జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ (Jeep) భారతదేశంలో విక్రయిస్తున్న తమ పాపులర్ కంపాస్ (Compass) 5-సీటర్ ఎస్‌యూవీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్చి 31, 2022 వ తేదీ నుండి భారతదేశంలో జీప్ కంపాస్ ఎస్‌యూవీ ధరలు పెరగనున్నాయి. అయితే, ఈ ధరలను ఎంత మేర పెంచనున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దేశీయ మార్కెట్లో తమ 7-సీటర్ ఎస్‌యూవీ జీప్ మెరిడియన్ (Meridian) ను ఆవిష్కరించిన తర్వాత కొత్త ధరలు వెల్లడి చేయబడతాయని సమాచారం.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

జీప్ ఇండియా ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఎడిషన్ ధరలు కూడా ప్రభావితం అయ్యే అవకాసం ఉంది. కంపెనీ ఈ కొత్త మోడల్ ను ఇటీవలే భారతదేశంలో విడుదల చేసింది మరియు ఇది స్టాండర్డ్ జీప్ కంపాస్ యొక్క మరింత ఆఫ్-రోడ్ ఫోకస్డ్ వేరియంట్ గా ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ (Jeep Compass Trailhawk) వేరియంట్ ధర రూ. 30.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

డిజైన్ పరంగా చూస్తే, కొత్త జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఎడిషన్ సిల్వర్ ఫినిష్డ్ బాష్ ప్లేట్‌తో కొంచెం ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. ఇందులో ముందు వైపు కొత్త 7-స్లాట్ వెర్టికల్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టి బ్లాక్ యాక్సెంట్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్, రెండు రెడ్ టో హుక్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. కొత్త జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌లోని ఇతర మార్పులను చూస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన కొత్త ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ సెట్, బానెట్‌పై యాంటీ-గ్లేర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్, రీడిజైన్ చేయబడిన వెనుక బంపర్ మరియు బాడీ చుట్టా బ్లాక్ క్లాడింగ్ మొదలైనవి ఉన్నాయి.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇది జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ కి చాలా దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. అయితే, జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ లోపలి భాగం పూర్తిగా నలుపు రంగులో ఉండే ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సీట్లు, డోర్ ట్రిమ్‌లు మరియు డ్యాష్‌బోర్డ్‌పై కాంట్రాస్ట్ రెడ్ కలర్ స్టిచింగ్ ఉంటుంది. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ లో భారతదేశంలో విక్రయించబడుతున్న స్టాండర్డ్ జీప్ కంపాస్ లో ఉపయోగించిన అదే ఇంజన్ ను ఉపయోగించారు.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

ఇందులోని 2.0 లీటర్, 4 సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పిల శక్తిని మరియు 350 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. కొత్తగా వచ్చిన జీప్ కంపాస్ ట్రైల్‌హాక్, ప్రస్తుత స్టాండర్డ్ జీప్ కంపాస్‌ ఎస్‌యూవీ మరింత ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ వేరియంట్ కాబట్టి, ఇందులో జీప్ యొక్క సెలెక్‌టెరైన్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఇంజన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి మొత్తం నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ యొక్క ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, ఇందులో 'రాక్' అనే ప్రత్యేకమైన డ్రైవింగ్ మోడ్ కూడా ఉంటుంది.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

మార్చి 29న జీప్ మెరిడియన్ (Jeep Meridian) విడుదల

ఇదిలా ఉంటే, జీప్ బ్రాండ్ నుండి భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త "జీప్ మెరిడియన్" (Jeep Meridian) 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీని కంపెనీ మార్చి 29, 2022వ తేదీన దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనుంది. మూడు వరుసలు మరియు ఏడు సీట్లు కలిగిన మెరీడియన్ ఎస్‌యూవీని, కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న 5-సీటర్ జీప్ కంపాస్ (Jeep Compass) ఎస్‌యూవీకి ఎగువన విడుదల కానుంది.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

జీప్ మెరిడియన్ 7-సీటర్ ఎస్‌యూవీ చూడటానికి దక్షిణ అమెరికా మార్కెట్లో విక్రయించబడుతున్న 'జీప్ కమాండర్' (Jeep Commander) ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుంది. కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'జీప్ కంపాస్' (Jeep Compass) ను ఆధారంగా చేసుకొని తయారు చేయనుంది.

కాబట్టి, ఇది జీప్ కంపాస్ మాదిరిగానే ఒకే విధమైన డిజైన్ సిల్హౌట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

అయితే, ఈ రెండు మోడళ్ల మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు కంపెనీ జీప్ మెరిడియన్ లో కొత్తగా కనిపించే ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త వీల్స్ వంటి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఇంకా ఇందులో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన దీర్ఘచతురస్రాకారపు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, వెడల్పాటి ఎయిర్-ఇన్‌లెట్‌లతో కూడిన పెద్ద ఫ్రంట్ బంపర్ మరియు మజిక్యులర్ బానెట్ లైన్స్ తో ఇది ముందు వైపు నుండి మంచి అగ్రెసివ్ స్టైలింగ్ ను కలిగి ఉంటుంది.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) రాక తర్వాత పెరగనున్న జీప్ కంపాస్ (Jeep Compass) ధరలు!

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అనేక ఇతర ఫీచర్లను కూడా ఈ ఎస్‌యూవీలో ఆఫర్ చేసే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, ఈ కొత్త జీప్ మెరిడియన్‌ ఎస్‌యూవీలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను కూడా అందించవచ్చని భావిస్తున్నారు. ఇందులో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి లెవల్ వన్ అటానమస్ ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, March 25, 2022, 16:05 [IST]
English summary
Jeep india to increases compass price from march 31 trailhawk price also likely to be affected
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+