భారత్‌లో కియా ఈవీ6 (Kia EV6) ఎలక్ట్రిక్ కారు విడుదల ఖరారు.. మే 26న బుకింగ్స్ ఓపెన్..!
కొరియన్ కార్ కంపెనీ కియా ఇండియా (గతంలో కియా మోటార్స్) భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 (Kia EV6) ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది మరియు ఇందుకు సంబంధించి ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో కియా ఈవీ6 యెక్క్ ఫ్రంట్ హెడ్‌లైట్ మరియు చీకటిలో ఈ కారు సైడ్ ప్రొఫైల్‌ని కంపెనీ హైలైట్ చేసింది. సమాచారం ప్రకారం, భారతదేశంలో కొత్త Kia EV6 బుకింగ్‌లు మే 26, 2022వ తేదీన ప్రారంభం కానున్నాయి.
కియా మోటార్స్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఈవీ6 ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. అదే కారును కంపెనీ మనదేశంలో కూడా దిగుమతి చేసుకొని విక్రయించనుంది. కాబట్టి, డిజైన్ పరంగా ఇందులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. కియా CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో పూర్తిగా విదేశాలలో తయారు చేసిన ఈవీ6 ఎలక్ట్రిక్ కారును మనదేశంలోకి దిగుమతి చేసుకొని విక్రయించనుంది. మొదటి బ్యాచ్‌లో భాగంగా, కేవలం 100 యూనిట్లు మాత్రమే ఇండియాకు వస్తున్నట్లు సమాచారం.

భారతదేశంలో మే 26 నుండి ఈవీ6 కోసం బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్లు కియా ఇటీవలే ప్రకటించింది. కాగా, దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఎంపిక చేసిన కియా డీలర్‌షిప్‌ల ద్వారా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు విక్రయించబడుతుందని భావిస్తున్నారు. కొత్త ఈవీ6 ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇది సుమారు రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ట్యాగ్ ను కలిగి ఉంటుందని అంచనా. ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

కియా ఇండియా తమ ఈవీ6 కోసం విడుదల చేసిన ఈ టీజర్ వీడియోలో కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాన్ని హెడ్‌ల్యాంప్ యూనిట్‌ను చూపడం ప్రారంభిస్తుంది. కొత్త Kia EV6 హెడ్‌లైట్‌ల కోసం స్టార్టప్ లైటింగ్ సీక్వెన్స్ ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో చూపూడింది. ఇందులో డేటైమ్ రన్నింగ్ లైట్లు ఒక్కొక్కటిగా వెలుగుతుంటాయి, అవి సీక్వెన్స్ లో వెలుగుతూ వెళ్లి, చివరిలో హెడ్‌లైట్‌లను ఆన్ చేస్తాయి. ఆ తర్వాత ఈ వీడియోలో కంపెనీ తమ కియా ఈవీ6 యొక్క సైడ్ సిల్హౌట్‌ను ప్రదర్శిస్తుంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కియా ఈవీ6 యొక్క లాంగ్ రేంజ్ ఆల్-వీల్ డ్రైవ్ ట్రిమ్‌ను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడే ఈ లాంగ్ రేంజ్ ట్రిమ్ దీర్ఘ-శ్రేణి 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ ట్రిమ్ యొక్క లాంగ్ రేంజ్ వెర్షన్ గరిష్టంగా 321 bhp పవర్ ను మరియు 605 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో రెండు యాక్సిల్స్ లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. పూర్తి చార్జ్ పై ఇది 441 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది.

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును దాని కొరియన్ భాగస్వామి అయిన హ్యుందాయ్ అందిస్తున్న అయానిక్ 5 (Hyundai Ioniq 5) ఎలక్ట్రిక్ కారును ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. భారత మార్కెట్లో కియా ఈవీ6 విడుదైలన కొన్ని నెలల తర్వాత హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు కూడా ఇక్కడి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, Hyundai Ioniq 5 అక్టోబర్ 2022 చివరిలో భారత మార్కెట్లో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది.

హ్యుందాయ్ ఇండియా ఇప్పటికే దాని ప్రోడక్ట్ లైనప్ లో హ్యుందాయ్ కోన (Hyundai Kona) అనే ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. కాగా, హ్యుందాయ్ తమ అయానిక్ 5 మోడల్‌ను కియా ఈవీ6 మాదిరిగా ఇంపోర్టెడ్ రూపంలో కాకుండా, నేరుగా భారతదేశంలోనే ఈ ఎలక్ట్రిక్ కారును అసెంబుల్ చేయాలని హ్యుందాయ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ తమ చెన్నై అసెంబ్లీ ప్లాంట్‌లో అసెంబుల్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా, ఈ కారు ధర ఇంపోర్టెడ్ కియా ఈవీ6 ధర కన్నా తక్కువగా ఉంచబడుతుంది.

ఓ నివేదిక ప్రకారం, హ్యుందాయ్ అయానిక్ 5 కారు ధర సుమారు రూ. 35 లక్షల మరియు 40 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్). ఉండొచ్చని అంచనా. వాస్తవానికి, హ్యుందాయ్ అయానిక్ 5 మరియు కియా ఈవీ6 రెండు మోడళ్లు కూడా ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారు చేయబడి, వేర్వేరు బాడీ డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లుగా ఉండనున్నాయి. ఈ Ioniq 5 మరియు EV6 రెండూ కూడా హ్యుందాయ్ మోటార్ గ్రూప్ యొక్క E-GMP స్కేట్‌బోర్డ్ స్టైల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారుచేయబడనున్నాయి.

హ్యుందాయ్ అయానిక్ 5 ఒక రియర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారుగా లభించే అవకాశం ఉంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 168 bhp పవర్‌ను మరియు 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 354 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. గ్లోబల్ మార్కెట్ల కోసం హ్యుందాయ్ అయానిక్ 5 కారులో 321bhp పవర్ మరియు 605Nm టార్క్ ను జనరేట్ చేసే ఓ శక్తివంతమైన వేరియంట్ కూడా ఇది ఇది పూర్తి చార్జ్ పై 412 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అయితే, ఈ వేరియంట్ భారత మార్కెట్లో విడుదల కాకపోవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications








