సోనెట్ (Sonet) మరియు సెల్టోస్ (Seltos) కార్లను అప్‌డేట్ చేసిన కియా: ఇప్పుడు కొత్త ఫీచర్లతో..

కొరియన్ కార్ కంపెనీ కియా ఇండియా (Kia India), దేశీయ విపణిలో విక్రయిస్తున్న సోనెట్ (Kia Sonet) కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు సెల్టోస్ (Kia Sletos) మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో సైలెంట్ గా కొన్ని అప్‌డేట్స్ చేసింది. కంపెనీ 2022 మోడల్ ఇయర్ అప్‌డేట్ లో భాగంగా, సోనెట్ మరియు సెల్టోస్‌ లను అప్‌డేట్ చేసింది. ఫలితంగా, ఈ కొత్త మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. మరి ఈ కొత్త మోడళ్లలో చేసిన ఆ మార్పులు ఏంటో, పెరిగిన ధరల వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సోనెట్ (Sonet) మరియు సెల్టోస్ (Seltos) కార్లను అప్‌డేట్ చేసిన కియా: ఇప్పుడు కొత్త ఫీచర్లతో..

2022 మోడల్ కియా సోనెట్ ఫీచర్లు, ధరలు

కొత్త 2022 మోడల్ ఇయర్ కియా సోనెట్ ఇప్పుడు అనేక కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేయబడింది. కియా సోనెట్ యొక్క అన్ని వేరియంట్‌లు ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ (టిపిఎమ్ఎస్)తో పాటు కనీసం 4 ఎయిర్‌బ్యాగ్‌ల (డ్రైవర్, కో-ప్యాసింజర్ మరియు ఫ్రంట్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ల)ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటాయి. కాగా, సోనెట్ హెచ్‌టిఎక్స్+ (Kia Sonet HTX+) ట్రిమ్ రేంజ్ నుండి అన్ని వేరియంట్లు కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ గా కలిగి ఉంటాయి.

సోనెట్ (Sonet) మరియు సెల్టోస్ (Seltos) కార్లను అప్‌డేట్ చేసిన కియా: ఇప్పుడు కొత్త ఫీచర్లతో..

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ మరో రెండు కొత్త కలర్ ఆప్షన్‌లతో విడుదల చేసింది. ఇందులో ఇంపీరియల్ బ్లూ మరియు స్పార్క్లింగ్ సిల్వర్ అనే కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు కొత్త కలర్ ఆప్షన్లు కూడా మునుపటి మోడల్ ఇయర్ యొక్క ఇంటెలిజెన్సీ బ్లూ మరియు స్టీల్ సిల్వర్ కలర్ ఆప్షన్ల స్థానంలో ప్రవేశపెట్టబడ్డాయి. అంతేకాకుండా, కియా సోనెట్ కోసం కంపెనీ అందిస్తున్న గోల్డ్ బేజ్ కలర్ ఆప్షన్ ను కూడా కంపెనీ తొలగించింది. అలాగే, అన్ని కొత్త 2022 మోడళ్లపై రీడిజైన్ చేయబడిన SONET బ్యాడ్జ్‌ కనిపిస్తుంది.

సోనెట్ (Sonet) మరియు సెల్టోస్ (Seltos) కార్లను అప్‌డేట్ చేసిన కియా: ఇప్పుడు కొత్త ఫీచర్లతో..

కొత్త 2022 మోడల్ ఇయర్ కియా సోనెట్ కారులో, గతంలో ఈ ఎస్‌యూవీ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్లలో అందుబాటులో లేని అనేక ఫీచర్లను కంపెనీ ఇప్పుడు ఈ కొత్త మోడల్ లో స్టాండర్డ్ ఫీచర్లుగా అందిస్తోంది. వీటిలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, బ్రేక్ అసిస్ట్ మరియు హిల్ అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి సోనెట్ హెచ్‌టిఎక్స్+ (Kia Sonet HTX+) వేరియంట్ నుండి దాని టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు ఐఎమ్‌టి వెర్షన్‌తో అందించబడతాయి.

సోనెట్ (Sonet) మరియు సెల్టోస్ (Seltos) కార్లను అప్‌డేట్ చేసిన కియా: ఇప్పుడు కొత్త ఫీచర్లతో..

అయితే, డీజిల్ మోడల్‌లో ఇలాంటి ఫీచర్లను కావాలనుకునే కస్టమర్లు మాత్రం సోనెట్ హెచ్‌టిఎక్స్ (HTX) వేరియంట్‌ను ఎంచుకోవాలి. సోనెట్ యొక్క HTE ట్రిమ్ స్థాయి మరియు ఆపై వేరియంట్లలో కూడా కంపెనీ సెమీ-లెథెరెట్ అప్‌హోలెస్ట్రీ ఆప్షన్ ను అందిస్తోంది. ఈ కొత్త 2020 మోడల్ సోనెట్ కారులో చేసిన మార్పుల కారణంగా, దాని ధరలు కూడా పెరిగాయి. కొత్త 2022 మోడల్ కియా సోనెట్ ఆరు ట్రిమ్ లోల అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, వాటి ధరలు రూ. 7.15 లక్షల నుండి రూ. 12.39 లక్షల మధ్యలో ఉన్నాయి.

సోనెట్ (Sonet) మరియు సెల్టోస్ (Seltos) కార్లను అప్‌డేట్ చేసిన కియా: ఇప్పుడు కొత్త ఫీచర్లతో..

2022 మోడల్ కియా సెల్టోస్ ఫీచర్లు, ధరలు

ఇక మిడ్-సైజ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ విషయానికి వస్తే, ఇందులో కూడా కంపెనీ కొన్ని స్టాండర్డ్ ఫీచర్లను అందిస్తోంది. వీటిలో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, సెల్టోస్ HTX+, GTX(O), GTX+ మరియు X-లైన్ వేరియంట్‌లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫిట్‌మెంట్ గా అందించడం లేదు. మునుపటి మోడల్ ఇయర్ సెల్టోస్ కారు యొక్క GTX+ మరియు టాప్-స్పెక్ X-Line వేరియంట్‌లలో మాత్రమే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ గా అందించేవారు.

సోనెట్ (Sonet) మరియు సెల్టోస్ (Seltos) కార్లను అప్‌డేట్ చేసిన కియా: ఇప్పుడు కొత్త ఫీచర్లతో..

కియా సెల్టోస్ శ్రేణిలో చేసిన ఇతర మార్పులలో సున్నితమైన డ్రైవింగ్ అనుభూతి కోసం రీట్యూన్ చేయబడిన సస్పెన్షన్ సెటప్ కూడా ఉంటుంది. సెల్టోస్ యొక్క అన్ని ఆటోమేటిక్ వెర్షన్‌లు ఇప్పుడు ప్యాడిల్ షిఫ్టర్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా పొందుతాయి. డీజిల్ లైనప్‌లోని HTK+ ట్రిమ్స్ ఇప్పుడు కియా యొక్క iMT క్లచ్‌లెస్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటాయి. అలాగే, కొత్త HTX డీజిల్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తో కూడా అందించబడుతుంది.

సోనెట్ (Sonet) మరియు సెల్టోస్ (Seltos) కార్లను అప్‌డేట్ చేసిన కియా: ఇప్పుడు కొత్త ఫీచర్లతో..

కియా సెల్టోస్ యొక్క లోయర్-స్పెక్ వెర్షన్‌లు ఇప్పుడు కొత్తగా డిజైన్ చేయబడిన వీల్ కవర్‌ లను పొందుతాయి, వాటి మధ్యలో కొత్త కియా లోగో కూడా ఉంటుంది. ఇక ఇందులోని టాప్-ఆఫ్-లైన్ ఎక్స్-లైన్ వేరియంట్‌లలో సీట్లు హెడ్‌రెస్ట్‌లపై ఎంబ్రాయిడరీ చేసిన ట్రిమ్ స్థాయి పేరు కనిపిస్తుంది. సోనెట్ మాదిరిగానే సెల్టోస్ కూడా కొత్త బ్యాడ్జ్ లోగోను కలిగి ఉంటుంది మరియు ఇది కియా యొక్క కొత్త డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా ఉంటుంది. కొత్త 2022 మోడల్ కియా సెల్టోస్ 9 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, వాటి ధరలు రూ. 10.19 లక్షల నుండి రూ. 18.45 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Article Published On: Tuesday, April 5, 2022, 15:16 [IST]
English summary
Kia india updates seltos and sonet suvs with new features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+