Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కియా మోటార్స్ (Kia Motors) యొక్క కియా కారెన్స్ (Kia Carens) ఇటీవల కాలంలోనే దేశీయ మార్కెట్లో విడుదలయ్యింది. ఈ MPV ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే కంపెనీ దాని యాక్ససరీస్ వెల్లడించింది. వీటి ధర రూ. 498 నుంచి రూ. 20,632 వరకు ఉంటుంది.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కియా కారెన్స్ (Kia Carens) యాక్ససరీస్ ఈ కింద చూడవచ్చు.

Accessory Item Price
Body side moulding (chrome) ₹2,737
Window chrome beltline ₹2,255
Front bumper garnish ₹537
Rear boot garnish ₹1,085
Headlamp garnish ₹1,374
ORVM chrome ₹1,099
Wheel arch chrome ₹2,475
Door visor with chrome insert ₹4,597
Body cover ₹2,256
Mud flap ₹673
Door finger guard ₹999
Chrome door handle ₹1,250
Door edge guard ₹534
Rear bumper garnish ₹505
C-pillar garnish ₹841
Taillamp garnish ₹1,787
Side step ₹20,632
Boot mat ₹499
3D boot mat ₹1,089
3D cabin mat ₹4,129
Floor mat ₹1,570 to ₹9,622
Door sill guard ₹1,072
Sunblinds ₹2,268
Shoe box ₹949
Seatbelt cover ₹498
Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెన్స్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు. కంపెనీ ఈ కొత్త మోడల్ విడుదలతో 6/7 సీట్ల MPV సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. కియా కారెన్స్ ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకోవడం కూడా ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

ఇందులోని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 డిసిటితో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కియా కారెన్స్ పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కియా కారెన్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

Kia Carens యాక్ససరీస్ లిస్ట్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

ఇందులోని స్టీరింగ్ వీల్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 18, 2022, 18:55 [IST]
English summary
Kia carens accessories revealed details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+