టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

దేశంలో ఇంధన ధరలు పెరిగిపోతుండటంతో కొనుగోలుదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, వాహన తయారీదారులు కూడా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఇలాంటి వాహనాల తయారీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మనదేశంలో ఒకప్పుడు సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్)తో నడిచే వాహనాలకు పెద్దగా గిరాకీ ఉండేది. కాకపోతే, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గు మంటుడంతో కస్టమర్లు కూడా సరసమైన సిఎన్‌జి వాహనాల వైపుకు మళ్లుతున్నారు.

టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

మరోవైపు దేశంలో సిఎన్‌జి ఇంధన లభ్యత కూడా మెరుగుపడటంతో ఈ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకూ మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి కంపెనీలు మాత్రమే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడిన వాహనాలను విక్రయించేవి. తాజాగా, ఈ విభాగంలోకి టాటా మోటార్స్ కూడా ప్రవేశించింది. తమ టియాగో మరియు టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ కూడా తమా వాహనాలలో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ను అందించాలని ప్లాన్ చేస్తోంది.

టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

తాజా సమాచారం ప్రకారం, కియా ఇండియా ఇప్పుడు తమ సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క CNG వెర్షన్‌ను భారత రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది. రాబోయే నెలల్లో కియా ఇండియా లైనప్‌లో కియా సోనెట్ సిఎన్‌జిని చేర్చవచ్చని భావిస్తున్నారు. కంపెనీ ఇటీవలే తమ అప్‌డేటెడ్ 2022 సోనెట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ వేరియంట్ లైనప్‌లో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. కాగా, ఇప్పుడు ఇందులో కొత్తగా సిఎన్‌జి వేరియంట్లను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

ప్రస్తుతం, మార్కెట్లో కియా సోనెట్ న్యాచురల్ పెట్రోల్, టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అయితే, దేశంలో సిఎన్‌జి కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కంపెనీ తమ సోదర సంస్థ అయిన హ్యుందాయ్ నుండి సిఎన్‌జి టెక్నాలజీని అరువు తెచ్చుకొని, తమ కార్లలో కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లను అందించే అవకాశం ఉంది. సోనెట్ అప్‌గ్రేడ్ తర్వాత, భారతదేశంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో వస్తున్న మొదటి కియా కారు ఇదే అవుతుంది.

టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

ఇటీవల టెస్టింగ్ సమయంలో గుర్తించబడిన కియా సోనెట్ కారు వెనుక భాగంలో విండ్‌షీల్డ్ పై CNG అంటించబడి ఉంది. ఆ సమయంలో కనిపించిన మోడల్ కియా సోనెట్ యొక్క జిటి లైన్ వేరియంట్ అని తెలుస్తోంది. అంటే, కియా సోనెట్ సిఎన్‌జిని కంపెనీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే విక్రయించవచ్చని తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే, భారతదేశంలో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఏకైక కారు కూడా కియా సోనెట్ సిఎన్‌జి అవుతుంది.

టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

కియా మోటార్స్ ఈనెల ఆరంభంలో మార్కెట్లో విడుదల చేసిన 2022 మోడల్ కియా సోనెట్ విషయానికి వస్తే, దేశీయ విపణిలో ఈ చిన్న ఎస్‌యూవీ ధరలు రూ. 7.15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఈ కొత్త మోడల్ వేరియంట్ లైనప్‌లో కంపెనీ ఎంట్రీ లెవల్ వేరియంట్ నుండి టాప్-ఎండ్ వేరియంట్ వరకూ పలు మార్పులు చేర్పులు చేసింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, కియా ఇండియా తమ రిఫ్రెష్డ్ సోనెట్‌ ఎస్‌యూవీలోని అన్ని బేస్ వేరియంట్లలో సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి ఫీచర్‌గా అందిస్తోంది.

టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

అలాగే, కొత్త కియా సోనెట్‌ను 'ఇంపీరియల్ బ్లూ' మరియు 'స్పార్క్లింగ్ సిల్వర్' అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో కూడా పరిచయం చేసింది. ఇంకా ఇందులో హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (హైలైన్ TPMS), సోనెట్ యొక్క iMT ట్రిమ్‌లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ ఫీచర్లు కూడా జోడించబడ్డాయి. అలాగే, కియా సోనెట్ HTX+ వేరియంట్‌లో కూడా ఇప్పుడు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

అంతేకాకుండా, కియా సోనెట్ కొనుగోలుదారులు ఇప్పుడు HTX వేరియంట్ నుండే అధునాతన 10.67 సెంటీమీటర్ (4.2 ఇంచ్) కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతారు, ఇది కారుకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. అలాగే, ఇందులో సెమీ లెథెరెట్ సీట్లను ఇప్పుడు HTE వేరియంట్ నుండే అందిస్తున్నారు. రిఫ్రెష్ చేయబడిన 2022 సెల్టోస్ మాదిరిగానే, కొత్త 2022 సొనెట్ కూడా D-కట్ స్టీరింగ్ వీల్ మరియు టెయిల్‌గేట్‌పై అప్‌డేట్ చేయబడిన లోగోను కలిగి ఉంటుంది.

టెస్టింగ్ దశలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG).. త్వరలో భారత మార్కెట్లో విడుదల..

మై కియా (MyKia) మొబైల్ యాప్ గురించి తెలుసా..?

కియా తమ కస్టమర్ల యాజమాన్య అనుభవాన్ని మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా 'మై కియా' (MyKia) పేరుతో ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. సేల్స్, సర్వీస్ మరియు ఆఫర్‌ల వంటి బహుళ ప్రయోజనాలను అందించడానికి ఈ యాప్ రూపొందించబడింది. ఈ యాప్ సాయంతో కస్టమర్‌లు టెస్ట్ డ్రైవ్ లను బుక్ చేయడం, డిజి-కనెక్ట్ ద్వారా వీడియో కన్సల్టేషన్‌లు, కొత్త కార్లను బుక్ చేయడం మరియు కొటేషన్‌లను అభ్యర్థించడం వంటి సేవలను పొందవచ్చు. అలాగే, ఆఫ్టర్‌సేల్స్ కస్టమర్‌లకు సర్వీస్ కాస్ట్ కాలిక్యులేటర్, సర్వీస్ ఖర్చుల వివరాలు, సర్వీస్ ఫీడ్‌బ్యాక్, సర్వీస్ బుకింగ్ మరియు ట్రాకింగ్ వంటి సేవలు ఈ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. - పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 19, 2022, 13:55 [IST]
English summary
Kia sonet could get factory fitted cng variant with turbo petrol engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+