Kia Carens MPV లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి
కియా ఇండియా (Kia India) మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త MPV కియా కారెన్స్ (Kia Carens). ఇప్పటికే ఈ ఆధునిక MPV గురించి చాలా సమాచారం అందుబాటులో ఉంది. కానీ విడుదల కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇప్పుడు కంపెనీ కియా కారెన్స్ యొక్క విడుదల తేదీని కూడా వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కియా మోటార్స్ యొక్క కియా కారెన్స్ ఫిబ్రవరి 15 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. అయితే కంపెనీ ఈ MPV కోసం బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభించింది. మంచి సంఖ్యలో బుకింగ్స్ కూడా పొందుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం కర్మాగారంలో కారెన్స్ యొక్క ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అంతే కాకూండా ఇటీవల ఇది డీలర్‌షిప్‌లను చేరుకోవడం ప్రారంభించింది. కావున టెస్ట్ డ్రైవ్ త్వరలోనే ప్రారంభమవుతుంది, అదే సమయంలో డెలివరీలు కూడా త్వరలోనే జరుగుతాయి.

Kia Carens MPV 6 మరియు 7 సీటింగ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. కియా కారెన్స్ 2022 లో విడుదలవుతున్న కంపెనీ యొక్క మొదటి కారు. కొత్త కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

కొత్త కియా కారెన్స్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను వంటి ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

ఇందులోని స్టీరింగ్ వీల్ కంపెనీ యొక్క సెల్టోస్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

కొత్త కియా కారెన్స్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా అందుబటులో ఉంటాయి. దీనితో పాటు ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

కంపెనీ ఈ కొత్త MPV ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీని ధర ప్రారంభ ధర రూ.14 లక్షలు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని టాప్ వేరియంట్ ధర రూ. రూ.20 లక్షల వరకు ఉండవచ్చు. దీని ధర విడుదల సమయంలో అధికారికంగా వెల్లడవుతుంది.


Click it and Unblock the Notifications








