అమ్మకాల్లో అదుర్స్.. సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్: కియా కారెన్స్

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' (Kia Motors) భారతీయ మార్కెట్లో 'కియా కారెన్స్' (Kia Carens) విడుదల చేసిన అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలతో ముందుకు సాగింది. అయితే ఇప్పుడు గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి (గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) ఈ ఎమ్‌పివి యొక్క సేఫ్టీ రేటింగ్ వెల్లడించింది. కియా కారెన్స్ యొక్క సేఫ్టీ రేటింగ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

అమ్మకాల్లో అదుర్స్.. సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్: కియా కారెన్స్

గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి అందించిన సమాచారం ప్రకారం.. క్రాష్ టెస్ట్ లో కియా కారెన్స్ కేవలం 3 స్టార్ రేటింగ్ పొందింది. ఈ సేఫ్టీ రేటింగ్ ఒక్కసారిగా కియా కారెన్స్ కొనుగుదారులను స్తంభింపజేసింది. క్రాష్ టెస్ట్ లో ఉపయోగించిన ఈ ఎమ్‌పివి మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. ఇందులో ముందు ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు సైడ్-బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రెండు సైడ్ హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ ప్రిటెన్షన్లు, ఏబీఎస్, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు మరియు బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి.

అమ్మకాల్లో అదుర్స్.. సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్: కియా కారెన్స్

గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి ప్రకారం కియా కారెన్స్ అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 9.30 పాయింట్లను స్కోర్ చేసింది. ఇందులో ఫుట్ వెల్ ప్రాంతం మరియు బాడీషెల్ వంటి ప్రాంతాలు తగిన రక్షణను అందించవు అని నిర్దారించబడింది. అయితే తల మరియు మెడకు తగిన రక్షణ అందించబడుతుంది. ముందు భాగంలో క్నీ ప్రొటక్షన్ కూడా ఆశాజనకంగా లేదు.

అమ్మకాల్లో అదుర్స్.. సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్: కియా కారెన్స్

ఇక పిల్లల రక్షణ విషయానికి వస్తే, ఇందులో కియా కారెన్స్ 49 పాయింట్లకు గాను 30.99 పాయింట్లను సాధించింది. ఇందులో ఐసోఫిక్స్ మౌంటెడ్ పాయింట్స్ ఉన్నాయి. క్రాష్ టెస్ట్ లో ఉపయోగించిన కియా కారెన్స్ గంటకు 64 కిలోమీటర్ల వేగంతో పరీక్షించబడింది. మొత్తం మీద కియా కారెన్స్ భద్రత విషయంలో 3 పాయింట్లను మాత్రమే పొందగలిగింది.

అమ్మకాల్లో అదుర్స్.. సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్: కియా కారెన్స్

కియా కారెన్స్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రకాదరణ పొందిన 7 సీటర్ ఎమ్‌పివి. ఇది అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అయితే ఈ లేటెస్ట్ మోడల్ ఇంత తక్కువ సేఫ్టీ రేటింగ్ పొందటం వల్ల కస్టమర్లు కొంత నిరాశపడే అవకాశం ఉంది.

అమ్మకాల్లో అదుర్స్.. సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్: కియా కారెన్స్

కియా కారెన్స్ గురించి:

కారెన్స్ ఎమ్‌పివి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్స్. ఇవి 6-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటాయి.

అమ్మకాల్లో అదుర్స్.. సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్: కియా కారెన్స్

కియా కారెన్స్ 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు మరియు రియర్ టేబుల్ ట్రే మొదలైన లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకూండా.. ఇందులో జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్, ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కియా కారెన్స్ లో మొత్తం మూడు ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి 1.5 పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులోని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 డిసిటితో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

ఇక మూడవ ఇంజిన్ 1.5 లీటర్ డీజిల్ విషయానికి వస్తే ఇది 113 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద మంచి పనితీరుని అందిస్తుంది.

అమ్మకాల్లో అదుర్స్.. సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్: కియా కారెన్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కియా మోటార్స్ యొక్క కియా కారెన్స్ సేఫ్టీ టెస్టింగ్ లో 3 స్టార్ రేటింగ్ పొందింది. అంతే కాకుండా ఇటీవల కియా కంపెనీ యొక్క సెల్టోస్ కూడా సేఫ్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ పొందింది. ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న కార్లు సేఫ్టీ రేటింగ్ లో ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందుతుంటే కియా కంపెనీ యొక్క కార్లు 3 స్టార్స్ వద్ద ఆగిపోవడం కొత్ విచారించాల్సిన విషయం. కంపెనీ రానున్న రోజుల్లో తమ వాహనాల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అందించడానికి తగిన ప్రయత్నాలు జరపాలి. ఇప్పటికే కియా కంపెనీ యొక్క ఈవి6 సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది.

More from DriveSpark

Article Published On: Friday, June 24, 2022, 8:00 [IST]
English summary
Kia carens scores gncap 3 star safety rating details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+