ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

2022 లో కియా మోటార్స్ (Kia Motors) కంపెనీ విడుదల చేయనున్న కొత్త కియా కారెన్స్ (Kia Carens) MPV కి విడుదలకు ముందే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ MPV ని దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ బుకింగ్స్ కూడా జనవరి 14 నుంచి స్వీకరించడం ప్రారంభించింది. కారెన్స్ MPV కోసం బుకింగ్స్ ప్రారభించిన కేవలం 24 గంటల్లో ఏకంగా 7,738 యూనిట్లు బుక్ చేయబడ్డాయి.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

కియా ఇండియా ఈ MPV ని త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల చేస్తుంది. అయితే ఈ కొత్త మోడల్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్‌లో రూ. 25,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

Kia Carens MPV కంపెనీ యొక్క కొత్త ఉత్పత్తి, ఇది సెల్టోస్ యొక్క అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 6/7-సీటర్, మూడు-వరుసల కాన్ఫిగరేషన్‌తో అందించబడుతుంది. కొత్త Kia Carens MPV భారతదేశంలో కియా ఇండియా యొక్క నాల్గవ ఉత్పత్తి అవుతుంది.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

2022 లో విడుదలవుతున్న కంపెనీ యొక్క మొదటి కారు కూడా, ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

ఇందులోని స్టీరింగ్ వీల్ కంపెనీ యొక్క సెల్టోస్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

ఇక కొత్త కియా కారెన్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఒక్క రోజులో 7,738 యూనిట్ల బుకింగ్స్: విడుదలకు ముందే Kia Carens ప్రభంజనం

కియా మోటార్స్ తన కొత్త కియా కారెన్స్ యొక్క ధరను అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ కొత్త MPV ప్రారంభ ధర రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా దీని టాప్ వేరియంట్ ధర రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త కియా కారెన్స్ హ్యుందాయ్ అల్కాజార్, టయోటా ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా మరాజో, మహీంద్రా XUV700, టాటా సఫారీ మరియు ఎంజి హెక్టర్ ప్లస్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 17, 2022, 16:04 [IST]
English summary
Kia carens received 7738 bookings ahead of launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+