2023 లో కియా ధరలు పెరిగిపోతాయి.. ఈ బ్రాండ్ వాహనాలు ఇప్పుడే కోనేయండి
దేశీయ మార్కెట్లో చాలా వాహన తయారీ సంస్థ రానున్న కొత్త సంవత్సరం (2023 జనవరి) ప్రారంభం నుంచి తమ వాహనాల ధరలను పెంచడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో సౌత్ కొరియా బ్రాండ్ అయిన 'కియా మోటార్స్' కూడా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కియా మోటార్స్ (Kia Motors) యొక్క ధరల పెరుగుదల 2023 జనవరి 01 నుంచి అమలులోకి వస్తుంది. కాగా కంపెనీ తన కార్ల ధరలను రూ. 50,000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి రానున్న కారణంగా ఇన్‌పుట్ ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ తమ వాహనాల ధరల పెరుగుదలకు సిద్ధమైంది.

2023 ఏప్రిల్ నుండి ప్రభుత్వం రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) నిబంధనలను అమలు చేస్తున్నందున ఈ కొత్త ఉద్గార నిబంధనలు ఆటోమొబైల్ ఉద్గార నిబంధనలలో మరో భారీ మార్పుగా లోనవుతున్నాయి. ఈ నిబంధనలు ఆటోమొబైల్స్ యొక్క వాస్తవ ప్రపంచ వినియోగానికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటాయి. ఇది RDE నిబంధనల ప్రకారం అన్ని ఉద్గార పారామితులను పర్యవేక్షిస్తుంది. ఎయిర్ ఇన్‌టేక్ ప్రెజర్, ఇంజన్ ఉష్ణోగ్రత మొదలైన ఇతర అంశాలు కూడా ఇందులో పర్యవేక్షించబడతాయి.
RDE నిబంధనల ప్రకారం రానున్న రోజుల్లో వాహనాలలో కొత్త పరికరాలు మరియు సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్ అవసరం చాలావరకు ఉంటుంది. దీని కోసం అనేక అధునాతన సెమీకండక్టర్లు ఉపయోగించబడతాయి. కావున ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగానే కంపెనీలు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని తమ ఉత్పత్తుల మీద కూడా ధరలను పెంచుతున్నారు. డీజిల్ కార్ల విషయంలో RDE ని పాటించడం చాలా కష్టం, ఒక వేళా పాటించినా ఆ వాహన ధరలు మరింత ఎక్కువ ధరలను పొందుతాయి.
కరోనా మహమ్మారి తరువాత చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థ కుంటుపడింది. అంతే కాకుండా ఆటో మొబైల్ పరిష్ఠమాలు కూడా చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ధరల పెరుగుదలకు ప్రధాన హేతువుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పూర్తిగా తగ్గడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. 2022 లో మాదిరిగానే, 2023 వ సంవత్సరంలో కూడా చాలా కంపెనీల వాహన ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో చాలా కంపెనీలు ధరలను పెంచడానికి సిద్దమైపోయాయి. ఇందులో కేవలం కియా మోటార్స్ మాత్రమే కాకుండా.. మారుతి సుజుకి, టాటా మోటార్స్, రెనాల్ట్, ఆడి మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి ఇతర కార్ల తయారీదారులు కూడా ఉన్నారు. ఈ కంపెనీలన్నీ కూడా 2023 జనవరి 01 నుంచి ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే తెలిపాయి. కావున చాలా వాహనాల ధరలు 2023 నుంచి భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
2023 జనవరి నుంచి వాహన ధరలు పెరుగుతాయి, అయితే ఇదే ఇది వాహన అమ్మకాల మీద ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది తెలియాల్సిన విషయం. వాహన విక్రయాల మీద కొంత ప్రభావం చూపినప్పటికీ త్వరలోనే కార్ల విక్రయాలు మెరుగుపడతాయని మేము భావిస్తున్నాము. 2023 జనవరి సమయంలో సంక్రాంతి పండుగ కారణంగా తప్పకుండా దేశీయ మార్కెట్లో వాహన అమమకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
కియా ధరల పెరుగుదలపై మా అభిప్రాయం:
రానున్న రోజుల్లో కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రానున్న సమయంలో కంపెనీ కూడా కొంత ఎక్కువ ధరలను వాహన తయారీలో వెచ్చించాల్సి వస్తుంది. కావున ఇది కస్టమర్ల మీద కూడా కొంత ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే వాహన ధరలు ఆటోమాటిక్ గా పెరుగుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








