Kia Carens కొంటున్నారా.. అయితే తప్పకుండా ఇవి తెలుసుకోవాల్సిందే..!!
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ (Kia Motors) భారతీయ మార్కెట్లో తన కొత్త MPV అయిన 'కారెన్స్' (Carens) ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు, కాగా టాప్ వేరియంట్ (లగ్జరీ ప్లస్) ధర రూ. 16.99 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా). ఇది మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు.

కియా మోటార్స్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఈ MPV యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పటికి ఈ MPV కోసం కంపెనీ 19,000 ఫ్రీ బుకింగ్స్ పొందింది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. అయితే ఈ MPV కొనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. కావున కియా కారెన్స్ గురించి తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త డిజైన్ ప్లాట్‌ఫారమ్:
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Kia Carence MPV ని కంపెనీ యొక్క కొత్త డిజైన్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. భారతదేశంలో కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని అనుసరించిన మొదటి కియా కారు ఇదే. కావున ఇది అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. తప్పకుండా ఈ MPV ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము.

అందుబాటులో ఉన్న 6/7 సీట్ల ఆప్సన్స్:
కియా కారెన్స్ మూడు-వరుసల MPV. కావున ఇది 6 మరియు 7-సీట్ల ఆప్సన్ లో అందించబడుతుంది. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లతో కూడిన 6-సీటర్ వేరియంట్ టాప్-ఎండ్ లగ్జరీ ప్లస్ ట్రిమ్ మాత్రమే అందించబడుతుంది.
కియా కారెన్స్ లోని మూడవ వరుస సీటింగ్ మిగిలిన MPV లలో మాదిరిగా కాకుండా.. చాలా అనుకూలంగా ఉందని రుజువైంది. కేవలం ఒక బటన్‌ను నొక్కడం ద్వారా రెండవ వరుస సీటు దానంతటదే ముడుచుకుంటుంది, కాబట్టి మూడవ వరుసలోకి చేరుకోవడం చాలా సులభంగా ఉంటుంది.

మూడవ వరుసలో కూర్చునే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ సీట్లను అడ్జస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా హెడ్‌రెస్ట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి వెనుకవైపు USB పోర్ట్ కూడా ఉంది. మొత్తంమీద, కియా కేరెన్స్‌లోని మూడవ వరుస సీట్లు చాలా సౌకర్యవంతంగా మరియు విశాలంగా ఉన్నాయి.

కియా సెల్టోస్ నుంచి తీసుకున్న ఇంజిన్:
కియా కారెన్స్ MPV లోని ఇంజిన్ దాని సెల్టోస్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో మొత్తం మూడు ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి 1.5 పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్.

ఇందులోని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 డిసిటితో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.
మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

లేటెస్ట్ ఫీచర్స్:
కియా కారెన్స్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ USB ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు, రియర్ టేబుల్ ట్రే వంటివి ఉన్నాయి.

కియా కారెన్స్ సరికొత్త 'కియా కనెక్ట్' కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది. ఇది జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్ వంటి ఫీచర్లతో మాత్రమే కాకుండా.. ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి కొన్ని రిమోట్ కంట్రోల్డ్ ఫీచర్లను కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కియా కారెన్స్ ధర:
కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు, అదే విధంగా టాప్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు. ప్రస్తుతం విడుదల సమయంలో ఉన్న ధరలు ఇవి. అయితే రానున్న రోజుల్లో ఏర్పడే డిమాండ్ ని బట్టి కంపెనీ ధరలను సవరించే అవకాశం ఉంటుంది. కావున త్వరలోనే ఈ MPV ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








