మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ జులై 2022 నెలలో తమ కార్లపై వివిధ రకాల ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తోంది. కార్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు మారుతి సుజుకి ఈ జూలైలో తమ పెట్రోల్ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. జూలై 2022 నెలలో మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ. 74,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ నెలలో వివిధ రకాల మోడళ్లపై మారుతి సుజుకి అందిస్తున్న తగ్గింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

1) మారుతి ఆల్టో - రూ. 34,000 వరకు ఆదా

మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడయ్యే హ్యాచ్‌బ్యాక్ లలో ఒకటైన ఆల్టో కారు యొక్క రెగ్యులర్ వెర్షన్లపై కంపెనీ ఈ నెలలో రూ.31,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 10,000 విలువైన వినియోగదారు ఆఫర్‌లు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు రూ. 6,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి. ఆల్టో యొక్క హాయ్ టూర్ వెర్షన్‌పై కంపెనీ రూ. 9,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది, ఈ వేరియంట్ పై గరిష్టంగా రూ. 34,000 ఆదా అవుతుంది.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి త్వరలోనే భారతదేశంలో ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ యొక్క కొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం, 2020లో BS6 నిబంధనల అమలు కారణంగా నిలిపివేయబడిన ఆల్టో కె10 (పెద్ద ఆల్టో కారు) కారును కంపెనీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తిరిగి భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ కారుకి ఇంకా మార్కెట్ ఉందని మరియు దానికి పెద్దగా పోటీ లేదని మారుతి భావించడంతో కొత్త మోడల్ ఆల్టో కె10 కారుని Y0M అనే కోడ్‌నేమ్‌తో తిరిగి సరికొత్తగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

2) మారుతి సెలెరియో - రూ. 51,000 వరకు ఆదా

మారుతి సుజుకి సెలెరియో యొక్క LXi మరియు VXi పెట్రోల్ వెర్షన్‌లపై రూ. 51,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. ఈ సేవింగ్స్‌లో రూ. 30,000 విలువైన వినియోగదారు ఆఫర్‌లు, రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 6,000 విలువైన కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

3) మారుతి ఎస్-ప్రెస్సో - రూ. 31,000 వరకు ఆదా

మారుతి సుజుకి ఎస్-ప్రెసోలో CNG మినహా అన్ని తర వేరియంట్‌లపై కంపెనీ ఈ నెలలో రూ. 31,000 విలువైన తగ్గింపులను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లలో రూ. 10,000 విలువైన వినియోగదారు ఆఫర్‌లు, రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 6,000 విలువైన కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

4) డిజైర్ - రూ. 34,000 వరకు పొదుపు

మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా తయారు చేయబడిన డిజైర్ కాంపాక్ట్ సెడాన్ యొక్క అన్ని పెట్రోల్ వేరియంట్‌లు ఈ నెలలో రూ. 22,000 విలువైన తగ్గింపులతో అందించబడుతున్నాయి. వాణిజ్య ప్రయోజనం కోసం విక్రయించబడుతున్న మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ కమర్షియల్ వెర్షన్‌ పై ఈ తగ్గింపు రూ. 34,000కి పెంచబడింది. ప్రైవేట్ కొనుగోలుదారులు రూ. 5,000 విలువైన వినియోగదారు ఆఫర్‌లు, రూ. 10,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 7,000 విలువైన కార్పొరేట్ డిస్కౌంట్‌లతో కూడిన పొదుపులను ఆస్వాదించవచ్చు.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

5) మారుతి వ్యాగన్ ఆర్ - రూ. 74,000 వరకు సేవింగ్స్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ యొక్క 1.2-లీటర్ వెర్షన్‌లపై కంపెనీ రూ. 26,000 విలువైన తగ్గింపులను అందిస్తోంది. వీటిలో వినియోగదారుల ఆఫర్‌లు రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 మరియు కార్పొరేట్ ఆఫర్‌ రూ. 6,000 కలిసి ఉన్నాయి. కాగా, వ్యాగన్ఆర్ యొక్క 1.0-లీటర్ వెర్షన్‌లు రూ. 30,000 విలువైన వినియోగదారు ఆఫర్‌లను పొందుతాయి. ఇందులో రూ. 15,000 విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ల మరియు రూ. 6,000 విలువైన కార్పొరేట్ బోనస్‌తో రూ.51,000 వరకూ ఆదా చేసుకోవచ్చు. ఇక ఇందులో కమర్షియల్ వెర్షన్ వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 లో వెర్షన్ కార్పోరేట్ బోనస్‌ను రూ.29,000 లభిస్తుంది. ఈ నెలలో మొత్తంగా ఈ వేరియంట్ పై రూ.74,000 వరకూ ఆదా చేసుకోవచ్చు.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

6) మారుతి స్విఫ్ట్ - రూ. 32,000 వరకు పొదుపు

మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క అన్ని వెర్షన్లు ఈ నెలలో రూ. 32,000 వరకు తగ్గింపులను అందుకుంటాయి. ఈ సేవింగ్స్‌లో రూ. 15,000 విలువైన వినియోగదారు ఆఫర్‌లు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 7,000 వరకు విలువైన కార్పొరేట్ ఆఫర్‌లు కలిసి ఉన్నాయి. ఇదిలా ఉంటే, మారుతి సుజుకి తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లో ఓ కొత్త 2022 మోడల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ కొత్త వేరియంట్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

7) మారుతి ఈకో - రూ. 36,500 వరకు ఆదా

మారుతి సుజుకి అందిస్తున్న యుటిలిటీ వాహన ఈకో పై కంపెనీ ఈ నెలలో రూ. 24,000 విలువైన తగ్గింపులను అందిస్తోంది. వీటిలో వినియోగదారు ఆఫర్‌లు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 మరియు రూ. 4,000 విలువైన కార్పొరేట్ ఆఫర్‌లు కలిసి ఉన్నాయి. మారుతి ఈకో యొక్క కమర్షియల్ వెర్షన్ అయిన టూర్ వి మోడల్ పై కంపెనీ కార్పోరేట్ బోనస్‌ను రూ. 16,500కి పెంచింది, దీంతో ఈ వేరియంట్ పై జులై నెలలో మొత్తంగా రూ. 36,500 ఆదా అవుతుంది.

మారుతి సుజుకి కార్లపై జులై 2022 నెల ఆఫర్లు.. రూ.74,000 వరకూ డిస్కౌంట్లు!

8) మారుతి ఎర్టిగా - రూ. 4,000 విలువైన పొదుపు

మారుతి సుజుకి ఇటీవలే విడుదల చేసిన కొత్త 2022 ఎర్టిగా ఎమ్‌పివి పై కంపెనీ ఈ నెలలో ఎలాంటి ఆఫర్లను అందించడం లేదు. అయితే, ఇందులోని కమర్షియల్ వెర్షన్ అయిన ఎర్టిగా టూర్ ఎమ్ పై కంపెనీ ఈ నెలలో రూ. 4,000 విలువైన కార్పొరేట్ ప్రయోజనాలను మాత్రం అందిస్తోంది.

Article Published On: Thursday, July 7, 2022, 14:24 [IST]
English summary
July 2022 discounts and offers on maruti suzuki cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+