Kia యొక్క నయా కారుకి భారీ డిమాండ్.. అప్పుడే 50,000 చేరిన బుకింగ్స్
ఇటీవల భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన 'కియా మోటార్స్' (Kia Motors) యొక్క 'కియా కారెన్స్' (Kia Carens) MPV ఎట్టకేలకు 50,000 బుకింగ్స్ నమోదు చేసి అతై తక్కువ కాలంలోనే అద్భుతమైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ మొత్తమ్ బుకింగ్స్ లో దాదాపు 21,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు భారతదేశంలోని టైర్ 3 నగరాల నుండి వచ్చాయి, అంతే కాకూండా ఇందులో 43% బుకింగ్స్ కారెన్స్ MPV యొక్క టాప్ ఎండ్ లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్స్ కి వచ్చాయి.

భారతీయ మార్కెట్లో కారెన్స్ MPV యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లకు 50-50 డిమాండ్ ఉంది. ఇప్పటికే కంపెనీ వీటి డెలివరీలను కూడా ప్రారంభించింది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత అమ్మకాలను చేపట్టిన 7-సీటర్ గా నిలిచింది. గత ఫిబ్రవరి నెలలో కంపెనీ మొత్తం 5,300 యూనిట్లను విక్రయించిందని కంపెనీ గణాంకాల ద్వారా తెలిసింది.

దేశీయ మార్కెట్లో కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16.99 లక్షలు. కంపెనీ యొక్క ఈ MPV భారతేదేశంలో విడుదల కాకముందే 19,000 బుకింగ్‌లు వచ్చాయి. ఈ కియా కారెన్స్ యొక్క బుకింగ్ ప్రైస్ రూ. 25,000 గా నిర్ణయించబడింది.

కియా కారెన్స్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు. ధర మరియు ఆకర్షణీయమైన ఫీచర్ల కారణంగా, దాని ప్రెస్టీజ్ మరియు ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్‌లకు గొప్ప స్పందనను పొందుతున్నాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Kia Carence MPV ని కంపెనీ యొక్క కొత్త డిజైన్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. భారతదేశంలో కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని అనుసరించిన మొదటి కియా కారు ఇదే. కావున ఇది అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

కియా కారెన్స్ మూడు-వరుసల MPV. కావున ఇది 6 మరియు 7-సీట్ల ఆప్సన్ లో అందించబడుతుంది. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లతో కూడిన 6-సీటర్ వేరియంట్ టాప్-ఎండ్ లగ్జరీ ప్లస్ ట్రిమ్ మాత్రమే అందించబడుతుంది. కియా కారెన్స్ లోని మూడవ వరుస సీటింగ్ మిగిలిన MPV లలో మాదిరిగా కాకుండా.. చాలా అనుకూలంగా ఉందని రుజువైంది. కేవలం ఒక బటన్‌ను నొక్కడం ద్వారా రెండవ వరుస సీటు దానంతటదే ముడుచుకుంటుంది, కాబట్టి మూడవ వరుసలోకి చేరుకోవడం చాలా సులభంగా ఉంటుంది.

మూడవ వరుసలో కూర్చునే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ సీట్లను అడ్జస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా హెడ్‌రెస్ట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి వెనుకవైపు USB పోర్ట్ కూడా ఉంది. మొత్తంమీద, కియా కేరెన్స్‌లోని మూడవ వరుస సీట్లు చాలా సౌకర్యవంతంగా మరియు విశాలంగా ఉన్నాయి.

కియా కారెన్స్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ USB ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు, రియర్ టేబుల్ ట్రే వంటివి ఉన్నాయి.

కియా కారెన్స్ సరికొత్త 'కియా కనెక్ట్' కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది. ఇది జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్ వంటి ఫీచర్లతో మాత్రమే కాకుండా.. ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి కొన్ని రిమోట్ కంట్రోల్డ్ ఫీచర్లను కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కియా కారెన్స్ MPV లోని ఇంజిన్ దాని సెల్టోస్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో మొత్తం మూడు ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి 1.5 పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్.
ఇందులోని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 డిసిటితో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇక కొత్త కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి..


Click it and Unblock the Notifications








