ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలన్నీ కొత్త కొత్త వాహనాలు విడుదల చేస్తుంటే, అమెరికన్ కార్ తయారీ సంస్థ 'జీప్' (Jeep) మాత్రం తన 'కంపాస్' (Compass) ధరలను భారీగా పెంచింది. కంపెనీ ఇప్పుడు ఇందులోని దాదాపు అన్ని వేరియంట్స్ ధరలను పెంచింది.

Recommended Video

Jeep Meridian రివ్యూ | డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ప్రస్తుతం జీప్ కంపెనీ తన కంపాస్ SUV ధరలను ఎంతవరకు పెంచింది, ఆ వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, జీప్ కంపాస్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా రూ. 90,000 పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత బేస్ స్పోర్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 19.29 లక్షలకు చేరింది. అదే సమయంలో టాప్-ఎండ్ వేరియంట్ అయిన ట్రైల్‌హాక్‌ ధర రూ. 32.22 లక్షలకు చేరింది.

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

ఏఏపీ కంపాస్ 2022 ఏప్రిల్ లో కూడా ఒకసారి ధరలను పెంచింది. ధరలు పెరుగుదల ఇప్పటికి వరుసగా మూడవసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ధరల పెరుగుదల వల్ల ఈ సంవత్సరం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. కావున జీప్ కంపాస్ ధరలు మునుపటికంటే కూడా రూ. 1.50 లక్షలు ఎక్కువ. ఇది కొనుగోలుదారులపైన భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది.

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

జీప్ కంపెనీ తన కంపాస్ SUV ని 2017 లో ఫ్లాగ్‌షిప్ SUV గా విడుదల చేసింది. కాగా క్రమంగా కంపెనీ ఇందులో అప్డేటెడ్ వెర్షన్స్ విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత నెలలో కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ధర దేశీయ మార్కెట్లో రూ. 24.44 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

జీప్ కంపాస్ SUV మొత్తమ్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 2.0 లీటర్ బిఎస్6 డీజిల్ ఇంజన్. ఇంజన్ 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, కావున మంచి పనితీరుని అందిస్తుంది.

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

ఇక 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

జీప్ కంపాస్ ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది. కావున హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, హానీ కూంబ్ ఇన్సర్ట్‌లతో అప్‌డేట్ చేయబడిన 7-స్లేట్ గ్రిల్, న్యూ ఫ్రంట్ బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్ ఉన్నాయి. ఈ కారు యొక్క సైడ్ ప్రొఫైల్ కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో కొత్త డాష్‌బోర్డ్ ఉంది, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఎసి వెంట్స్ మరియు హెచ్‌విఎసి కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో కంపెనీ యొక్క యుకనెక్ట్ 5 టెక్నాలజీ ఇవ్వబడింది. అంతే కాకుండా.. అమెజాన్ అలెక్సా సపోర్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మరియు ఓవర్ ఎయిర్ అప్‌డేట్ ఈ కారులో అందించబడ్డాయి.

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

జీప్ కంపాస్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి, ఇఎస్‌సి, హిల్ డీసెంట్ కంట్రోల్, పానిక్ బ్రేక్ అసిస్ట్, రెడీ అలర్ట్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ అండ్ బ్రేక్ లాక్ డిఫరెన్షియల్, రైన్ బ్రేక్ సపోర్ట్, సెలెక్ట్ టెర్రైన్ 4x4 సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రతను కల్పిస్తాయి.

ఓరి దేవుడో.. ఒకేసారి ఆ SUV ధర రూ. 90,000 పెరిగింది, అది ఏదో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ధరల పెరుగుదల అనేది కొత్తేమీ కాదు, ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. అయితే ఇప్పుడు జీప్ కంపాస్ ఇప్పుడు రూ. 90,000 పెంచడం వల్ల అమ్మకాలపైనా ఏమైనా ప్రభావం ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. ధరల పెరుగుదల తరువాత కంపెనీ యొక్క ఈ SUV ఎలాంటి అమ్మకాలు పొందుతుంది అనేది తెలియాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 7, 2022, 8:00 [IST]
English summary
Jeep compass price hike by rs 90000 details
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+