రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో కియా మోటార్స్ యొక్క కియా కారెన్స్ (Kia Carens) లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కస్టమర్లకు కంపెనీ ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇందులో కారెన్స్ లాంచ్ గురించి ప్రస్తావించింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం కియా కారెన్స్ (Kia Carens) రేపు (2022 ఫిబ్రవరి 15) భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. కంపెనీ ఈ కొత్త కారుకి సంబంధించిన సంచారాన్ని ఇప్పటికే దాదాపుగా అందించింది. అయితే ధర వంటి వివరాలు విడుదల సమయంలో వెల్లడవుతాయి.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కియా కారెన్స్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు, మూడు ఇంజన్ల ఎంపికతో పాటు ఐదు వేరియంట్‌లలో (ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్‌) అందుబాటులోకి రానుంది. కంపెనీ ఈ కొత్త MPV ని 6 మరియు 7 సీట్ల ఎంపికలలో తీసుకురానుంది.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

Kia Carens గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

ఇందులోని స్టీరింగ్ వీల్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

ఇక కొత్త కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

కొత్త కియా కారెన్స్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

రేపు భారత మార్కెట్లో విడుదల కానున్న Kia Carens: ఫీచర్స్, మైలేజ్ & పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం కర్మాగారంలో కారెన్స్ యొక్క ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అంతే కాకూండా ఇటీవల ఇది డీలర్‌షిప్‌లను చేరుకోవడం ప్రారంభించింది. కావున టెస్ట్ డ్రైవ్ త్వరలోనే ప్రారంభమవుతుంది, అదే సమయంలో డెలివరీలు కూడా త్వరలోనే జరుగుతాయి.

కియా కారెన్స్ కొనాలనే వారు రూ. 25,000 చెల్లించి కంపెనీ డీలర్‌షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బుకింగ్ చేయవచ్చు. ఇప్పటికే కంపెనీ కియా కారెన్స్ కోసం 7,738 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అర్థమవుతోంది.

More from DriveSpark

Article Published On: Monday, February 14, 2022, 11:11 [IST]
English summary
Kia carens india launch tomorrow features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+