భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్' విడుదల: ధర రూ. 13.39 లక్షలు

అమ్మకాల్లో దూసుకెళ్తున్న 'కియా మోటార్స్' (Kia Motors) యొక్క 'సోనేట్' (Sonet) ఇప్పుడు భారతీయ మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్' (Kia Sonet X Line) అనే పేరుతో విడుదలైంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సోనేట్ ఎక్స్ లైన్ ధర రూ. 13.39 లక్షలు.

Recommended Video

Kia EV6 రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఈ కొత్త సోనేట్ మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కియా సోనేట్ ఎక్స్ లైన్' డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ కలిగిన సోనేట్ ఎక్స్ లైన్ ధర రూ. 13.99 లక్షలు, కాగా పెట్రోల్ ఇంజిన్ కలిగిన సోనేట్ ఎక్స్ లైన్ ధర రూ. 13.39 లక్షల వరకు ఉంది.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

కియా సొనెట్ ఎక్స్ లైన్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇది మాట్ గ్రాఫైట్ కలర్ షేడ్‌ పొందుతుంది. కావున చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రిల్ గ్లోస్ బ్లాక్ కలర్‌లో ఉండటం గమనించవచ్చు. ముందు మరియు వెనుక స్కిడ్ ప్లేట్లు డార్క్ మెటల్ యాక్సెంట్‌లతో పియానో ​​బ్లాక్ కలర్‌ను పొందుతాయి. ఫాగ్ ల్యాంప్‌లో గ్లోస్ బ్లాక్ కలర్ ఇవ్వబడింది, అదే సమయంలో మిర్రర్స్ మరియు డోర్‌లపై డార్క్ మెటల్ యాక్సెంట్‌లు ఉన్నాయి. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఫినిష్ అయి ఉంటుంది.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ సిల్వర్ బ్రేక్ కాలిపర్‌లతో వస్తాయి. అయితే GT వేరియంట్‌లో మాత్రం రెడ్ కలర్ లో ఉండటం గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్ లైన్ ని ప్రత్యేకంగా గుర్తించడానికి అనుకూలంగా ఉంటాయి.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

ఇక ఇంటీరియర్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇంటీరియర్ కొత్త డ్యూయల్ టోన్ కలర్‌లో ఉంటుంది. ఇందులోని సీట్లు లెదర్ అపోల్స్ట్రే పొంది చాలా స్పోర్టీగా ఉంటాయి. అంతే కాకుండా సీట్లపైన రెడ్ స్టిచ్చింగ్ కూడా చూడవచ్చు. ఇది మరింత మంచి లుక్ ఇస్తుంది. స్టీరింగ్ వీల్ కూడా లెదర్ తో చుట్టబడి మంచి గ్రిప్ ఇస్తుంది.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఇందులో UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఈ కొత్త సోనెట్ ఎక్స్ లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

కొత్త సోనెట్ ఎక్స్ లైన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, మనం ఇంతకు ముందు మొదట్లో చెప్పుకున్నట్లుగా ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 120 పిఎస్ పవర్ మరియు 1,500-4,000 ఆర్‌పిఎమ్ వద్ద 172 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తాయి. ఇది 7 డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.

అదే విధంగా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 115 పిఎస్ పవర్ మరియు 1,500-2,750 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, కియా సోనెట్ ఎక్స్ లైన్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, బ్రేక్ అసిస్ట్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. కావున వాహనదారుల భద్రతకు ఏ మాత్రం డోకా ఉండదు.

భారత మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్; విడుదల: ధర రూ. 13.39 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న కియా సోనేట్ ఇప్పుడు కొత్త ఎడిషన్ లో లాంచ్ అవ్వడం అనేది కస్టమర్లకు శుభవార్త అనే చెప్పాలి. అయితే ఈ కొత్త ఎడిషన్ కియా సొనెట్ ఇప్పుడు టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ మరియు త్వరలో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో మంచి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 1, 2022, 13:33 [IST]
English summary
Kia sonet x line launched price rs 13 39 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+