కొత్త మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో 2022 మే నెల 19 న అమెరికన్ కార్ తయారీ దిగ్గజం జీప్ (Jeep) తన జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ ని విడుదల చేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదలచేయకముందే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు డెలివరీలను కూడా ప్రారంభించినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

జీప్ మెరిడియన్‌ భారతీయ మార్కెట్లో మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని బేస్ మోడల్ యొక్క ప్రారంభ ధర రూ. 29.90 లక్షలు (జీప్ మెరిడియన్ లిమిటెడ్, మ్యాన్యువల్). ఇక టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. రూ.36.95 లక్షలు (జీప్ మెరిడియన్ లిమిటెడ్ ఆప్షనల్, ఆటోమేటిక్, ఆల్-వీల్ డ్రైవ్). (ధరలు ఎక్స్-షోరూమ్ ఇండియా). కొత్త జీప్ మెరిడియన్ అనేది కంపెనీ యొక్క 7 సీటర్ ఎస్‌యూవీ. ఇది లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త జీప్ మెరిడియన్ 7 సీటర్, ఇప్పటికే దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న జీప్ కంపాస్ 5-సీటర్ ఆధారంగా రూపొందించబడింది. అయితే ఇది చూడటానికి కంపాస్ మాదిరిగా ఉన్నప్పటికీ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. కొత్త మెరిడియన్ 7-స్లాట్ గ్రిల్‌ కలిగి దానికి రెండువైపులా సొగసైన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఇక ఫ్రంట్ బంపర్‌లో క్రోమ్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా దీని ఆకర్షణను మరింత పెంచుతాయి.

మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

వీటితో పాటు ఫ్రంట్ బంపర్, వీల్ ఆర్చ్‌లు మరియు బ్లాక్ క్లాడింగ్‌ వంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక సైడ్ ప్రొఫైల్ లో కొత్త 18 ఇంచ్ అల్లాయ్ అల్లాయ్ వీల్స్‌ చూడవచ్చు. వెనుక భాగంలో రియర్ బంపర్, సొగసైన ఎల్ఈడి టెయిల్‌లైట్స్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద కంపెనీ యొక్క ఈ 7 సీటర్ మంచి డిజైన్ పొందుతుంది.

మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

ఇప్పుడు మెరిడియన్ 7 సీటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది ఆల్పైన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.

మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

జీప్ మెరిడియన్ లో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ మల్టీఎయిర్ డీజిల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 - 2,500 ఆర్‌పిఎమ్ మధ్య 350 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఏఆర్ఏఐ ద్రువీకరించినదాని ప్రకారం ఒక లీటరుకు 16.2 కిలోమీటర్లు అందిస్తుందని తెలిసింది. అయితే వాస్తవ ప్రపంచంలో ఎలా ఉంటుందో తెలియాలి.

మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

జీప్ మెరిడియన్ లో ముఖ్యంగా తెలుసుకోవలసింది దాని పరిమాణం. కావున ఈ ఎస్‌యూవీ పొడవు 4,769 మిమీ, వెడల్పు 1,859 మిమీ, ఎత్తు 1,682 మిమీ ఉంటుంది. అదే విధంగా వీల్‌బేస్ పరిమాణం 2,636 మిమీ కాగా, బూట్ స్పేస్ 170 లీటర్స్ వరకు ఉంటుంది. మరింత ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే మూడవ వరుస సీట్లను ఫోల్డ్ చేయవచ్చు. తద్వారా మీరు 481 లీటర్ల బూట్ స్పేస్ పొందుతారు.

మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

చివరగా ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు దాదాపు 60 కి పైగా భద్రతా ఫీచర్స్ ఉన్నాయి. కావున ఇందులో సేఫ్టీకి ఏ లోటు లేదు అనే చెప్పాలి.

మెరిడియన్ డెలివరీలు ప్రారంభించిన జీప్: పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మొత్తానికి జీప్ వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెరిడియన్ 7 సీటర్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ లేటెస్ట్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 50,000 చెల్లింది జీప్ కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో లేదా కంపెనీ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు కొత్త బైకులు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, June 16, 2022, 9:39 [IST]
English summary
Jeep meridian delivery starts price engine exterior interior details
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+