కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివి ధరలను సైలెంట్‌గా రూ.70,000 పెంచేసిన కియా మోటార్స్!
కొరియన్ కార్ కంపెనీ కియా ఇండియా (Kia India), ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తమ లేటెస్ట్ ఎమ్‌పివి కియా కారెన్స్ (Kia Carens) ధరలను సైలెంట్‌గా పెంచేసింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి కియా కారెన్స్ ధరలు గరిష్టంగా రూ.70,000 వరకూ పెరిగాయి. తాజా ధరల పెంపు అనంతరం కియా కారెన్స్ బేస్ వేరియంట్ ధర రూ. 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. కియా ఇండియా తమ కారెన్స్ ఎమ్‌పివి ధరల పెంపుపై అధికారిక ప్రకటనను విడుదల చేయకుండానే, వెబ్‌సైట్‌లో కొత్త ధరలను అప్‌డేటట్ చేసింది.

వెబ్‌సైట్‌లో పొందుపరచిన వివరాల ప్రకారం, Kia Carens MPV యొక్క అన్ని వేరియంట్ల ధరలు పెరిగాయి. అంతకుముందు, కారెన్స్ ధరలు 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో బేస్ 'ప్రీమియమ్ 7' వేరియంట్ కోసం రూ. 8.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమయ్యేవి. కాగా, ఇప్పుడు ధరలు అప్‌డేట్ చేయబడిన తర్వాత అదే బేస్ మోడల్ ధర రూ. 9.59 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా)చేరుకుంది. అంటే, ఈ వేరియంట్ గరిష్టంగా రూ. 60,000 పెరుగుదలను అందుకుంది.

కాగా, కియా కారెన్స్ లో టాప్-ఆఫ్ ది లైన్ ట్రిమ్ అయిన లగ్జరీ ప్లస్ 7-సీటర్ వెర్షన్ లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 1.4-లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ధర రూ.40,000 మేర పెరిగి రూ.6.19 లక్షల నుండి రూ. 16.59 లక్షలకు చేరుకుంది. అలాగే, ఇందులో 7-స్పీడ్ డిటిసి ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.50,000 మేర పెరిగి 16.99 లక్షల నుండి రూ.17.49 లక్షలకు చేరుకుంది. ఇకపోతే. 1.5 లీటర్ డీజిల్ మ్యాన్యువల్ ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.60,000 మరియు రూ.70,000 మేర పెరిగి 16.79 లక్షలు మరియు రూ.17.69 లక్షలుగా ఉన్నాయి ( అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).
వేరియంట్ల వారీ పాత మరియు కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
| Carens Premium | Old Price | New Price | Difference |
| 1.5 Petrol MT | ₹8.99 Lakh | ₹9.59 Lakh | ₹60,000 |
| 1.4 T-GDi MT | ₹10.99 Lakh | ₹11.19 Lakh | ₹20,000 |
| 1.5 Diesel MT | ₹10.99 Lakh | ₹11.39 Lakh | ₹40,000 |
| Carens Prestige | |||
| 1.5 Petrol MT | ₹9.99 Lakh | ₹10.69 Lakh | ₹70,000 |
| 1.4 T-GDi MT | ₹11.99 Lakh | ₹12.39 Lakh | ₹40,000 |
| 1.5 Diesel MT | ₹11.99 Lakh | ₹12.59 Lakh | ₹60,000 |
| Carens Prestige Plus | |||
| 1.4 T-GDi MT | ₹13.49 Lakh | ₹13.89 Lakh | ₹40,000 |
| 1.4 T-GDi 7DCT | ₹14.59 Lakh | ₹14.79 Lakh | ₹20,000 |
| 1.5 Diesel AT | ₹13.49 Lakh | ₹14.09 Lakh | ₹60,000 |
| Carens Luxury | |||
| 1.4 T-GDi MT | ₹14.99 Lakh | ₹15.29 Lakh | ₹30,000 |
| 1.5 Diesel MT | ₹14.99 Lakh | ₹15.49 Lakh | ₹50,000 |
| Carens Luxury Plus 6S | |||
| 1.4 T-GDi MT | ₹16.19 Lakh | ₹16.54 Lakh | ₹35,000 |
| 1.4 T-GDi 7DCT | ₹16.99 Lakh | ₹17.44 Lakh | ₹45,000 |
| 1.5 Diesel MT | ₹16.19 Lakh | ₹16.74 Lakh | ₹55,000 |
| 1.5 Diesel AT | ₹16.99 Lakh | ₹17.64 Lakh | ₹65,000 |
| Carens Luxury Plus 7S | |||
| 1.4 T-GDi MT | ₹16.19 Lakh | ₹16.59 Lakh | ₹40,000 |
| 1.4 T-GDi 7DCT | ₹16.99 Lakh | ₹17.49 Lakh | ₹50,000 |
| 1.5 Diesel MT | ₹16.19 Lakh | ₹16.79 Lakh | ₹60,000 |
| 1.5 Diesel AT | ₹16.99 Lakh | ₹17.69 Lakh | ₹70,000 |

కియా మోటార్స్ విక్రయిస్తున్న సెల్టోస్ మరియు సోనెట్ మోడళ్ల ఘన విజయంతో, ఈ బ్రాండ్ భారతదేశంలో అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకుంది. ఆ కారణంగా, ఈ కంపనీ నుండి కొత్తగా వచ్చిన కియా కారెన్స్ ఎమ్‌పివి కూడా మార్కెట్లో మరొక విజయవంతమైన మోడల్ గా నిలిచింది. ఈ మోడల్ భారత ఎమ్‌పివి విభాగంలోకి ఇటీవలే ప్రవేశించినప్పటికీ, దేశీయ విపణిలో 7-సీట్ల విభాగంలో ఇది చాలా వేగంగా అమ్ముడవుతోంది. కియా మోటార్స్ ప్రకారం, కంపెనీ ఫిబ్రవరి 2022లో 5,300 యూనిట్ల కారెన్స్ వాహనాలను విక్రయించింది.

కియా కారెన్స్ ఎమ్‌పివి టైర్ 2 మరియు టైర్ 3 నగరాల నుండి ఎక్కువ డిమాండ్ లభిస్తోంది. కియా కారెన్స్ కు అధిక డిమాండ్ రావడానికి కారణం దాని బ్రాండ్ ఇమేజ్‌తో పాటుగా దాని సరసమైన ధర కూడా అని చెప్పవచ్చు. అయితే, కంపెనీ ఈ ఎస్‌యూవీ పరిచయ ప్రారంభ ధర (ఇంట్రడక్టరీ ప్రైస్)తో విడుదల చేసింది. ఇది మార్కెట్లోకి వచ్చిన కొన్ని నెలలు కావడంతో కంపెనీ పరిచయ ధరలను కాస్త పెంచివేసింది. మరి పెరిగిన ధరలు ఈ ఎమ్‌పివి అమ్మకాలను ఏ రకంగా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.

మార్కెట్లో కియా కారెన్స్ ఎమ్‌పివి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ 6-సీటర్ మరియు లగ్జరీ ప్లస్ 7-సీటర్ అనే ఆరు ట్రిమ్ లలో మొత్తం 19 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిది 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, రెండవది 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు మూడవది 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్. ఈ మూడ ఇంజన్లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

కారెన్స్ ఎమ్‌పివిలో కియా మోటార్స్ బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫుల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, 2వ మరియు 3వ వరుస ప్రయాణీకుల కోసం రూఫ్-మౌంటెడ్ ఏసి వెంట్స్, యాంబియంట్ లైటింగ్, 8-స్పీకర్లతో కూడిన బోస్ ఆడియో సిస్టమ్ మరియు కూల్డ్ కప్ హోల్డర్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇంకా ఇందులో కియా బ్రాండ్ యొక్క UVO కార్ కనెక్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. కియా కనెక్ట్ సిస్టమ్ లో భాగంగా జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్ వంటి 66 రకాల ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి కొన్ని రిమోట్ కంట్రోల్డ్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి. కారు లోపల వైరస్ మరియు బ్యాక్టీరియా రక్షణ కోసం ఇందులో సరికొత్త స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అందుబాటులో ఉంటుంది.

సేఫ్టీ విషయానికి వస్తే, కియా కారెన్స్‌లో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) , ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, హిల్-హోల్డ్ అసిస్టెన్స్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








