Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

సోత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) 2022 జనవరి నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం, కంపెనీ జనవరిలో 19,319 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ అమ్మకాలు మునుపటి నెల కంటే కూడా 1.38% వృద్ధికి నమోదు చేసిందని తెలుస్తుంది. కంపెనీ యొక్క అమ్మకాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

కియా మోటార్స్ యొక్క నివేదికల ప్రకారం, జనవరి 2022 అమ్మకాల్లో సెల్టోస్ మొదటి స్థానంలో ఉంది. కియా సెల్టోస్ మొత్తం 11,483 యూనిట్లను విక్రయించింది. గత కొన్ని నెలలుగా సరైన అమ్మకాలు లేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త నెలలో మాత్రమే అమ్మాకాలు మంచి అమ్మకాలను పొందింది. గత జనవరిలో కంపెనీ 19,056 యూనిట్లను విక్రయించింది.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

కంపెనీ యొక్క కొత్త ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ కారణంగానే 2022 జనవరి నెలలో మంచి అమ్మకాలను పొందగలిగింది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ త్వరలో విడుదల చేయనున్న Kia Carens ఇప్పటికే 7,738 యూనిట్ల బుకింగ్‌లను అందుకుంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాము.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

ప్రస్తుతం దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో సెమీకండక్టర్ కొరతల వల్ల ఉత్పత్తి మరియు సరఫరా అనేది చాలావరకు తగ్గిపోయింది. అయితే ఈ కొరత ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టింది. కావున కంపెనీ యొక్క ఉత్పత్తులు మరియు విక్రయాలు త్వరగానే ఉంటాయని ఆశిస్తున్నాము.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

ఇదిలా ఉండగా కంపెనీ యొక్క కొత్త Kia Carens ఈ నెలలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుగోలుదారులు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కియా కారెన్స్ 6 మరియు 7 సీట్ల ఎంపికలలో తీసుకురాబడుతుంది. ఇది మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్స్.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

ఇక కొత్త కియా కారెన్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

Kia Motors సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. కొత్త సంవత్సరంలో అమ్మకాలు ఇలా ఉన్నాయి

ఇందులోని స్టీరింగ్ వీల్ కంపెనీ యొక్క సెల్టోస్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 2, 2022, 12:42 [IST]
English summary
Kia motors sales january 2022 seltos details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+