Kia Carens కొత్త వీడియో: మీ అన్ని ప్రశ్నలకు ఇదే సమాధానం
కియా మోటార్స్ యొక్క కియా కారెన్స్ (Kia Carens) త్వరలోనే దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. దీని ఉత్పత్తి మరియు బుకింగ్స్ అన్నీ కూడా ప్రారభించబడ్డాయి. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కొత్త MPV యొక్క ఒక కొత్త వీడియోని విడుదల చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

కియా కారెన్స్ యొక్క ఈ వీడియోలో కొత్త MPV యొక్క డిజైన్ నుండి ఫీచర్ల వరకు మరియు కొలతల నుంచి సేఫ్టీ ఫీచర్స్ వరకు అన్ని మనకు స్పష్టంగా అవగతం అవుతాయి. ఇది వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వాస్తవం కూడా మీరు ఈ వీడియో ద్వారా గ్రహించవచ్చు.
కియా కారెన్స్ MPV మొత్తం మూడు వరుసల సీటింగ్ ఆప్సన్ తో అందుబటులో ఉంటాయి. ఇందులోని మూడవ వరుస రీక్లైన్ ఫంక్షన్ మరియు హెడ్‌రెస్ట్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇవి ఇప్పుడు అడ్జస్ట్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కారెన్స్ అనేది ఈ విభాగంలో అత్యంత విశాలమైన కారు. దీని రెండవ వరుస కెప్టెన్ సీటును పొందుతుంది.

అంతే కాకుండా.. ఈ మూడవ వరుస ప్రయాణికులకు అనుకూలంగా టైప్ C స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ స్లాట్ మరియు కప్‌హోల్డర్‌తో కూడిన ఫోన్ హోల్డర్ వంటివి కూడా అందుబటులో ఉన్నాయి. మూడవ వరుస సీట్లు రెండవ వరుస సీట్ల వలే చాలా అనుకూలంగా ఉంటాయి.

కియా కారెన్స్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్, ఇందులోని స్టీరింగ్ వీల్ సెల్టోస్ లో ఉన్న విధంగా ఉంటుంది. అంతే కాకుండా 66 కనెక్టెడ్ కార్ ఫీచర్లను కూడా ఇది పొందుతుంది. అద్భుతమైన సౌండ్ కోసం 8 స్పీకర్లతో బోస్ సౌండ్ సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

కియా కారెన్స్ అద్భుతమైన స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, మల్టీ డ్రైవ్ మోడ్, సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్, వైర్‌లెస్ ఛార్జర్, కూలింగ్ కప్ హోల్డర్, స్లైడింగ్ టైప్ అండర్ సీట్ ట్రే వంటి వాటిని పొందుతుంది.

ఇక కొత్త కియా కారెన్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే మొత్తం ఐదు వేరియంట్‌లలో అందుబటులో ఉంటుంది. ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

కంపెనీ ఈ కొత్త MPV ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీని ధర ప్రారంభ ధర రూ.14 లక్షలు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని టాప్ వేరియంట్ ధర రూ. రూ.20 లక్షల వరకు ఉండవచ్చు. దీని ధర విడుదల సమయంలో అధికారికంగా వెల్లడవుతుంది.


Click it and Unblock the Notifications








