అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ యొక్క కియా కారెన్స్ (Kia Carens) త్వరలోనే దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. కంపెనీ ఇప్పటికే ఈ కొత్త MPV యొక్క ఉత్పత్తిని మరియు బుకింగ్స్ అన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. అయితే కంపెనీ ఈ కొత్త MPV ని లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లకు చేర్చింది. కావున టెస్ట్ డ్రైవ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

కియా కారెన్స్ యొక్క ఉత్పత్తి ఇప్పుడు అనంతపురం ప్లాంట్ లో ప్రారభించబడింది. అనంతపురంలో ఉత్పత్తి ప్రారంభించబడిన ఈ కొత్త MPV ప్రపంచంలోని దాదాపు 80 దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. ఈ MPV దేశీయ మార్కెట్లో విడుదలకాక ముందే మేము డ్రైవ్ చేసాము. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇక్కడ మీరు చిత్రాలలో గమనించినట్లయితే ఈ కొత్త కారెన్స్ కొత్త పెయింట్ స్కీమ్ అయిన మాస్ బ్రౌన్ షేడ్‌లో ఉండటం మీరు గమనించవచ్చు. ఇది కంపెనీ యొక్క హై-స్పెక్ లగ్జరీ లేదా లగ్జరీ ప్లస్ ట్రిమ్‌లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నాము. ఎందుకంటే ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, టైల్‌లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు 16-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

కారెన్స్ యొక్క బేస్-స్పెక్ ప్రీమియం ట్రిమ్ బ్లాక్ మరియు ఇండిగో సీట్లతో వస్తుంది. మరోవైపు దాని మిడ్-స్పెక్ ప్రెస్టీజ్ మరియు ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్‌లలో బ్లాక్ అండ్ బీజ్ కలర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్స్ ట్రిటాన్-నేవీ మరియు లేత గోధుమరంగు ఇంటీరియర్‌లను పొందుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటికి కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం తెలిసింది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

Kia Carens MPV 6 మరియు 7 సీటింగ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. కియా కారెన్స్ 2022 లో విడుదలవుతున్న కంపెనీ యొక్క మొదటి కారు. కొత్త కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

కొత్త కియా కారెన్స్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను వంటి ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇందులోని స్టీరింగ్ వీల్ కంపెనీ యొక్క సెల్టోస్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా అందుబటులో ఉంటాయి. దీనితో పాటు ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

కొత్త కియా కారెన్స్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

అప్పుడే డీలర్‌షిప్‌ చేరుకున్న Kia Carens: ఇక లాంచ్ ఎప్పుడంటే?

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 2, 2022, 19:00 [IST]
English summary
Kia carens mpv starts reaching at dealership price to be revealed soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+