మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )ని ఓవర్‌టేక్ చేసిన కియా కారెన్స్ (Kia Carens)

మిడ్-సైజ్ ఎమ్‌పివి విభాగంలో తాజాగా మార్కెట్లోకి వచ్చిన కొరియన్ బ్రాండ్ కార్ కియా కారెన్స్ (Kia Carens), దాని మోడ్రన్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇది ఈ విభాగంలో ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి ఎక్స్ఎల్6, మహీంద్రా మరాజో మరియు టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తోంది. గత నెలలో విడుదలైన కియా కారెన్స్ అప్పుడే అమ్మకాల పరంగా మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 ) ని ఓవర్‌టేక్ చేసింది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )ని ఓవర్‌టేక్ చేసిన కియా కారెన్స్ (Kia Carens)

ప్రస్తుతం, మిడ్-సైజ్ ఎమ్‌పివి మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా అగ్రస్థానంలో ఉంటే, ప్రీమియం విభాగంలో టొయోటా ఇన్నోవా క్రిస్టా అగ్రస్థానంలో ఉంది. ఈ రెండు మోడళ్ల మధ్య ధర అంతరాన్ని తగ్గించడంలో కియా కారెన్స్ విజయం సాధించిందని చెప్పవచ్చు. కొత్త కియా కారెన్స్ ను కంపెనీ విభిన్న ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటుగా ఆకర్షణీయమైన ధరతో అందిస్తోంది. కారెన్స్ రాకతో ఇప్పుడు ఎర్టిగా మరియు ఇన్నోవా అమ్మకాలు ప్రభావితం అయ్యే అవకాలు కనిపిస్తున్నాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )ని ఓవర్‌టేక్ చేసిన కియా కారెన్స్ (Kia Carens)

ఎర్టిగా కన్నా కాస్తంత గుడ్ లుకింగ్ మరియు 6-సీటర్ ప్రీమియం ఎమ్‌పివిని కోరుకునే వారికి మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఎక్స్ఎల్6 అనే మోడల్ ను విక్రయిస్తోంది. వాస్తవానికి, ఇది మారుతి ఎర్టిగా ప్లాట్‌ఫామ్ ఆధారంగానే తయారు చేయబడింది. కాకపోతే, ఎర్టిగా కన్నా ప్రీమియంగా కనిపించేందుకు దాని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కంపెనీ స్వల్ప మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో, కొత్తగా వచ్చిన కియా కారెన్స్ ఇప్పుడు మారుతి ఎక్స్ఎల్6 కస్టమర్లను కూడా తనవైపు తిప్పుకునేలా చేస్తోంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )ని ఓవర్‌టేక్ చేసిన కియా కారెన్స్ (Kia Carens)

గత ఫిబ్రవరి 2022 నెలలో మారుతి సుజుకి ఎర్టిగా విక్రయాలను గమనిస్తే, అవి 11,649 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో మారుతి సుజుకి ఎక్స్ఎల్6 అమ్మకాలు 3,304 యూనిట్లు గాను మరియు టొయోటా ఇనోవా క్రిస్టా అమ్మకాలు 4,318 యూనిట్లు గానూ నమోదయ్యాయి. కాగా, కియా మోటార్స్ గత నెలలో మార్కెట్లో విడుదల చేసిన కారెన్స్ ఎమ్‌పివి కోసం ఇప్పటికే 25,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. ఈ మోడల్ ఉత్పాదకత విషయానికి వస్తే, కంపెనీ మొదటి నెలలో 5 వేల యూనిట్లను పంపిణీ చేసింది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )ని ఓవర్‌టేక్ చేసిన కియా కారెన్స్ (Kia Carens)

కియా మోటార్స్ ఇప్పటికే విక్రయిస్తున్న సెల్టోస్ మరియు సోనెట్ కార్లకు అధిక డిమాండ్ ఉంది. తాజాగా, వచ్చిన కియా కారెన్స్ తో ఈ బ్రాండ్ కార్లకు డిమాండ్ మరింత పెరిగింది. కొత్త కార్ మోడల్‌లకు పెరిగిన డిమాండ్ కారణంగా, కంపెనీ తన ఉత్పత్తి పరిమాణాన్ని కూడా పెంచింది. అధిక సంఖ్యలో కార్ల తయారు చేసేందుకు కియా మోటార్స్ ఇప్పుడు తమ ఇండియా ప్లాంట్ లో మూడవ షిఫ్టును కూడా ప్రారంభించింది. ఈ కారణంగా, కారెన్స్ కారు వెయిటింగ్ పీరియడ్‌ తగ్గుతుందని, బుకింగ్ చేసిన వెంటనే కారును డెలివరీ చేయవచ్చని కంపెనీ భావిస్తోంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )ని ఓవర్‌టేక్ చేసిన కియా కారెన్స్ (Kia Carens)

కియా కారెన్స్ విషయానికి వస్తే, ఈ లేటెస్ట్ ఎమ్‌పివి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే వేరియంట్లలో 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్ లో అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కియా సెల్టోస్ మాదిరిగానే కారెన్స్ కూడా 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )ని ఓవర్‌టేక్ చేసిన కియా కారెన్స్ (Kia Carens)

ఈ కొత్త కియా ఎమ్‌పివి దాని విభాగంలోని పోటీదారుల కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. కారెన్స్ మొత్తం పొడవు 4540 మిమీ, వెడల్పు 1800 మిమీ, ఎత్తు 1700 మిమీ, వీల్‌బేస్ 2780 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 195 మిమీగా ఉంటుంది. కియా కారెన్స్ విజయానికి ప్రధాన కారణాలు దాని ఆకర్షణీయమైన డిజైన్, నాణ్యమైన ఫీచర్లు మరియు సరసమైన ధరలుగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త కియా కారులో టైగర్ నోస్ సిగ్నేచర్ గ్రిల్‌తో కూడిన ఎయిర్ డ్యామ్, స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, Y-ఆకారంలో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ మరియు ధృడమైన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )ని ఓవర్‌టేక్ చేసిన కియా కారెన్స్ (Kia Carens)

అంతేకాకుండా, కారు చుట్టూ బాడీ క్లాడింగ్, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్టైలిష్ వీల్ ఆర్చెస్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు స్టైలిష్ రియర్ బంపర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో కియా UVO కార్ కనెక్ట్ ఫీచర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. దీని సాయంతో యూజర్లు అనేక సాంకేతిక సౌకర్యాలను నియంత్రించవచ్చు. ఇంకా ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, సీట్ బ్యాక్ టేబుల్, కప్ హోల్డర్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్, 6 ఎయిర్‌బ్యాగ్‌ లు మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 5, 2022, 9:42 [IST]
English summary
Kia carens mpv overtakes maruti suzuki xl6 mpv in february 2022 sales details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+