జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

ప్రస్తుతం, టాలీవుడ్ టాప్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ (Johny Master) కూడా ఒకరు. జానీ మాస్టర్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు కన్నడ చిత్రాలలో కూడా స్టార్ హీరోలకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. హీరోల బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఎలా కంపోజ్‌ చేయాలో తెలిసిన కొరియోగ్రాఫర్‌లలో జానీ మాస్టర్‌ ఒకరని అందరూ అనుకుంటారు.

జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

తాజాగా, జానీ మాస్టర్‌తో కలిసి పనిచేసిన ఓ కన్నడ స్టార్ హీరో, ఆయన కొరియోగ్రఫీకి నచ్చి ఓ ఖరీదైన కానుక ఇచ్చాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే, తెలుగులో ఈగ సినిమాలో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్ (Kiccha Sudeepa). ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం బీస్ట్‌ 'అరబిక్ కుతు' అనే సాంగ్‌కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో, కిచ్చా సుదీప్ ఓ సరికొత్త మహీంద్రా థార్ (Mahindra Thar) ఎస్‌యూవీని ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

ఈ సందర్భంగా, తన మహీంద్రా థార్ ఎస్‌యూవీ మరియు స్టార్ హీరో సుదీప్ కిచ్చాతో దిగిన ఓ ఫొటోను జానీ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కిచ్చా సుదీప్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు జానీ మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మార్కెట్లో మహీంద్రా థార్‌ కారు ధరలు సుమారు రూ. 14 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి.

జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

ఇదిలా ఉంటే, కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే, ఇటీవల రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘పయాని' మ్యూజిక్ వీడియోకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో జానీ మాస్టర్‌తో పాటు శ్రుతి వర్మ కూడా నటించిన సంగతి తెలిసిందే.

జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

జానీ మాస్టర్ కు దర్శకుడు కావాలనే కోరిక చాలా బలంగా ఉంది. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. మరి ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ని మెగాఫోన్ ఎప్పుడు వరిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం, ఓ డ్యాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న జానీ మాస్టర్, టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు మరియు కోలీవుడ్ లో విజయ్ లాంటి టాప్ స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేశారు. విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం మృగం. ఈ సినిమాలోని అరబిక్ బాక్సింగ్ పాటకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

మహీంద్రా థార్ (Mahidnra Thar) ఎస్‌యూవీ గురించి క్లుప్తంగా..

ఇక మహీంద్రా థార్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఇది ఏఎక్స్ ఆప్షనల్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. కాగా, ఇందులోని ఏఎక్స్ ఆప్షనల్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. అదే ఎల్ఎక్స్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో పాటుగా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

మహీంద్రా థార్ ఎస్‌యూవీలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఇది అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తుంది. మార్కెట్లో థార్ ఎస్‌యూవీ ధరలు రూ.13.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. అయితే, కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి.

జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

కొత్త మహీంద్రా థార్‌ను సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టారు. ఇందులోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

జానీ మాస్టర్‌కి ఖరీదైన కానుక ఇచ్చిన కన్నడ స్టార్ హీరో.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?

కంపెనీ ఈ ఎస్‌యూవీని ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచింది. మహీంద్రా మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్‌-రోడర్‌కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌ను కూడా అందిస్తోంది. ఈ ఎస్‌యూవీలో కంపెనీ అనేక ఫీచర్లు మరియు పరికరాలను అందిస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, March 27, 2022, 9:30 [IST]
English summary
Kannada star hero kiccha sudeepa gifts brand new mahindra thar suv johny master
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+