ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kia Carens: ధర, ఫీచర్స్ & వివరాలు
భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు 'కియా మోటార్స్' యొక్క కియా కారెన్స్ (Kia Carens) MPV విడుదలైంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త MPV ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు. ఈ MPV యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కస్టమర్లు దీనిని రూ. 25,000 అడ్వాన్స్‌తో బుక్ చేసుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Kia Carens యొక్క టాప్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు. కంపెనీ ఈ MPV ని మొత్తం 5 వేరియంట్‌లలో తీసుకువచ్చింది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్స్. కంపెనీ ఈ కొత్త మోడల్ విడుదలతో 6/7 సీట్ల MPV సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. కియా కారెన్స్ ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకోవడం కూడా ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

| Trims | Petrol | Turbo Petrol | Diesel |
| Smartstream 1.5 | Smartstream 1.4T | 1.5L CRDi VGT | |
| Premium | ₹8.99 Lakh | ₹10.99 Lakh | ₹10.99 Lakh |
| Prestige | ₹9.99 Lakh | ₹11.99 Lakh | ₹11.99 Lakh |
| Prestige Plus | 6MT - ₹13.49 Lakh
7DCT - ₹14.59 Lakh | ₹13.49 Lakh | |
| Luxury | ₹14.99 Lakh | ₹14.99 Lakh | |
| Luxury Plus (6/7 Seater) | 6MT - ₹16.19 Lakh
7DCT - ₹16.99 Lakh | 6MT - ₹16.19 Lakh
6AT - ₹16.99 Lakh |

కియా కారెన్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి.

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

ఇందులోని స్టీరింగ్ వీల్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

కొత్త కియా కారెన్స్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 Nm టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇక కొత్త కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.
మొత్తం మీద కియా మోటార్స్ యొక్క కొత్త కారు భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ కొత్త MPV ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ఎలాంటి ఆదరణ పొందుతుంది మరియు దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం పోటీ ఇవ్వగలదు అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








