వారెవ్వా: ఎండా లేదు చలీ లేదు.. థార్ ఎడారిలో '2022 Jeep Compass Trailhawk' అద్భుత రికార్డ్
ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త '2022 జీప్ కంపాస్ ట్రయిల్‌హాక్' (2022 Jeep Compass Trailhawk) భారతదేశంలోని 'థార్ ఎడారి' (గ్రేట్ ఇండియన్ డిసార్ట్) దాటిన మొదటి SUV గా రికార్డ్ సాధించింది. కొత్త జీప్ ట్రయిల్‌హాక్ మొత్తం మీద దాదాపుగా 1,200 కిలోమీటర్ల ఆఫ్ రోడ్‌ను కవర్ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది. ఇది నిజంగా చాలా గొప్ప అరుదైన విషయం.

కంపెనీ యొక్క ఈ కొత్త SUV ఎడారి ప్రాంతంలో ఇసుక తిన్నెలు, రాతి ప్రాంతాలు మరియు ఉప్పు మైదానాల గుండా ప్రయాణించి తన సామర్థ్యాన్ని ఋజువు చేసుకుంది. జీప్ కంపాస్ ట్రయిల్‌హాక్ SUV థార్ ఎడారిలో 1,200 కి.మీ ప్రయాణాన్ని 72 గంటల సమయం పట్టింది. కంపాస్ ట్రైల్‌హాక్ ఈ ఎడారిలో ప్రయాణించే సమయంలో పగటిపూట 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల ఎదుర్కొని, రాత్రిపూట దాదాపు గడ్డకట్టే చలి వంటి పరిస్థితులను కూడా విజయవంతంగా ఎదుర్కోగలిగింది.

మొత్తం మీద జీప్ కంపాస్ ట్రయిల్‌హాక్ రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ నుండి గుజరాత్‌లోని కచ్ వరకు ప్రయాణించింది. ఈ సమయంలో SUV తీవ్ర ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాలైన అలీసర్, బికనేర్, ధని, సేనా డూన్స్, ఛోటే రాన్, కాలా దుంగార్, వర్జిన్ డ్యూన్స్, బార్నర్, జైసల్మేర్ మరియు కచ్ ప్రాంతాల గుండా వెళ్లింది. ఇందులో అనేక ఇసుక దిబ్బలు మరియు రాతి మార్గాలను కూడా అవలీలగా దాటగలిగింది.

జీప్ కంపెనీ తన 'కంపాస్ ట్రైల్‌హాక్' (Compass Trailhawk) SUV ని గత నెలలో రూ. 30.72 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. 2022 జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది కొత్త హెడ్‌ల్యాంప్‌లు మరియు గ్రిల్ కలిగి ఉంది. అంతే కాకూండా ఇది మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఇందులో షార్ప్‌గా కట్ బంపర్‌లు ఉంటాయి. ఇది కొత్త బోనెట్ డెకాల్, చిన్న 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 225/65 R17 సెక్షన్ టైర్లను పొందటమే కాకుండా.. రియర్ రెడ్ హుక్, స్కఫ్ ప్లేట్ మరియు ఫెండర్‌లపై కొత్త ట్రయల్ రేటింగ్ బ్యాడ్జ్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా దీనిని మరింత దూకుడుగా కనిపించేలా చేస్తాయి.

2022 జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఫేస్‌లిఫ్ట్ 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్‌కలిగి ఉంటుంది. ఇది 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టం కూడా ప్రామాణికంగా కలిగి ఉంటుంది.

ఇందులోని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది చాలావరకు దాని పాత మోడల్ ని గుర్తు చేస్తుంది. దీని లోపల అప్డేటెడ్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఉండే కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ మరియు సీట్లపై ఉన్న 'ట్రైల్‌హాక్' లోగోలు దీనిని మరింత ఆధునికంగా చూపిస్తాయి. ఇందులో 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు 10.25-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి.

ఈ 2022 జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED ఫాగ్ ల్యాంప్స్, ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, 360-డిగ్రీ కెమెరా మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని కూడా పొందుతుంది. దీనితో పాటు ఇందులో వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్‌లు ఉన్నాయి.

కంపాస్ ట్రైల్‌హాక్ ఫేస్‌లిఫ్ట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, పానిక్ బ్రేక్ అసిస్ట్, రెడీ అలర్ట్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ మరియు బ్రేక్ లాక్ డిఫరెన్షియల్, రెయిన్ బ్రేక్ సపోర్ట్, సెలెక్ట్ టెర్రైన్ 4x4 సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

ఈ కొత్త జీప్ రైడ్ ఎత్తు ఒక అంగుళం పెంచబడింది, కాతుం ఇది ఇప్పుడు 205 మిమీ వద్ద ఉంటుంది. రీ-ప్రొఫైల్ ఫ్రంట్ బంపర్‌తో పాటు, 30 డిగ్రీల మెరుగైన అప్రోచ్ యాంగిల్‌ను ఇస్తుంది. ఇది ఎటువంటి రోడ్డుపై అయిన సజావుగా ముందుకు సాగె విధంగా రూపొందించడం జరిగింది.

ట్రైల్‌హాక్ పూర్తి అండర్‌బాడీ ప్రొటెక్షన్ ప్లేట్లు, మెరుగైన సైడ్‌వాల్ రక్షణ కోసం చిన్న 17-ఇంచెస్ రిమ్‌లు, మడ్ ప్లస్ స్నో టైర్ వంటి వాటిని పొందుతుంది. మొత్తం మీద ఇప్పుడు కంపెనీ యొక్క ఈ కొత్త SUV ఇంత గొప్ప రికార్డ్ సొంత చేసుకోవడం వల్ల తప్పకుండా ఎక్కువమంది ఆఫ్ రోడర్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








