125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

చరిత్ర ఎప్పుడూ చాలా అందమైనది. అది రాజుల చరిత్ర కావచ్చు లేదా వాహనాల చరిత్ర కావచ్చు. రెండూ గొప్పగానే ఉంటాయి. భారత ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వైవిధ్యమైనది మరియు అనేక సవాళ్లతో కూడుకున్నది. అత్యధిక జనాభా కలిగిన దేశం కావడంతో మనదేశంలో వాహన వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే, కొత్త ఆటోమొబైల్ కంపెనీలు వ్యాపారం కోసం మన దేశం వైపు పరుగులు తీస్తున్నాయి. భారత ఆటోమొబైల్ పరిశ్రమకు దాదాపు 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఆ చరిత్ర పుటలను ఓసారి తిరగేద్దాం రండి.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో భారతదేశం ఇప్పుడు నాల్గవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఆటోమొబైల్స్ విషయంలో ప్రపంచం గర్వించదగిన దేశాలలో మనదేశం కూడా ఒకటి. భారతదేశానికి ఈ స్థానం ఊరికే రాలేదు, దాని వెనుక చాలా కృషి ఉంది. ఇందులో మనదేశానికి వాహనాలను పరిచయం చేసిన అనేక కంపెనీల కష్టం కూడా ఉంది. గత 2021 గణాంకాల ప్రకారం భారత ఆటో పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది మరియు అమ్మకాల పరంగా జర్మనీని కూడా అధిగమించింది. ప్రస్తుతం, భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ విలువ సుమారు 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

1897లో మొదటి కారు విడుదలైంది

భారతదేశంలో మొట్టమొదటి కారు 1897లో విడుదలైనట్లుగా చెబుతారు. ఆ సమయంలో మనదేశానికి విదేశీ రవాణ ప్రారంభం కావడంతో మొట్టమొదటి కారు భారతీయ రోడ్లపై తిరగడం ప్రారంభమైంది. ప్రారంభంలో ఈ కార్లు పూర్తిగా విదేశీ మార్కెట్ల నుండి దిగుమతి చేయబడేవి. సుమారు 1930ల వరకు భారతదేశంలో ఒక్క కార్ల తయారీ ప్లాంటు కూడా ఏర్పాటు లేదు. ప్రారంభంలో, ఫియాట్ ‌క్లీజర్‌తో సహా పలు ప్రధాన కార్ కంపెనీలన్నీ కూడా తమ కార్లను విదేశీ మార్కెట్ల భారతదేశానికి దిగుమతి చేసుకునేవారు.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

1940లో భారతదేశంలో మొదటి కారు తయారైంది

హిందుస్థాన్ మోటార్స్ మరియు ప్రీమియర్ కంపెనీలు 1940లో తొలిసారిగా భారతదేశంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభించిన ఘనతను పొందాయి. 1940లో, ఈ రెండు కంపెనీలు వేర్వేరు ఉత్పత్తి యూనిట్లలో కార్ల ఉత్పత్తిని చేయడం ద్వారా కార్ల ఉత్పత్తిలో తమ మొదటి అడుగుపెట్టాయి. హిందుస్థాన్ మోటార్స్ 1940లో ప్రారంభించబడి అదే సంవత్సరంలో మొదటి కారును ఉత్పత్ చేసింది. అయితే, ప్రీమియర్ మాత్రం హిందుస్థాన్‌తో కలిసి 1944లో ఉత్పత్తిలోకి ప్రవేశించిన మొదటి కారు రోడ్డుపైకి తెచ్చింది.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

ప్రీమియర్ మరియు హిందుస్థాన్ భారతదేశంలో కార్లను విక్రయించడం ప్రారంభించడానికి ముందు, 1945 నాటికి క్లైసర్, డాడ్జ్ మరియు ఫియట్ వంటి అమెరికన్ కార్ తయారీదారులు భారతదేశంలో వాహనాల తయారీని ప్రారంభించారు. కాకపోతే, అవన్నీ విదేశీ కార్ కంపెనీలు. ఆ తర్వాత 1945లో మహీంద్రా అండ్ మహీంద్రా అనే మరో పెద్ద కంపెనీ వాణిజ్య వాహనాల తయారీని చేయడం ప్రారంభించింది. ఆ తర్వాతి కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా వాణిజ్య వాహనాలతో పాటు జీప్ సిజె3 వంటి యుటిలిటీ వాహనాలను కూడా తయారు చేయడం ప్రారంభించింది.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

భారతదేశంలో 1946 స్వాతంత్ర్య సంగ్రామం జోరుగా సాగుతున్నప్పటికీ, అనేక కొత్త ఆటోమొబైల్ కంపెనీలు మనదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించాయి. అదే సంవత్సరంలో, టాటా గ్రూప్ యొక్క మొదటి ఛైర్మన్ జెఆర్‌డి టాటా, జంషెడ్‌పూర్‌లో టాటా ఇంజనీరింగ్ మరియు లోకోమోటివ్ కంపెనీని (ప్రస్తుతం టాటా మోటార్స్) స్థాపించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి మరియు ఆటోమొబైల్ పరిశ్రమకు విడిభాగాలను సరఫరా చేయడానికి ఆటోమోటివ్-భాగాల తయారీ వ్యాపారాన్ని సృష్టించే ప్రయత్నాలను ప్రారంభించింది.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

అనేక ప్రయత్నాల తర్వాత, 1953లో, విదేశీ మార్కెట్లో పూర్తిగా నిర్మించిన కార్లను భారతదేశానికి దిగుమతి చేయడాన్ని పరిమితం చేయబడింది. విదేశీ ఉత్పత్తులకు బదులుగా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా, భారతదేశంలోనే వాహనాలను ఉత్పత్తి చేయాలని అప్పటి ప్రభుత్వం పిలుపునిచ్చింది. మొదట్లో హిందూస్థాన్ మోటార్స్ 1960ల నుండి 1980ల వరకు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది, దాని అంబాసిడర్ మోడల్ అధిక డిమాండ్‌ను సాధించడంలో విజయవంతమైంది.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

విదేశీ దిగుమతులపై వాణిజ్య పరిమితుల కారణంగా 1950 నుండి 1960 మధ్య కాలంలో భారత ఆటో పరిశ్రమ వృద్ధి మందగించింది. ఈ విదేశీ అణచివేత దశ తర్వాత కొంతకాలానికి ఆటో పరిశ్రమకు మళ్లీ డిమాండ్ పెరిగింది. వాణిజ్య వాహనాల విభాగంలో ప్యాసింజర్ కార్లతో పాటు ట్రాక్టర్ వంటి వ్యవసాయ మరియు వాణిజ్య వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ప్యాసింజర్ కార్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని, చవకైన ధరకే చిన్నకారును అందించాలనే ఉద్యేశ్యంతో మారుతి ప్యాసింజర్ కార్ విభాగంలోకి ప్రవేశించింగి.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో ఈ బ్రాండ్ 1980లలో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ విభాగంలో ఇప్పటికే అగ్రగాములుగా ఉన్న హిందూస్థాన్ మోటార్స్ మరియు ప్రీమియర్ అనే రెండు కంపెనీలతో తన పోటీని ప్రారంభించింది. మారుతి బ్రాండ్ నుండి వచ్చిన మొదటి కారు ఎమ్800.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

1991లో ప్రకటించిన సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ ప్రభావం, కఠినమైన వాణిజ్య విధానాలను ప్రవేశపెట్టిన కొద్దికాలానికే, భారత మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి గతంలో వెనుకాడిన కంపెనీలకు కొత్త వాణిజ్య విధాన అవకాశాలు లభించాయి. సరళీకరణ తరువాత, భారత్‌కు చెందిన మారుతి మరియు జపాన్‌కు చెందిన సుజుకి కంపెనీల మధ్య భాగస్వామ్యం కుదిరింది. ఇది ఆ సమయంలో భారతీయ మరియు విదేశీ కంపెనీల మధ్య మొదటి జాయింట్ ఆటో వెంచర్‌గా మారింది.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

అదే సమయంలో, టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్లు మరియు వాణిజ్య వాహనాల కోసం ప్రత్యేక వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. మొదట్లో డైమ్లర్‌తో వాణిజ్య వాహనాలను తయారు చేసిన టాటా, తర్వాత స్వతంత్ర కార్యకలాపాలతో కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. కొత్త ఆర్థిక సంస్కరణల ప్రభావంతో అమెరికాతు చెందిన ఫోర్డ్, దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్, జపాన్‌కు చెందిన హోండా, జర్మనీకి చెందిన మెర్సిడెస్-బెంజ్, ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, జపాన్ కార్ బ్రాండ్ నిస్సాన్, జపాన్ కార్ బ్రాండ్ టొయోటా, జర్మనీకి చెందిన ఆడి, జర్మనీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూ, స్వీడన్‌కి చెందిన వోల్వో మరియు జపాన్‌కు చెందిన మిత్సుబిషి వంటి ప్రముఖ విదేశీ కార్ కంపెనీలు నెమ్మదిగా తమ కొత్త కార్ మోడళ్లను భారతదేశంలో ప్రవేశపెట్టాయి.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

సుమారు 2000 నుండి 2010 వరకు దాదాపు అన్ని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాలలో కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో తమ ఉనికిని విస్తరించాయి. 2000ల ప్రారంభంలో వాహన తయారీ ప్రక్రియ ఊపందుకుంది, అయితే ఆ కాలంలో భారతదేశంలో తయారైన కార్ల ఎగుమతులు చాలా నెమ్మదిగా ఉండేవి. గత దశాబ్దంలో జరిగిన మార్పులు మరియు భారతదేశంలోని వాహన తయారీదారుల కోసం వచ్చిన కొత్త విధానాలతో నేడు ఎగుమతుల సంఖ్య భారీగా పెరిగింది. భారతదేశంలో గత ఐదేళ్లలో సాధించిన వృద్ధితో ఇది ఉత్పత్తి పరంగా నాల్గవ స్థానంలో ఉన్న జర్మనీ దేశాన్ని అధిగమించి ఆ స్థానానికి కైవసం చేసుకుంది.

125 ఏళ్ల చరిత్ర.. కట్ చేస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్..!

ప్రపంచ ఆటోమొబైల్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా, అమెరికా రెండవ స్థానంలో జపాన్ మూడవ స్థానంలో, భారతదేశం నాల్గవ స్థానంలో, జర్మనీ ఐదవ స్థానంలో మరియు మెక్సికో ఆరవ స్థానంలో ఉన్నాయి. మనదేశంలో ఇప్పుడు మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా, కియా ఇండియా, ఎమ్‌జి మోటార్, జీప్, టొయోటా, నిస్సాన్ మరియు రెనో, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఇసుజు మిత్సుబిషి, సిట్రోయెన్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీ, సుజుకి మోటార్‌సైకిల్ వంటి బడ్జెట్ ఆటోమొబైల్ బ్రాండ్లతో పాటుగా అనేక అంతర్జాతీయ లగ్జరీ ఆటోమొబైల్ బ్రాండ్లు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాయి.

Most Read Articles

English summary
Lets have a brief look at over 125 years of indian automobile industry history
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X