మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'కియా మోటార్స్' (Kia Motors) ఎప్పటికప్పుడు తమ వాహనాలను అప్డేట్ చేస్తూనే ఉంది. మారుతున్న కాలంలో వినియోగదారులకు తప్పకుండా మంచి ఫీచర్స్ కలిగిన వాహనాలను అందించాలనే లక్ష్యంతో కంపెనీ ఇటువంటి అప్డేట్స్ నిరంతం చేస్తూనే ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కంపెనీ యొక్క 'కియా సెల్టోస్' మరియు 'కియా సోనెట్‌' కూడా చిన్న అప్డేట్స్ పొందాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

కంపెనీ యొక్క ప్రముఖ కార్ మోడల్స్ అయిన 'కియా సెల్టోస్' మరియు 'కియా సోనెట్‌' రెండూ కూడా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయని తెలుస్తుంది. అదే సమయంలో కలర్ ఆప్సన్స్ కూడా కొత్తగా ఉండే అవకాశం ఉంది. ఈ కార్లు ఇప్పుడు కొత్త బ్లూ కలర్ పెయింట్ స్కీమ్ లో అందుబాటులో రానుంది.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

ఈ కొత్త బ్లూ పెయింట్ స్కీమ్‌ అనేది కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన 'కియా కారెన్స్' MPV లో గమనించవచ్చు. అయితే భారత ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన కొంత సమాచారం ప్రకారం అన్ని కార్లలో 8 సీట్ల వరకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఖచ్చితంగా అందించాలని ప్రకటించింది.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ప్రకారం, కియా ఇండియా కూడా ఇప్పుడు తన అన్ని కార్లను 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అందించడానికి కంకణం కట్టుకుంది. ఈ కారణంగా కియా ఇండియా ఇప్పుడు మార్కెట్‌లో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించే దేశంలో మొట్టమొదటి వాహన తయారీ సంస్థ కానుంది.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

కియా సెల్టోస్ డీజిల్ iMT వేరియంట్‌లో అందించబడుతుంది, ఇది మిడ్-స్పెక్ HTK ప్లస్ ట్రిమ్‌పై ఆధారపడి ఉంటుంది. క్లచ్‌లెస్ iMT ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ప్రస్తుతం రెండు SUV మోడళ్లలో టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఈ గేర్‌బాక్స్‌ని డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో జత చేయడం ఇదే మొదటిసారి.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

కియా సెల్టోస్ యొక్క డీజిల్ ఇంజన్ 114 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా కియా సోనెట్‌లోని డీజిల్ ఇంజన్ డ్యూయెల్ ట్యూన్డ్ స్టేట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఇంజిన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది, ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మరోవైపు, ఈ ఇంజన్ 114 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందించడానికి ట్యూన్ చేయబడింది, ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

కియా తన సెల్టోస్ SUV ని కూడా అప్‌డేట్‌ను పొందుతుంది. ఇది ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. బహుశా జూన్‌లో మార్కెట్లో విడుదలకానుంది. అయితే ఇది దాని స్టైలింగ్‌లో ముఖ్యమైన అప్‌డేట్‌లను అందుకుంటుంది. ఇందులో అద్భుతమైన ఎక్స్టీరియర్ డిజైన్ పొందుతుంది. ఈ డిజైన్ ఇటీవల విడుదలైన కియా కారెన్స్ పొందుతుంది.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

'కియా సెల్టోస్' మరియు 'కియా సోనెట్‌' యొక్క అప్డేటెడ్ డిజైన్‌లో ప్రధానంగా కొత్త గ్రిల్ మరియు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో భారీగా పునర్నిర్మించబడిన ఫ్రంట్ ఫేస్ ఉంటుంది. అంతే కాకుండా కొత్త ఫీచర్లు, ఫాబ్రిక్, కలర్స్ మొదలైన వాటితో క్యాబిన్ లోపలి భాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

'కియా సెల్టోస్' మరియు 'కియా సోనెట్‌' అనేవి కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్. కంపెనీ యొక్క అమమకాలు రోజురోజుకి మెరుగుపడటానికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయి, మరియు ఇప్పటికి పడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మోడల్స్ మరిన్ని అప్డేట్స్ పొందటం వల్ల మరిన్ని అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

మరిన్ని అప్డేట్స్‌తో రానున్న Kia Sonet & Seltos.. ఇక మరింత సేఫెస్ట్ గురూ..!!

ఇప్పుడు కియా మోటార్స్ తన అన్ని మోడల్స్ లో తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగులను అందించడం వల్ల ప్రయాణికుల భద్రతను మరింత దోహదపడతాయి. కావున రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులను రక్షించడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కేవలం కియా మోటార్స్ మాత్రమే కాకూండా దాదాపు అన్ని కార్ల తయారీదారులు కూడా ఈ నిబంధనను తప్పకుండా పాటించాలి.

More from DriveSpark

Article Published On: Monday, February 21, 2022, 18:03 [IST]
English summary
Kia seltos sonet suv to get 6 airbags as standard soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+