ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

కోవిడ్ మహమ్మారి మరియు దాని అనంతర పరిస్థితుల కారణంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ గత రెండేళ్లుగా చాలా గడ్డు కాలాన్ని చూస్తోంది. అయితే, ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆటోమొబైల్ తయారీదారులు కొత్త సంవత్సరం తర్వాత మరిన్ని కొత్త ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో భారత మార్కెట్లో అత్యధికంగా ఎదురుచూస్తున్న టాప్ 3 కార్లు ఉన్నాయి. వీటిలో కియా కారెన్స్, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు ఉన్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

కియా కారెన్స్ (Kia Carens)

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ బ్రాండ్‌లలో కియా కూడా ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ భారతదేశంలో ప్రస్తుతం మూడు మోడళ్లను (సోనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్) విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు తమ నాల్గవ మోడల్ కియా కారెన్స్ అనే ఎమ్‌పివిని కంపెనీ పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. సమాచారం ప్రకారం, కియా కారెన్స్ ఎమ్‌పివి ఈ నెల భారత మార్కెట్లో విడుదల కానుంది.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

భారతదేశంలో Kia Carens విడుదలతో, కియా ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత డిమాండ్ కలిగి ఉన్న విభాగంలోకి ప్రవేశిస్తుంది. కియా కారెన్స్ కంపెనీ విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ మాదిరిగానే అదే ఇంజన్ ఆప్షన్లతో రానుంది. అంటే, Kia Carens కూడా మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో రానుంది. ఇందులో 113 బిహెచ్‌పి 1.5 లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 114 బిహెచ్‌పి 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉండనున్నాయి.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

అలాగే, టర్బో ఇంజన్‌ను కోరుకునే వారి కోసం ఇందిలో 138 బిహెచ్‌పి 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను కంపెనీ అందించే అవకాశం ఉంది. ఇకపోతే, కారెన్స్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా సెల్టోస్ మాదిరిగానే ఉండనున్నాయి. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఐఎమ్‌టి మరియు 7-స్పీడ్ డిసిటి వంటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉండనున్నాయి. మార్కెట్లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ. 15 నుండి రూ. 20 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (MG ZS EV)

బ్రిటీష్ కార్ కంపెనీ ఎమ్‌జి మోటార్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను ఈ నెలలో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం, లభిస్తున్న ఎలక్ట్రిక్ కారుతో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా భారీ మార్పులు చేర్పులను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో ముందు వైపు చేయబోయే అప్‌డేట్‌లు, కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఎమ్‌జి ఆస్టర్ డిజైన్‌కు చేరువగా ఉండే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌లైట్‌లు, కొత్త టెయిల్‌ల్యాంప్‌లతో పాటుగా మరికొన్ని ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. ఇంకా ఇందులో కొత్త బంపర్స్, ముందు వైపు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లతో ఇది మరింత ఏరోడైనమిక్‌గా కనిపించనుంది. లోపలి భాగంలో, అప్‌డేట్ చేయబడిన ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు MG యొక్క iSmart ప్లాట్‌ఫారమ్‌తో కూడిన కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఇప్పుడు పెద్ద 51kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుందని సమాచారం. కాగా, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడల్ లో 44.5kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 340 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అయితే, పెద్ద బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 419 కిమీల రేంజ్ తో వస్తుందని సమాచారం. ఎమ్‌జి మోటార్ ఇండియా ఫిబ్రవరి 2022 చివరిలోపు భారత మార్కట్లో తమ అప్‌డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ జెడ్ఎస్ ఈవీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్

ఈ జాబితాలో చివరిది మరియు మూడవది అయిన మోడల్ మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్. దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనోలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను విడుదల చేయనుంది. ఈ అప్‌డేట్ లో భాగంగా, కంపెనీ ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ మరియు కొత్త అప్‌హోలెస్ట్రీ వంటి మార్పులను అందించనుంది.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

అంతేకాకుండా, ఈ అప్‌డేటెడ్ బాలెనో కారులో మారుతి సుజుకి కొన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లను కూడా జోడించవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇందులో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ కె12 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 82 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేస్తుంది. ఇకపోతే, ఇందులో రెండవ ఇంజన్ ఆప్షన్‌గా 1.2 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఫిబ్రవరి 2022లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు: కియా కారెన్స్, జెడ్ఎస్ ఈవీ మరియు బాలెనో ఫేస్‌లిఫ్ట్!

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. అంయితే, ఇందులో సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ వివిటి ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. మారుతి సుజుకి తమ కొత్త బాలెనో నాలుగు వేర్వేరు ట్రిమ్‌లలో అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నాము. మార్కెట్లో ఈ కొత్త మోడల్ ధరలు సుమారు రూ. 6 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, February 2, 2022, 10:54 [IST]
English summary
Kia carens mg zs ev and baleno facelift car lauches expected in february 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+