Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ విఫణిలో కియా కారెన్స్ (Kia Carens) MPV విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ MPV కోసం బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. ఇప్పుడు కారెన్స్ యొక్క డెలివరీలు ప్రారంభమయ్యాయి.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

దేశీయ మార్కెట్లో కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16.99 లక్షలు. కంపెనీ యొక్క ఈ MPV భారతేదేశంలో విడుదల కాకముందే 19,000 బుకింగ్‌లు వచ్చాయి.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

కియా కారెన్స్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు. ధర మరియు ఆకర్షణీయమైన ఫీచర్ల కారణంగా, దాని ప్రెస్టీజ్ మరియు ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్‌లకు గొప్ప స్పందనను పొందుతున్నాయి. అయితే ఇతరమోడల్స్ యొక్క వెయింటింగ్ పీరియడ్ ఇప్పుడు 3 నుంచి 6 నెలల వరకు ఉంటుంది. దీనికి ప్రధాన కారణం సెమీకండక్టర్ కొరత.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరలోనే డెలివరీలను చేయడానికి, కంపెనీ తన అనంతపురం ప్లాంట్‌లో మూడో షిప్టులో ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలో వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ కొత్త MPV లో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను అందించడం వల్ల మంచి స్పందన పొందుతోంది.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Kia Carence MPV ని కంపెనీ యొక్క కొత్త డిజైన్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. భారతదేశంలో కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని అనుసరించిన మొదటి కియా కారు ఇదే. కావున ఇది అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

కియా కారెన్స్ మూడు-వరుసల MPV. కావున ఇది 6 మరియు 7-సీట్ల ఆప్సన్ లో అందించబడుతుంది. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లతో కూడిన 6-సీటర్ వేరియంట్ టాప్-ఎండ్ లగ్జరీ ప్లస్ ట్రిమ్‌ మాత్రమే అందించబడుతుంది. కియా కారెన్స్ లోని మూడవ వరుస సీటింగ్ మిగిలిన MPV లలో మాదిరిగా కాకుండా.. చాలా అనుకూలంగా ఉందని రుజువైంది. కేవలం ఒక బటన్‌ను నొక్కడం ద్వారా రెండవ వరుస సీటు దానంతటదే ముడుచుకుంటుంది, కాబట్టి మూడవ వరుసలోకి చేరుకోవడం చాలా సులభంగా ఉంటుంది.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

మూడవ వరుసలో కూర్చునే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ సీట్లను అడ్జస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా హెడ్‌రెస్ట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి వెనుకవైపు USB పోర్ట్ కూడా ఉంది. మొత్తంమీద, కియా కేరెన్స్‌లోని మూడవ వరుస సీట్లు చాలా సౌకర్యవంతంగా మరియు విశాలంగా ఉన్నాయి.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

కియా కారెన్స్ MPV లోని ఇంజిన్ దాని సెల్టోస్‌ నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో మొత్తం మూడు ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి 1.5 పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

ఇందులోని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 డిసిటితో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

కియా కారెన్స్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ USB ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు, రియర్ టేబుల్ ట్రే వంటివి ఉన్నాయి.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

కియా కారెన్స్ సరికొత్త 'కియా కనెక్ట్' కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది. ఇది జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్ వంటి ఫీచర్లతో మాత్రమే కాకుండా.. ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి కొన్ని రిమోట్ కంట్రోల్డ్ ఫీచర్లను కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Carens డెలివరీలు షురూ చేసిన Kia Motors: వివరాలు

ఇక కొత్త కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

Source: Ravi Romi Sharma

More from DriveSpark

Article Published On: Thursday, February 24, 2022, 11:49 [IST]
English summary
Kia carens delivery starts in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+