భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Jeep Meridian': పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'జీప్' (Jeep) భారతీయ మార్కెట్లో కొత్త 'జీప్ మెరిడియన్' (Jeep Meridian) 7-సీటర్ ఎస్‌యూవిని ఆవిష్కరించింది. ఈ కొత్త ఎస్‌యూవి జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది, అయితే బుకింగ్స్ మాత్రం మే నెలలో ప్రారంభమవుతాయి. ఈ కొత్త జీప్ మెరిడియన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారత్ లో ఆవిష్కరించబడిన 'Jeep Meridian': పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన 'జీప్ మెరిడియన్' ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV కూడా దాదాపు కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. కానీ దీనికి మరింత ఫ్రీమియం డిజైన్ అందించడానికి చాలా చోట్ల క్రోమ్ ఉపయోగించబడింది.

భారత్ లో ఆవిష్కరించబడిన 'Jeep Meridian': పూర్తి వివరాలు

కొత్త 'జీప్ మెరిడియన్' డిజైన్ దాదాపుగా దాని కంపాస్‌ను గుర్తుకు తెస్తుంది. కానీ దీని వెనుక భాగం మాత్రం చాలా ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇక సైడ్ ప్రొఫైల్ 18-ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త SUV యొక్క డిజైన్ చాలా అద్భుతంగా ఉంది.

భారత్ లో ఆవిష్కరించబడిన 'Jeep Meridian': పూర్తి వివరాలు

'జీప్ మెరిడియన్' యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ టోన్ ఇంటీరియర్ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ మరియు డోర్ ప్యానెల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్‌ ఉంటాయి. అయితే సీట్లు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. ఈ కొత్త SUV 7 సీటర్ కావున రెండవ మరియు మూడవ వరుస సీట్లు కలిగి ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయి. ఇది క్యాబిన్ కలిగి ఉండటమే కాకుండా, లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ అన్నీ కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయి.

భారత్ లో ఆవిష్కరించబడిన 'Jeep Meridian': పూర్తి వివరాలు

ఇందులో మూడవ వరుస సీట్లకు వెళ్ళడానికి రెండవ వరుస సీట్లను ఫోల్డ్ చేయవచ్చు. అంతే కాకుండా మూడవ వరుస సీట్లను పూర్తిగా ఫోల్డ్ చేయవచ్చు, కానీ రెండవ వరుస సీట్లను 60:40 నిష్పత్తిలో ఫోల్డ్ చేయవచ్చు. వెనుక వుండే ప్రయాణికుల కోసం ఎయిర్ బ్లోవర్ మరియు కప్ హోల్డర్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

భారత్ లో ఆవిష్కరించబడిన 'Jeep Meridian': పూర్తి వివరాలు

ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు పవర్డ్ లిఫ్ట్‌గేట్ వంటివి ఉన్నాయి.

భారత్ లో ఆవిష్కరించబడిన 'Jeep Meridian': పూర్తి వివరాలు

కొత్త జీప్ మెరిడియన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అబ్స్టాకిల్ డిటెక్షన్ మరియు యాంటీ పించ్ సెన్సింగ్ సేఫ్టీ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిస్తాయి.

భారత్ లో ఆవిష్కరించబడిన 'Jeep Meridian': పూర్తి వివరాలు

జీప్ మెరిడియన్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 4,769 మిమీ పొడవు, 1,859 మిమీ వెడల్పు మరియు 1,682 మిమీ ఎత్తు ఉంటుంది. అంతే కాకూండా దీని వీల్‌బేస్ 2,794 మిమీ వరకు ఉంటుంది. జీప్ మెరిడియన్ తన 5-సీటర్ కంపాస్ కంటే 364 మిమీ పొడవు, 41 మిమీ వెడల్పు మరియు 42 మిమీ ఎత్తు ఎక్కువగా ఉంటుంది.

భారత్ లో ఆవిష్కరించబడిన 'Jeep Meridian': పూర్తి వివరాలు

ఈ ఆధునిక 7 సీటర్ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ మల్టీజెట్ టర్బో డీజిల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 168 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 10.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్ట వేగం గంటకు 198 కిమీ.

More from DriveSpark

Article Published On: Tuesday, March 29, 2022, 20:14 [IST]
English summary
Jeep meridian unveiled design features seating engine details
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+