జీప్ మెరిడియన్ టీజర్ వచ్చేంది.. త్వరలోనే భారత మార్కెట్లో విడుదల.. 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ..!
అమెరికన్ ఆటో మేజర్ జీప్ (Jeep), భారతదేశంలో మరో కొత్త ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. జీప్ మెరిడియన్ (Jeep Meridian) పేరుతో కంపెనీ ఓ కొత్త 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీని ఇక్కడి మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఓ కొత్త టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. ఈ టీజర్ వీడియోలో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీకి సంబంధించిన అనేక ఎక్స్టీరియర్ వివరాలను కంపెనీ వెల్లడి చేసింది.

అయితే ఈ టీజర్ వీడియోలో కంపెనీ భారీగా క్యామోఫ్లేజ్ చేసిన జీప్ మెరిడియన్ 7-సీటర్ ఎస్‌యూవీని చూపుతున్నప్పటికీ, ఈ ఎస్‌యూవీ యొక్క చాలా బాహ్య వివరాలు వెల్లడయ్యాయి. జీప్ మెరిడియన్ విషయానికి వస్తే, ఇది జీప్ బ్రాండ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన 5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'జీప్ కంపాస్' (Jeep Compass) యొక్క ఏడు-సీట్ల వెర్షన్ మరియు ఇది మొదట దక్షిణ అమెరికా మార్కెట్లో 'జీప్ కమాండర్' (Jeep Commander)గా ప్రారంభించబడింది.

జీప్ ఆవిష్కరించిన టీజర్ వీడియో ప్రకారం, రాబోయే జీప్ మెరిడియన్ కొత్తగా ఫేస్‌లిఫ్ట్ చేసిన జీప్ కంపాస్ ఎస్‌యూవీని పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లను వేరు చేయడానికి కంపెనీ జీప్ మెరిడియన్ లో సన్నగా కనిపించే హెడ్‌ల్యాంప్‌లు వంటి సూక్ష్మమైన కాస్మెటిక్ మార్పులు చేయనుంది. అయితే, టీజర్ వీడియో రాబోయే జీప్ మెరిడియన్ ఇంటీరియర్‌లను మాత్రం వెల్లడించలేదు.

సమాచారం ప్రకారం, జీప్ మెరిడియన్ భారతదేశంలోని జీప్ కంపాస్‌కు ఎగువన ఉంచబడే పెద్ద వాహనం కాబట్టి, కంపెనీ 'ప్రీమియం' ధర ట్యాగ్‌ను సమర్థించేందుకు ఇంటీరియర్‌ను మరింత అప్‌మార్కెట్‌గా మారుస్తుందని భావిస్తున్నారు. దక్షిణ అమెరికా మార్కెట్‌లలోని జీప్ కమాండర్‌లో, డ్యాష్‌బోర్డ్‌లో ప్రీమియం లెథర్ ఇన్‌సెర్ట్ లు మరియు మరింత ప్రీమియంగా కనిపించే స్వెడ్ ట్రిమ్‌తో భర్తీ చేయబడి ఉంటుంది మరియు ఇందులోని సీట్లు ప్రీమియం బ్రౌన్ లెదర్ మరియు స్వెడ్ అప్‌హోలెస్ట్రీతో రీప్లేస్ చేయబడి ఉంటాయి.

ఈ మార్పులకు అదనంగా, జీప్ కమాండర్ దిగువ సెంటర్ కన్సోల్‌లో రోస్ గోల్డ్ యాక్సెంట్స్ ను కూడా పొందుతుంది. ఇది కాకుండా, జీప్ కమాండర్ మూడవ వరుస సీటింగ్ ను సులభంగా యాక్సెస్ చేయడం కోసం మధ్య-వరుసలో 60 : 40 నిష్పత్తిలో మడచగలిగిన స్ప్లిట్ సీట్లు కూడా ఉంటాయి. ఫీచర్ల విషయానికొస్తే, ఈ కొత్త జీప్ మెరిడియన్ లో పెద్ద 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మొదలైనవి ఉంటాయి.

అంతేకాకుండా, ఈ కారులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇంకా ఇందులో యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు మరెన్నో ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఫ్రండ్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఈఎస్‌సి, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటివి మరెన్నో ఉన్నాయి.
జీప్ మెరిడియన్ కారులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మొదలైన ఫీచర్లు లభించవచ్చని అంచనా. ఇంజన్ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4 డీజిల్ ఇంజన్ ను ఉపయోగించనున్నారు. ఈ డీజిల్ ఇంజన్ 48 V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ తో జతచేయబడి ఉంటుంది.

ఈ ఇంజన్ గరిష్టంగా సుమారు 200 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందని మరియు జీప్ యొక్క ప్రయత్నించిన మరియు పరీక్షించిన 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా, జీప్ మెరిడియన్ 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లతో కూడా లభిస్తుందని సమాచారం మరియు ఇది స్టాండర్డ్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) తో కూడా లభిస్తుందని పేర్కొనబడింది.

కొత్త జీప్ మెరిడియన్ గురించి డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం
భారతదేశంలో విక్రయించబడుతున్న జీప్ కంపాస్ ఎస్‌యూవీతో పోలిస్తే కొత్తగా రాబోయే 2022 జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ మరింత విలాసవంతమైన ఇంటీరియర్‌తో వస్తుందని మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా, జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ భారతదేశంలో జీప్ బ్రాండ్ మంచి పనితీరును కనబరుస్తుందని కూడా భావిస్తున్నాము. ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








