Kia Carens రివ్యూ వీడియో: ఇక్కడ చూడండి

కియా మోటార్స్ (Kia Motors) ఇప్పుడు దేశీయ విఫణిలో త్వరలో 'కియా కారెన్స్' (Kia Carens) అనే లేటెస్ట్ MPV విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది కంపెనీ యొక్క నాల్గవ ఉత్పత్తి. ఈ MPV కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఈ MPV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

కొత్త కియా కారెన్స్ MPV యొక్క కొలత విషయానికి వస్తే, ఇది 4,540 మిమీ పొడవు, 1800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు 2,780 మిమీ వీల్‌బేస్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 267 లీటర్ల బూట్ స్పేస్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కియా కారెన్స్ ని ఇటీవల మేము డ్రైవ్ చేసాము. దీనికి సంబంధిచిన వీడియో ఇక్కడ చూడవచ్చు.

కొత్త కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే 5 వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. కంపెనీ ఈ ఎమ్‌పివిని వరుసగా కెప్టెన్ సీట్లు లేదా సింగిల్ బెంచ్ సీటులో అందించిన రెండవ వరుస సీటింగ్‌లతో 6 మరియు 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తోంది. 6-సీట్ల ఎంపిక టాప్-స్పెక్ లగ్జరీ ప్లస్ ట్రిమ్ కోసం రిజర్వ్ చేయబడింది.

సాధారణంగా మూడవ వరుస సీట్లు కొంత ఇబ్బందిగా ఉండటం సహజం, కానీ కొత్త కియా కారెన్స్ లో మాత్రం మూడవ వరుస కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మూడవ వరుసలో ప్రయాణీకులకు ఓవర్‌హెడ్ ఏసీ వెంట్‌లు, టైప్-C స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ స్లాట్ మరియు ఒక కప్ హోల్డర్‌తో పాటు ఫోన్/టాబ్లెట్ హోల్డర్‌ వంటివి కూడా ఉన్నాయి.

Kia Carens రివ్యూ వీడియో

దేశీయ మార్కెట్లో కియా కారెన్స్ విడుదలైన తరువాత హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా XUV 700, ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారి మరియు టొయోట ఇన్నోవా క్రిస్టా వంటి ఎమ్‌పివిలకు ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త MPV యొక్క ధరలను వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. రూ. 13 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు ఉంటుందని ఆశిస్తున్నాము. కొత్త కిఆ కారెన్స్ గురించి పూర్తి సమాచారం ఇప్పుడు రివ్యూ ద్వారా అబ్అందుబాటులో ఉంది. కియా కారెన్స్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 29, 2022, 20:19 [IST]
English summary
Kia carens kannada review video 3rd row seat space features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+