కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India), దేశీయ విపణిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లయిన కియా సెల్టోస్ (Kia Seltos) మరియు కియా సోనెట్‌ (Kia Sonet) లలో కొత్త 2022 మోడళ్లను విడుదల చేసింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు ఇప్పుడు అనేక అప్‌డేట్‌ లు మరియు అదనపు ఫీచర్‌ లతో లభ్యం కానున్నాయి.

కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

మార్కెట్లో కొత్త 2022 మోడల్ కియా సోనెట్ ప్రారంభ ధర రూ. 7.15 లక్షలు కాగా, 2022 మోడల్ కియా సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. మరి ఈ కొత్త మోడళ్లలో కియా ఇండియా కొత్తగా అందిస్తున్న ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

4 ఎయిర్‌బ్యాగ్‌లు

ఈ రెండు మోడళ్లలో ఇదివరకు టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభించే ఫీచర్లు ఇప్పుడు బేస్ వేరియంట్లలో కూడా లభ్యం కానున్నాయి. ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, కియా ఇండియా ఇప్పుడు రిఫ్రెష్ చేయబడిన సెల్టోస్ మరియు సొనెట్‌ కార్లలో సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను కూడా జోడించింది. అంటే, ఇప్పుడు రెండు కార్లలో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, కో-ప్యాసింజర్ మరియు ఫ్రంట్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు) స్టాండర్డ్ గా లభించనున్నాయి.

కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

కొత్త కలర్ ఆప్షన్లు

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు సెల్టోస్ మోడళ్లలో కంపెనీ మరో రెండు కొత్త కలర్ ఆప్షన్‌లను విడుదల చేసింది. ఇందులో ఇంపీరియల్ బ్లూ మరియు స్పార్క్లింగ్ సిల్వర్ అనే కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు కొత్త కలర్ ఆప్షన్లు కూడా మునుపటి మోడల్ ఇయర్ యొక్క ఇంటెలిజెన్సీ బ్లూ మరియు స్టీల్ సిల్వర్ కలర్ ఆప్షన్ల స్థానంలో ప్రవేశపెట్టబడ్డాయి. అంతేకాకుండా, కియా సోనెట్ కోసం కంపెనీ అందిస్తున్న గోల్డ్ బేజ్ కలర్ ఆప్షన్ ను కూడా కంపెనీ తొలగించింది. అలాగే, అన్ని కొత్త 2022 మోడళ్లపై రీడిజైన్ చేయబడిన బ్రాండ్ బ్యాడ్జ్‌ కూడా కనిపిస్తుంది.

కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

డీజిల్ ఇంజన్‌లో కొత్త గేర్‌బాక్స్

కియా సెల్టోస్ 13 కొత్త అప్‌డేట్ లను కలిగి ఉంటుంది. సెల్టోస్ HTK+ వేరియంట్‌లోని 1.5 డీజిల్ ఇంజన్‌ ఇప్పుడు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT)తో లభిస్తుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఐఎమ్‌టి (ఇది ఏఎమ్‌టి గేర్‌బాక్స్ లాంటిది) కలిగిన డీజిల్ కారుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులోని HTX AT వేరియంట్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది.

కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

సెల్టోస్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్లు

కియా ఇండియా తమ కొత్త 2020 కియా సెల్టోస్ యొక్క అన్ని ఆటోమేటిక్ వేరియంట్‌లను మరింత స్పోర్టియర్ మరియు మరింత రెస్పాన్సివ్ డ్రైవింగ్ అనుభూతి కోసం వీటిని మల్టీ-డ్రైవ్ మోడ్‌లు మరియు ట్రాక్షన్ మోడ్‌లతో కూడిన ప్యాడిల్ షిఫ్టర్‌లతో అందిస్తోంది. అంతేకాకుండ్, ఈ ఎస్‌యూవీలో సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. అలాగే, ఈ మోడల్ యొక్క HTX+ వేరియంట్ కూడా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఈ ఎస్‌యూవీ ఆకర్షణను మరింత మెరుగుపరచడానికి కంపెనీ ఇందులో D-కట్ స్టీరింగ్ వీల్, SUS స్కఫ్ ప్లేట్ మరియు టెయిల్‌గేట్‌పై కొత్త సెల్టోస్ లోగో డిజైన్ వంటి మార్పులు చేసింది. సెల్టోస్ ఎక్స్-లైన్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు ఇండిగో పారా సీట్లపై ఎక్స్-లైన్ లోగోను కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

సొనెట్ కూడా అప్‌డేట్ అయింది

కొత్త 2022 మోడల్ కియా సొనెట్ ఇప్పుడు 9 కొత్త అప్‌డేట్‌లతో వస్తుంది. కంపెనీ ఈ చిన్న కారు భద్రతను మరింత మెరుగుపరచడానికి, ఇందులో సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (హైలైన్ TPMS) వంటి ఫీచర్లను స్టాండర్డ్ గా అందిస్తోంది. అలాగే, కొత్త సొనెట్ యొక్క ఐఎమ్‌టి వెర్షన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2022 కియా సెల్టోస్ మరియు సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల.. ఈ కార్లలో చేసిన అప్‌డేట్స్ ఏంటంటే..?

అలాగే, కియా సోనెట్ HTX+ వేరియంట్‌లో కూడా ఇప్పుడు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. కాగా, సోనెట్ కొనుగోలుదారులు ఇప్పుడు HTX వేరియంట్ నుండే అధునాతన 10.67 cm (4.2 in) కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతారు, ఇది కారుకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఇందులో సెమీ లెథెరెట్ సీట్లను ఇప్పుడు HTE వేరియంట్ నుండే అందిస్తున్నారు. రిఫ్రెష్ చేయబడిన 2022 సెల్టోస్ మాదిరిగానే, కొత్త 2022 సొనెట్ కూడా D-కట్ స్టీరింగ్ వీల్ మరియు టెయిల్‌గేట్‌పై అప్‌డేట్ చేయబడిన లోగోను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 8, 2022, 15:39 [IST]
English summary
Kia india launches new 2022 seltos and sonet facelift model price and upgrades
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+