భారతీయ తీరాలకు చేరుకున్న Huracan EVO Fluo Capsule: డిజైన్ & వివరాలు
లంబోర్ఘిని (Lamborghini) అనేది ప్రపంచమార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న లగ్జరీ కార్ బ్రాండ్. ఈ కంపెనీ ఇప్పటికే భారతీయ మార్కెట్లో చాలా ఆధునిక మోడల్స్ విడుదల చేసి తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు మరో కొత్త అధూరిక మోడల్ తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

లంబోర్ఘిని లైనప్ లో అద్భుతమైన డిజైన్ మరియు ఆకర్షణీయంగా కలర్ కలిగి ఉన్న 'హురాకాన్ EVO ఫ్లూ క్యాప్సూల్' (Huracan EVO Fluo Capsule) భారతీయ తీరాలకు చేరుకుంది. ఈ కొత్త మోడల్ చాలా దూకుడుగా ఉండటమే కాకుండా మంచి ఇంటీరియర్ కలిగి మ్యాట్ పెయింట్ ఎక్స్‌టీరియర్ పొందుతుంది.

'హురాకాన్ EVO ఫ్లూ క్యాప్సూల్' (Huracan EVO Fluo Capsule) ఆమెది 5 ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. అవి వెర్డే షాక్ (గ్రీన్), అరన్సియో లివ్రియా (ఆరంజ్), సెలెస్టే ఫెడ్రా (బ్లూ), అరన్సియో డాక్ (ఆరంజ్) మరియు గియాల్లో క్లారస్ (యెల్లో) కలర్స్. వీటితో పాటు మ్యాట్ బ్లాక్ రూఫ్ కలిగి ఉంటుంది.

ఇది అద్భుతమైన ఫ్రంట్ బంపర్, సైడ్ స్కర్ట్‌లు మరియు యాడ్ పర్సనమ్ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. మాట్ బ్లాక్ కాంపోనెంట్‌ల వివరాలు కొత్త ఫ్లూ కలర్ లో ఎంపిక చేయబడ్డాయి, బ్లాక్ వింగ్ మిర్రర్‌లపై కలర్ లైన్ మరియు రియర్ స్ప్లిటర్‌పై వర్టికల్ కలర్ లైన్ వంటి వాటిని కలిగి ఉండటం వల్ల ఇది చూడగానే చాలా ఆకర్శించబడుతుంది.

ఇంకా ఇందులోని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది కొత్త స్పోర్ట్స్ సీట్లు స్టాండర్డ్ కంఫర్ట్ సీట్లకు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. ఇవి అల్కాంటారా లేదా లెదర్ యూనికలర్‌లో EVO స్పోర్టివో ట్రిమ్‌తో ఉంటాయి. స్టార్ట్ & స్టాప్ బటన్ కవర్ మరియు హెడ్‌రెస్ట్‌పై ఎంబ్రాయిడరీ చేసిన లంబోర్ఘిని షీల్డ్ ఎక్స్టీరియర్ టోన్‌లకు సరిపోయే ఐదు కొత్త ఫ్లోరోసెంట్ కలర్స్ ఒకదానిలో పూర్తి చేయబడ్డాయి.

'హురాకాన్ EVO ఫ్లూ క్యాప్సూల్' (Huracan EVO Fluo Capsule) గురించి 'లంబోర్ఘిని ఇండియా' హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ కొత్త మోడల్ భారతదేశానికి తీసుకురావడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇది అద్భుతమైన కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో హురాకాన్ సిరీస్ ఎంతగానో ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ కొత్త మోడల్ కూడా తప్పకుండా మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నామన్నారు. Huracan EVO Fluo Capsule తమ వ్యక్తిత్వానికి కావాల్సిన విధంగా లంబోర్ఘిని అనుకూలీకరించడానికి అవకాశం కల్పిస్తుంది.

Huracan EVO Fluo Capsule అద్భుతమై ఇంజిన్ పనితీరుని కలిగి ఉంటుంది, అదే సమయంలో ఇది ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందిస్తుంది, కావున ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను అందిస్తుంది. అయితే ఈ కార్లు ఎక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ముందుకు రారు. అయితే భారతదేశంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు క్రీడాకారులు వంటి వారు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు.


Click it and Unblock the Notifications