భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

అమెరికాకు చెందిన ఐకానిక్ ఎస్‌యూవీ తయారీ సంస్థ జీప్ (Jeep) బ్రాండ్ నుండి భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త "జీప్ మెరిడియన్" (Jeep Meridian) 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ విడుదలకు ముహుర్తం ఖరారైంది. కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని మార్చ్ 29, 2022వ తేదీన భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. మూడు వరుసలు మరియు ఏడు సీట్లు కలిగిన మెరీడియన్ ఎస్‌యూవీని, కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న 5-సీటర్ జీప్ కంపాస్ (Jeep Compass) ఎస్‌యూవీకి ఎగువన ప్రవేశపెట్టనుంది.

భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

కొత్త జీప్ మెరిడియన్ కోసం కంపెనీ ఇప్పటికే కొన్ని టీజర్లను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ వీడియోలలో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. జీప్ మెరిడియన్ చూడటానికి దక్షిణ అమెరికా మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న 'జీప్ కమాండర్' (Jeep Commander) మాదిరిగా ఉంటుంది. భారత మార్కెట్లో జీప్ బ్రాండ్ విక్రయిస్తున్న 5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'జీప్ కంపాస్' (Jeep Compass) ను ఆధారంగా చేసుకొని మెరిడియన్ 7-సీటర్ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు.

భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

ఒక్కమాటలో చెప్పాలంటే, జీప్ మెరిడియన్ 5-సీటర్ జీప్ కంపాస్ యొక్క పొడగించిన 7-సీటర్ వెర్షన్ గా ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన అధికారిక చిత్రాలను బట్టి చూస్తే, ఇది జీప్ కంపాస్ మాదిరిగానే ఒకే విధమైన డిజైన్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. అయితే, కంపాస్ తో పోల్చి చూసినప్పుడు మెరిడియన్ కాస్తంత నిటారుగా ఉండే వైఖరిని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రెండు మోడళ్లను వేరుగా ఉంచేందుకు కంపెనీ మెరిడియన్ లో కాస్తంత భిన్నమైన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త వీల్స్ వంటి మార్పులు చేర్పులు చేసింది.

భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ ఎస్‌యూవీని కంపెనీ సింగిల్-టోన్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌ లలో అందించబడుతుందని ఇటీవల విడుదలైన చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఇక దీని డిజైన్ ఎలిమెంట్స్ ను గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన దీర్ఘచతురస్రాకారపు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, వెడల్పాటి ఎయిర్-ఇన్‌లెట్‌లతో కూడిన పెద్ద ఫ్రంట్ బంపర్ మరియు మజిక్యులర్ బానెట్ లైన్స్ తో ఇది ముందు వైపు నుండి మంచి అగ్రెసివ్ స్టైలింగ్ ను కలిగి ఉంటుంది.

భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

అలాగే, ఈ ప్రీమియం ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్ లో కొత్తగా డిజైన్ చేసిన U- ఆకారపు అల్లాయ్ వీల్స్‌ మరియు ప్రత్యేకమైన వీల్ ఆర్చ్‌లు, సింపుల్ గా మరియు స్ట్రైట్ గా కనిపించే సైడ్ బాడీ లైన్స్, ఏ-పిల్లర్ నుండి డి-పిల్లర్ వరకూ ఉండే క్రోమ్ రూఫ్ లైన్, పియానో బ్లాక్ ఫినిష్ లో ఉండే సైడ్ మిర్రర్స్, ఫ్లాట్ రూఫ్ లైన్, పొడవాటి రియర్ ఓవర్‌హాంగ్‌లు, నిటారుగా ఉన్న టెయిల్‌గేట్ మరియు క్షితిజ సమాంతరంగా ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లతో ఇది ఓవరాల్ గా మంచి మజిక్యులర్ రూపాన్ని కలిగి ఉంటుంది.

భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

జీప్ మెరిడియన్ రియర్ ప్రొఫైల్ చూడటానికి జీప్ గ్రాండ్ చెరోకీ మరియు వాగోనీర్ మోడళ్ల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. కొత్త 2022 జీప్ మెరిడియన్ క్యాబిన్ లోపల ఆఫర్ చేయబోయే ఫీచర్ల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, ఇది ప్రస్తుత జీప్ కంపాస్ కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అమెజాన్ అలెక్సా సపోర్ట్ మరియు ప్రీమియం లెథర్ అప్‌హోల్స్టరీతో కూడిన వెంటిలేటెడ్ సీట్లు మొదలైన వాటిని ఆశించవచ్చు.

భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

అంతేకాకుండా, ఈ కారులో పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అనేక ఇతర ఫీచర్లను కూడా ఈ ఎస్‌యూవీలో ఆఫర్ చేసే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, ఈ కొత్త జీప్ మెరిడియన్‌ ఎస్‌యూవీలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను కూడా అందించవచ్చని భావిస్తున్నారు. ఇందులో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి లెవల్ వన్ అటానమస్ ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

జీప్ మెరిడియన్ 6 లేదా 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌ లతో అందుబాటులోకి రానుంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా చూస్తే, ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఫ్రండ్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఈఎస్‌సి, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటివి మరెన్నో లభ్యం కానున్నాయి.

భారత్‌లో జీప్ మెరిడియన్ (Jeep Meridian) 7-సీటర్ విడుదలకు ముహుర్తం ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

ఇక చివరగా ఇంజన్ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కేవలం డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో పవర్‌ఫుల్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4 డీజిల్ ఇంజన్ ను ఉపయోగించనున్నారు. ఈ డీజిల్ ఇంజన్ 48 V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ తో జతచేయబడి ఉంటుందని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా సుమారు 200 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్ ఆల్-వీల్ డ్రైవ్ (4X4) కూడా లభిస్తుందని సమాచారం.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2022, 19:36 [IST]
English summary
Jeep meridian 7 seater suv to be unveiled on 29th march all you need to know about it
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+