భారత మార్కెట్లో Land Rover Discovery Metropolitan Edition విడుదల: ఈ బ్రిటీష్ కార్ ధరెంతంటే..?

టాటా మోటార్స్ యాజమాన్యంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ (Land Rover) భారత మార్కెట్లో విక్రయిస్తున్న డిస్కవరీ ఎస్‌యూవీలో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్ (Land Rover Discovery Metropolitan Edition) పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఆల్ట్రా-లగ్జరీ ఎస్‌యూవీ ధరలు రూ.1.26 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఈ స్పెషల్ ఎడిషన్ లగ్జరీ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్లో Land Rover Discovery Metropolitan Edition విడుదల: ఈ బ్రిటీష్ కార్ ధరెంతంటే..?

కొత్త టాప్ ఎండ్ వేరియంట్

ల్యాండ్ రోవర్ డిస్కవరీ యొక్క టాప్-ఎండ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ పరిమిత కాలపు మెట్రోపాలిటన్ ఎడిషన్ ను విడుదల చేశారు. కొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్ ఇప్పుడు ఈ మోడల్ లైనప్ లో టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ గా ఉంటుంది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్ ఆర్-డైనమిక్ హెచ్ఎస్ఈ ( R-Dynamic HSE) వేరియంట్‌ ను ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది.

భారత మార్కెట్లో Land Rover Discovery Metropolitan Edition విడుదల: ఈ బ్రిటీష్ కార్ ధరెంతంటే..?

స్పెషల్ ఎడిషన్‌లో స్పెషల్ ఫీచర్లు

స్టాండర్డ్ మోడల్‌తో ఈ మెట్రోపాలిటన్ ఎడిషన్‌ను భిన్నంగా ఉంచేందుకు కంపెనీ ఇందులో కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసింది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇది గ్రిల్ మరియు డిస్కవరీ స్క్రిప్ట్‌కు సంబంధించిన బ్రైట్ అట్లాస్ వివరాలను కలిగి ఉంది. అలాగే, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్‌లో ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో హకుబా సిల్వర్‌ కలర్ లో ఫినిష్ చేయబడిన ఇన్‌సర్ట్‌ లు ఉంటాయి.

భారత మార్కెట్లో Land Rover Discovery Metropolitan Edition విడుదల: ఈ బ్రిటీష్ కార్ ధరెంతంటే..?

ఇంకా ఈ ప్రత్యేక ఎడిషన్ లో కొత్త 20 ఇంచ్ శాటిన్ డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్ ల్యాండ్ రోవర్ బ్రేక్ కాలిపర్‌లు, స్లైడింగ్ ఫ్రంట్ సన్‌రూఫ్ మరియు వెనుకవైపు స్థిరంగా ఉండే పానోరమిక్ రూఫ్ వంటి ప్రత్యేక ఫీచర్లు లభిస్తాయి. ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్‌ ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో 12.3 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫోన్ సిగ్నల్ బూస్టర్‌తో వైర్‌లెస్ ఛార్జింగ్, ఫ్రంట్ కూలర్ కంపార్ట్‌మెంట్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు హీటెడ్ స్టీరింగ్ వీల్ మొదలైన ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో Land Rover Discovery Metropolitan Edition విడుదల: ఈ బ్రిటీష్ కార్ ధరెంతంటే..?

ఈ ఎస్‌యూవీ ఆఫర్ చేసే ఇతర స్టాండర్డ్ ఫీచర్లలో భాగంగా, హీటెడ్ మరియు కూల్డ్ రియర్ సీట్లు, పవర్డ్ సీట్ రిక్లైన్ మరియు టైటానియం మెష్ ట్రిమ్ డీటేలింగ్ ఉన్నాయి. ల్యాండ్ రోవర్ డిస్కవరీ యొక్క కొత్త మెట్రోపాలిటన్ ఎడిషన్ కూడా PM2.5 ఎయిర్ ఫిల్ట్రేషన్‌తో కూడిన క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది కారు లోపల గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంది మరియు ఆరోగ్యకరమైన క్యాబిన్ ఎయిర్ కోసం కోసం హానికరమైన సూక్ష్మ కణాలను ఫిల్టర్ చేస్తుంది.

భారత మార్కెట్లో Land Rover Discovery Metropolitan Edition విడుదల: ఈ బ్రిటీష్ కార్ ధరెంతంటే..?

ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్స్

ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ముందుగా పెట్రోల్ ఇంజన్ గణాంకాలను పరిశీలిస్తే, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్ పి360 వేరియంట్‌లో 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 5,500-6,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 355 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750-5,000 ఆర్‌పిఎమ్ మధ్యలో 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు (ఆల్-వీల్ డ్రైవ్) సమానంగా పంపిణీ చేస్తుంది.

భారత మార్కెట్లో Land Rover Discovery Metropolitan Edition విడుదల: ఈ బ్రిటీష్ కార్ ధరెంతంటే..?

ఇక డీజిల్ ఇంజన్ గణాంకాల విషయానికి వస్తే, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్ డి300 వేరియంట్‌లో 3.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 296 బిహెచ్‌పి శక్తిని మరియు 1,500-2,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 650 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో పనిచేస్తుంది. ఇది కూడా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో Land Rover Discovery Metropolitan Edition విడుదల: ఈ బ్రిటీష్ కార్ ధరెంతంటే..?

కొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతు.. ల్యాండ్ రోవర్ డిస్కవరీ బహుశా భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత బహుముఖ సెవెన్-సీటర్ ఎస్‌యూవీలలో ఒకటి కావచ్చని, తమ కస్టమర్ల కోసం ఇందులో అనేక అప్‌గ్రేడ్‌లు, మెరుగుపరచబడిన సరికొత్త ఫీచర్లు మరియు ఆప్షన్‌లను చేర్చడం ద్వారా కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రోపాలిటన్ ఎడిషన్ దాని విలువను మరింత పెంచుతుందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 19, 2022, 9:11 [IST]
English summary
Land rover launches discovery metropolitan edition in india price specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+