మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో కొనుగోలుదారులు సరసమైన సిఎన్‌జి వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇదివరకు సిఎన్‌జి వాహనాల తయారీలో అనుభవం లేని కంపెనీలు కూడా ఇప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి వాహనాలను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా, కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా (Kia India), ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎమ్‌పివి కియా కారెన్స్ (Kia Carens) లో ఓ సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

ఈ వివరాల ప్రకారం, కియా ఇండియా తమ కారెన్స్ ఎమ్‌పివి యొక్క 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని, అందులో ఓ సిఎన్‌జి ట్యాంక్ అమర్చిన వాహనాన్ని భారత రోడ్లపై పరీక్షిస్తోంది. కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా కియా ఓ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన సిఎన్‌జి వాహనాన్ని పరీక్షిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ రెండింటిలో ఏది ముందుగా మార్కెట్లో విడుదల అవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

ఏదేమైనప్పటికీ, కియా భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో సిఎన్‌జి పవర్డ్ కార్లను ప్రవేశపెట్టిన కంపెనీగా చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం, భారతదేశంలో ఏ ఇతర కంపెనీ కూడా టర్బో ఇంజన్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ను అందించడం లేదు. భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా తమ కార్లలో న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ను మాత్రమే అందిస్తోంది.

మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

కాబట్టి ఈ విషయంలో (టర్బో పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్) మాత్రం కియా కారెన్స్ లేదా కియా సోనెట్ సిఎన్‌జి మోడళ్లు మంచి మార్కులను కొట్టేస్తాయి. ఎందుకంటే, పూర్తిగా పెట్రోల్ ఇంధనంతో నడిచే కారుతో పోల్చుకుంటే, సిఎన్‌జి గ్యాస్ తో నడిచే ఇంజన్ తక్కువ పవర్ మరియు తక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం, అంతర్గత దహన యంత్రంలో జరిగే నెమ్మది దహన ప్రక్రియే. అందుకే, పెట్రోల్ కార్లు అందించిన పెర్ఫార్మెన్స్ (క్విక్ యాక్సిలరేషన్ మరియు స్పీడ్) సిఎన్‌జి కార్లు అందించలేవు.

మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

అయితే, టర్బో పెట్రోల్ ఇంజన్లు సాధారణ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ల కన్నా శక్తివంతంగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఇందుకు ప్రధాన కారణం, టర్బో పెట్రోల్ కార్లలో ఉపయోగించే అదనపు టర్బో సిస్టమ్, ఇది ఎక్కువ గాలిని ఇంజన్‌లోకి పంపించి, దహన ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫలితంగా, కారు పెర్ఫార్మెన్స్ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో, కియా నుండి రాబోయే టర్బో ఇంజన్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ కారణంగా, ఈ కార్లు పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యధిక మైలేజీని అందించడంలో సహకరిస్తాయని తెలుస్తోంది.

మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

సిఎన్‌జి వాహనాలు ఎల్లప్పుడూ అధిక మైలేజీనిస్తాయి మరియు ఇవి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫ్రెండ్లీ కావు. అందుకే, ఇవి ఎల్లప్పుడూ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తాయి. కాబట్టి, కియా నుండి రాబోయే ఈ సిఎన్‌జి పవర్డ్ కారెన్స్ ఎమ్‌పివి కూడా ఇతర CNG వాహనాల మాదిరిగానే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కియా కారెన్స్ 7-సీటర్ మోడల్ కావడంతో, ఇందులోని 1.5-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్‌తో కారును ముందుకు నెట్టడానికి కష్టపడే అవకాశం ఉంటుంది. అందుకే, కంపెనీ ఇందులో దాని స్పోర్టీ క్యారెక్టర్‌కు తగినట్లుగా శక్తివంతమైన ఇంజన్‌ను జోడించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

ప్రస్తుతం, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో లభిస్తున్న ఏకైక ఎమ్‌పివి మారుతి సుజుకి ఎర్టిగా మాత్రమే. ఈ నేపథ్యంలో, ఎర్టిగాకు గట్టి పోటీ ఇచ్చేందుకు కియా ఇండియా కూడా తమ కారెన్స్ సిఎన్‌జిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

ఇక కియా కారెన్స్ ఎమ్‌పివి విషయానికి వస్తే, ఈ లేటెస్ట్ కియా మోడల్ భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే 50,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ మొత్తం బుకింగ్స్ లో దాదాపు 21,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు భారతదేశంలోని టైర్ 3 నగరాల నుండే వచ్చాయి. దానికి తోడు, ఈ ఎమ్‌పివి యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లకు డిమాండ్ సమానంగానే ఉంది. కారెన్స్ మార్కెట్లోకి వచ్చిన అతికొద్ది సమయంలోనే చాలా పాపులర్ అయ్యింది. ఈ ఎమ్‌పివి ఫిబ్రవరి 2022లో కంపెనీ 5,300 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

మారుతి ఎర్టిగాకు పోటీ ఇచ్చేందుకు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్; స్పై చిత్రాలు

కియా కారెన్స్ ఎమ్‌పివిలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కియా యొక్క యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, పూర్తి-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, 8-స్పీకర్లకో కూడిన బోస్ సౌండ్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు, 2వ మరియు 3వ వరుస ప్రయాణికులకు రూఫ్-మౌంటెడ్ ఏసి వెంట్స్, కూల్డ్ కప్ హోల్డర్‌లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి.

మూలం: V3Cars

More from DriveSpark

Article Published On: Saturday, April 23, 2022, 13:55 [IST]
English summary
Kia carens to get cng fuel option spotted testing with 1 4 turbo petrol engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+