‌లు వాహనాల లభ్యతకు లోబడి ఉంటాయి మరియు వేరియంట్, రంగు ఎంపిక మరియు స్థానాన్ని బట్టి మారవచ్చు. ఈ ఆఫర్‌లకు సంబంధించిన పూర్తి మరియు ఖచ్చితమైన సమాచారం కోసం మీరు మీ సమీప హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఈ తగ్గింపుల ప్రభావం కంపెనీ విక్రయాల్లో కనిపించనప్పటికీ, హోండా విక్రయాలు గతేడాదితో పోలిస్తే 8 శాతం క్షీణతను నమోదు చేశాయి.

హోండా కార్లపై జనవరి 2022 డిస్కౌంట్స్.. ఏయో మోడల్‌పై ఎంతంటే..?

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ గడచిన డిసెంబర్ 2021 విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, డిసెంబర్ 2021లో హోంజా మొత్తం 7,973 యూనిట్ల కార్లు విక్రయించింది. డిసెంబర్ 2020 నెలలో హోండా విక్రయించిన 8,638 యూనిట్లతో పోలిస్తే గత నెలలో విక్రయాలు 7.70 శాతం క్షీణించాయి.ఏది ఏమైనా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ ఈ నెలలో అమ్మకాలను మరింత పెంచుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
January 2022 offers and discounts on honda cars amaze city jazz details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X