ఎగుమతుల్లో Kia Motors ప్రభంజనం.. భారత్ నుంచి భారీ సంఖ్యలో ఎగుమతులు
భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ 'కియా మోటార్స్' (Kia Motors) ఇప్పుడు ఎగుమతుల విషయంలో ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

కియా ఇండియా (Kia India) కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టినప్పటినుంచి కూడా ఇప్పటికి ఏకంగా 1 లక్ష వాహనాలను ఎగుమతి చేసినట్లు తెలిపింది. కియా కంపెనీ 2019 సెప్టెంబర్ నెల నుంచి దేశీయ మార్కెట్ నుంచి సెల్టోస్ SUV లను ఎగుమతి చేయడం ప్రారంభించింది.

ఎగుమతులు ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే, ఎగుమతుల విషయంలో అమోఘమైన ఘనతను సాధించింది. ఇప్పుడు మనదేశం కియా వాహనాలకు ఎగుమతి కేంద్రంగా నిలిచిపోయింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, మధ్య మరియు దక్షిణ అమెరికా, మెక్సికో మరియు ఆసియా-పసిఫిక్ ప్రాంతాలలోని 91 దేశాలకు భారతదేశం నుండి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్న సెల్టోస్ మరియు సొనెట్‌లను కంపెనీ ఎగుమతి చేస్తోంది.

ఎగుమతుల పరంగా కియా సెల్టోస్ యొక్క వాటా 77% ఉండగా కియా సోనెట్ వాటా 23% ఉంది. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో కియా సెల్టోస్ కి విపరీతమైన డిమాండ్ ఉంది అని తెలుస్తుంది. కంపెనీ 2022 జనవరి నాటికి మొత్తం 1,01,734 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 46,261 యూనిట్లకు పైగా రవాణా చేసింది.

కియా కంపెనీ ఎగుమతుల విషయంలో సంవత్సరానికి 23% వృద్ధిని నమోదు చేసింది. కియా ఇండియా 25% పైగా మార్కెట్ వాటాతో దేశంలో నంబర్ 1 SUV ఎగుమతిదారుగా అవతరించింది. అంతే కాకుండా కంపెనీ మొత్తం ఇండియూజువల్ వెహికల్ విభాగంలో మూడవ స్థానంలో నిలిచింది. ఇందులో కంపెనీ 9% మార్కెట్ వాటాను పొందగలిగింది. ఇది కూడా కంపెనీ సాధించిన గొప్ప ఘనత అనే చెప్పాలి.

ఇటీవల కాలంలో కియా ఇండియా తన 2022 జనవరి అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 2022 జనవరి నెలలో మొత్తం 19,319 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. అదే సమయంలో కంపెనీ 2021 లో 19,056 యూనిట్లను విక్రయించింది. అంటే ఈ సంవత్సరం అమ్మకాలలో 1.4% వృద్ధిని నమోదు చేసింది.

కంపెనీ యొక్క అమ్మకాలు పెరగటానికి ఈ సారి కూడా కియా సెల్టోస్ ఎక్కువ దోహదపడింది. 2022 జనవరిలో 11,483 యూనిట్లు విక్రయించబడిన కియా సెల్టోస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ SUV లలో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా కంపెనీ 30 నెలలలో 3.9 లక్షల వాహనాలను విక్రయించిన ఘనతను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా కియా మోటార్స్ ఈ నెలలోనే తన కొత్త MPV అయిన కియా కారెన్స్ (Kia Carens) ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఆధునిక మోడల్ కోసం కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కొనుగోలుదారులు ఇప్పుడు రూ. 25,000 చెల్లింది బుక్ చేసుకోవచ్చు. ఈ MPV ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

కియా కారెన్స్ యొక్క ఉత్పత్తి ఇప్పుడు అనంతపురం ప్లాంట్ లో ప్రారభించబడింది. అనంతపురంలో ఉత్పత్తి ప్రారంభించబడిన ఈ కొత్త MPV ప్రపంచంలోని దాదాపు 80 దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. ఈ MPV దేశీయ మార్కెట్లో విడుదలకాక ముందే మేము డ్రైవ్ చేసాము.
Kia Carens MPV 6 మరియు 7 సీటింగ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

కొత్త కియా కారెన్స్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

భారతీయ మార్కెట్లో కియా కారెన్స్ విసుద్ధలైన తరువాత హ్యుందాయ్ అల్కాజార్, ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారి, మహీంద్రా XUV700 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ కొత్త MPV తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని మేము ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








