కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

కొరియన్ కార్ కంపెనీ కియా ఇండియా (Kia India) భారత మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన సరికొత్త 7-సీటర్ ఎమ్‌పివి కియా కారెన్స్ (Kia Carens) కస్టమర్ల కోసం కంపెనీ ఇప్పుడు ఓ ప్రత్యేకమైన ఆఫ్టర్ సేల్స్ ప్యాకేజీని ప్రారంభించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కారెన్స్ కస్టమర్ల కోసం "మై కన్వీనెన్స్ ప్యాకేజీని" (My Convenience Package) ని కియా పరిచయం చేసింది.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

ఈ ప్యాకేజీని కొనుగోలు చేసే కస్టమర్లు క్యారేజ్ మెయింటెనెన్స్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, టైర్ మరియు అల్లాయ్ వీల్ ప్రొటెక్షన్, రిపేర్ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సౌకర్యాలను పొందవచ్చు. కంపెనీ ఈ ఆఫ్టర్ సేల్స్ ప్యాకేజీని ప్రీమియం మరియు లగ్జరీ అనే రెండు రకాలుగా అందిస్తోంది. ఇవి వరుసగా నాలుగు సంవత్సరాలు మరియు ఐదు సంవత్సరాల పాటు కారుకు కవరేజీని అందిస్తాయి.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

దేశవ్యాప్తంగా ఉన్న కియా మోటార్స్ యొక్క సేల్స్ అండ్ సర్నీస్ నెట్‌వర్క్ నుండి వినియోగదారులు ఎక్కడైనా ఈ ప్యాకేజీలను కొనుగోలు చేయవచ్చు మరియు వాటి యొక్క ప్రయోజనాలను కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా, కియా కారెన్స్ కస్టమర్ల కోసం కార్ షీల్డ్ ప్యాకేజీని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా, ప్రమాదవశాత్తు కారెన్స్ కు జరిగిన నష్టాన్ని ఈ ప్యాకేజ్ కవర్ చేస్తుంది.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

అంతేకాకుండా, కియా కేర్స్ ప్యాకేజ్ ద్వారా కస్టమర్ ప్రమాదంలో ఏ రకమైన బీమా క్లెయిమ్‌ను ఎదుర్కోవలసి వస్తే, కంపెనీ సదరు కస్టమర్‌కు రూ. 1 లక్ష వరకు సహాయం చేస్తుంది. ఈ ప్రయోజనాన్ని గరిష్టంగా రెండు సార్లు పొందవచ్చు. ఈ ప్యాకేజీలు మరియు ఆఫర్లకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను తెలుసుకనేందుకు కస్టమర్లు తమకు సమీపంలోని కియా అధీకృత షోరూమ్ ను సందర్శించవ్చచు.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

ఇదిలా ఉంటే, కియా కారెన్స్ ఎమ్‌పివి మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఈ ఎమ్‌పివి కోసం ఇప్పటికే 50,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కారెన్స్ ఎమ్‌పివిని ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే ఐదు వేరియంట్‌లలో విడుదల చేశారు. వీటిలో లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లకు కస్టమర్ల నుండి ఎక్కువగా డిమాండ్ లభిస్తోంది.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

కియా కారెన్స్ ఎమ్‌పివి 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్ లో అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కియా సెల్టోస్ మాదిరిగానే కారెన్స్ కూడా 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

ఈ కొత్త కియా ఎమ్‌పివి దాని విభాగంలోని పోటీదారుల కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. కారెన్స్ మొత్తం పొడవు 4540 మిమీ, వెడల్పు 1800 మిమీ, ఎత్తు 1700 మిమీ, వీల్‌బేస్ 2780 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 195 మిమీగా ఉంటుంది. కియా కారెన్స్ విజయానికి ప్రధాన కారణాలు దాని ఆకర్షణీయమైన డిజైన్, నాణ్యమైన ఫీచర్లు మరియు సరసమైన ధరలుగా చెప్పుకోవచ్చు.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

కారెన్స్ డిజైన్ ను గమనిస్తే, ఇందులో టైగర్ నోస్ సిగ్నేచర్ గ్రిల్‌తో కూడిన ఎయిర్ డ్యామ్, స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, Y-ఆకారంలో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ మరియు ధృడమైన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. అంతేకాకుండా, కారు చుట్టూ బాడీ క్లాడింగ్, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్టైలిష్ వీల్ ఆర్చెస్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు స్టైలిష్ రియర్ బంపర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

ఇక ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో కియా UVO కార్ కనెక్ట్ ఫీచర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. దీని సాయంతో యూజర్లు అనేక సాంకేతిక సౌకర్యాలను నియంత్రించవచ్చు. ఇంకా ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, సీట్ బ్యాక్ టేబుల్, కప్ హోల్డర్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్, 6 ఎయిర్‌బ్యాగ్‌ లు మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

ఇంకా ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ ఎస్‌యూబి ఛార్జింగ్ పోర్టులు, స్పాట్‌లైట్లు, రియర్ టేబుల్ ట్రే మరియు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, సెవెన్-సీటర్ వేరియంట్ లో మూడవ-వరుస సీట్ ఉపయోగం కోసం ఎలక్ట్రిక్ వన్-టచ్ టంబుల్ సీట్లు కూడా ఇందులో ఉన్నాయి.

కారెన్స్ కస్టమర్ల కోసం కన్జ్యూమర్ కన్వీనెస్స్ ప్యాకేజ్‌ను ప్యాకేజీని ప్రారంభించిన కియా మోటార్స్

కియా కారెన్స్ లో లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా ఉంటుంది. కియా కనెక్ట్ సిస్టమ్ లో భాగంగా. జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్ వంటి 66 ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి కొన్ని రిమోట్ కంట్రోల్డ్ ఫీచర్లు కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. వైరస్ మరియు బ్యాక్టీరియా రక్షణ కోసం ఇందులో సరికొత్త స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ కూడా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 19, 2022, 13:15 [IST]
English summary
Kia carens after sales consumer convenience package launched details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+