అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి సౌత్ కొరియాకి చెందిన 'కియా మోటార్స్' (Kia Motors). ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఒక ప్లాంట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్ల త‌యారీ సంస్థ ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. అనంతపురం (హిందూపూర్) మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఐదు ల‌క్ష‌ల కార్ల‌ను మార్కెట్లో విక్రయించిన‌ట్లు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో అధికారికంగా తెలిపింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

నివేదికల ప్రకారం, కియా మోటార్స్ తన అనంతపురం ప్లాంట్ నుండి ఇప్పటికి ఏకంగా 5 లక్షల కార్లను విక్రయించినట్లు తెలిసింది. ఇందులో దేశీయ మార్కెట్లో విక్రయించిన కార్లు 4 లక్షలు కాగా, విదేశీ మార్కెట్ కోసం ఎగుమతి చేసిన కార్లు 1 లక్ష వరకు ఉన్నాయి. కంపెనీ 2019 సెప్టెంబర్ లో తమ బ్రాండ్ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. అది కూడా ఎగుమతులు కంపెనీ యొక్క అత్యంత పాపులర్ మోడల్ సెల్టోస్‌తో ప్రారంభమయ్యింది.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

కంపెనీ ప్రస్తుతం 91 దేశాలకు తన వాహనాలను విక్రయిస్తోంది. కియా మోటార్స్ భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 2.5 సంవత్సరాలలో 5 లక్షల వాహనాలను విక్రయించడం అనేది సాధారణ విషయం కాదు. అయితే దేశీయ మార్కెట్లో మాత్రమే కాకూండా ప్రపంచ మార్కెట్లో కూడా కొనుగోలుదారులు కంపెనీపైన ఎక్కువ నమ్మకాన్ని ఉంచడం వల్ల ఈ సంఖ్యను సాధించడం సాధించడమయ్యింది.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల దేశీయ విఫణిలోకి కొత్త కియా కారెన్స్ అనే అధునాతన MPV ని విడుదల చేసింది. కావున ఈ MPV కూడా తప్పకుండా దేశీయ మార్కెట్లో అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. కావున మరి కొన్ని రోజుల్లో కొత్త గణాంకాలు విడుదలవుతాయి.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు. Kia Carens యొక్క టాప్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు. కంపెనీ ఈ MPV ని మొత్తం 5 వేరియంట్‌లలో తీసుకువచ్చింది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్స్.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

కొత్త కియా కారెన్స్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 Nm టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

కియా కారెన్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

ఇందులోని స్టీరింగ్ వీల్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

అమ్మకాల్లో నేనే కింగ్.. Kia Motors: తక్కువ కాలంలోనే అరుదైన రికార్డ్ సొంతం

ఇక కొత్త కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 23, 2022, 9:46 [IST]
English summary
Kia motors dispatches 5 lakh vehicles details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+