ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

సాధారణంగా ఒక కంపెనీకి లాభాలు వస్తే, ఏదో కొంత బోనస్ ఇచ్చి ఊరుకుంటారు. మరి కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు స్వీట్స్ వంటివి ఇవ్వడానికి కూడా కొంత వెనుకాడతారు. అయితే కొంత మంది మాత్రం ఊహకందని రీతిలో గిఫ్ట్స్ ఇచ్చి ఉద్యోగులనే కాదు, చూసే వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా.. అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే అలంటి సంఘటనే మరొకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

నివేదికల ప్రకారం, ఈ సంఘటన కేరళలో జరిగినట్లు తెలిసింది. జోబిన్ మరియు జిజ్మీ అనే ఐటి కంపెనీ ప్రారంభమై ఇప్పటికి పది వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ అభివృద్ధికి దోహదపడిన ఎంప్లాయిస్ కి ఏకంగా కార్లను గిఫ్ట్స్ గా అందించారు. ఇది కేరళలోని చలకుడిలో వెలుగులోకి వచ్చింది.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

కంపెనీ తమ ఆరుగురు ఉద్యోగులకు కియా సెల్టోస్ SUV లను అందించారు. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ గిఫ్ట్స్ స్వయంగా కంపెనీ వ్యవస్థాపకులు అందించారు. దీని గురించి వారు మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన ఈ కంపెనీ ఈ రోజు 200 మందికి చేరింది. కంపెనీ అభివృద్ధిలో దోహదపడిన ఉద్యోగుల గురించి ఎంత చెప్పినా తక్కువే, అయితే వారి కృషికి గాను ఈ చిన్న గిఫ్ట్స్ అందించడం జరిగిందని చెప్పారు.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

మొత్తమ్ ఆరుమంది ఉద్యోగులకు కియా సెల్టోస్ కార్లను మరియు గత సంవత్సరం మంచి పనితీరుని కనపరచిన ఉద్యోగికి రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 గిఫ్ట్ గా అందించారు. ఉద్యోగులకు ఈ ఖరీదైన గిఫ్ట్స్ అందించడానికి మొత్తమ్ రూ. 1.20 కోట్లు ఖర్చయినట్లు తెలిసింది.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

అయితే కంపెనీ కియా సెల్టోస్ యొక్క ఏ వేరియంట్స్ గిఫ్ట్స్ గా అందించారు అనేదాని గురించి అధికారిక సమాచారం వెల్లడిందలేదు. అయితే మొత్తం ఖర్చుపెట్టిన మొత్తాన్ని బట్టి చూస్తే సెల్టోస్ యొక్క టాప్-స్పెక్ HTX+ లేదా GTX+ వేరియంట్స్ అందించి ఉంటారని భావించవచ్చు.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

ఇక కియా సెల్టోస్ విషయానికి వస్తే, దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందిన కియా మోటార్స్ యొక్క ఈ వాహనాలు ఇప్పటికి కూడా మంచి అమ్మకాలను పొందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ SUV యొక్క అద్భుతమైన పనితీరుని అని తెలుస్తోంది.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

కియా సెల్టోస్ 1.5-లీటర్ పెట్రోల్, 1.4-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్సన్లను పొందుతాయి. ఇవి వరుసగా 115 బిహెచ్‌పి పవర్ వరుసగా 144 ఎన్ఎమ్ టార్క్ (1.5-లీటర్ పెట్రోల్), 144 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ 1.4-(లీటర్ టర్బో-పెట్రోల్) ప్రొడ్యూస్ చేస్తాయి.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

ఇదిలా ఉండగా.. ఇటీవల తమిళనాడు చెన్నైలో ఉండే చల్లని (CHALLANI) జ్యువెల్లరీ షాప్ యజమాని తమ షాపులో పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి కార్లను మరియు బైకులని గిఫ్ట్స్ గా అందించడానికి పూనుకున్నాడు. ఇందులో దాదాపు 1.2 కోట్లు ఖర్చు చేసి 10 కార్లను కొనుగోలు చేసాడు. అంతే కాకుండా 20 వరకు బైకులను కూడా కొనుగోలు చేశారు.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

చల్లని (CHALLANI) జ్యువెల్లరీ షాప్ యజమాని 'జయంతి లాల్‌ ఛయంతి' కొనుగోలు చేసిన 10 కార్లు మారుతి కంపెనీకి చెందినవి ఇక్కడ కనిపించే ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఇక బైకులు మరియు స్కూటర్ విషయానికి వస్తే ఇవన్నీ హోండా మోటార్ సైకిల్ కంపెనీకి చెందినవని తెలుస్తోంది. గత నెల 24 న దీపావళి జరగనుంది. ఈ పండుగకు తన ఉద్యోగులకు గిఫ్ట్స్ గా ఈ కార్లను మరియు బైకులను అందించారు.

ఇలాంటి బాస్ కదా అందరూ కోరుకునేది.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అదే అంటారు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సాధారణంగా ప్రస్తుతం చాలా కంపెనీలు తమ స్వార్థం మాత్రమే చూసుకుంటాయి. అయితే కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించి ఇలాంటి బహుమతులను అందిస్తున్నాయి. ఇది నిజంగానే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Article Published On: Friday, November 4, 2022, 18:36 [IST]
English summary
Kerala it company gifts employees 6 kia seltos suv details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+