దేశీయ మార్కెట్లో విడుదలైన Lexus LX 500d: ధర రూ. 2.82 కోట్లు
భారతీయ మార్కెట్లో 'లెక్సస్ ఇండియా' ఎట్టకేలకు తన 'ఎల్ఎక్స్ 500డి' (LX 500d) SUV విడుదల చేసింది. ఈ SUV ధర రూ.2.82 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ ఆధునిక 'లెక్సస్ ఎల్ఎక్స్ 500డి' ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్లో విడుదలైన లెక్సస్ ఎల్ఎక్స్ 500డి (Lexus LX 500d) యొక్క మొదటి బ్యాచ్ డెలివరీలు 2023 జనవరి మరియు మార్చి మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ SUV రాబోయే 2023 ఆటో ఎక్స్‌పోలో RX SUV మరియు LC కూపేతో పాటు ప్రదర్శించబడుతుంది. కొత్త లెక్సస్ ఎల్ఎక్స్ 500డి SUV టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 కంటే కూడా విలాసవంతంగా ఉంటుంది.

డిజైన్ విషయానికి వస్తే, లెక్సస్ ఎల్ఎక్స్ 500డి స్క్వేర్డ్-అవుట్ వీల్ ఆర్చ్‌లు, పెద్ద అల్లాయ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో పెద్ద లెక్సస్ సిగ్నేచర్ గ్రిల్ దానికి రెండు వైపులా హెడ్‌ల్యాంప్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ LC300 ని పోలి ఉన్నప్పటికీ వెనుక వైపు కొంత భిన్నంగా ఉండి రియర్ క్వార్టర్ విండో పొందుతుంది. అంతే కాకుండా LX కనెక్టెడ్ లైట్ బార్, బ్రాండ్ లోగోకు బదులుగా టెయిల్‌గేట్‌పై లెక్సస్ అక్షరాలను చూడవచ్చు.
లెక్సస్ ఎల్ఎక్స్ 500డి అధునాతన ఇంటీరియర్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇంటీరియర్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి ట్యాన్, రెడ్, వైట్ మరియు వైట్ & బ్రౌన్ (కంబైన్డ్ కలర్). ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో లెక్సస్ ఎల్ఎక్స్ మోడల్ 5 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులోని ఉంది. కానీ భారతీయ మార్కెట్లో 5 సీటర్ మాత్రమే లభించే అవకాశం ఉంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 500డి ట్విన్-స్క్రీన్ సెటప్‌ను పొందుతుంది. ఎగువ భాగంలో 12.3 ఇంచెస్ యూనిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. దానికి కింది భాగంలో 7.0 ఇంచెస్ స్క్రీన్ ఆఫ్-రోడ్ డేటా అలాగే క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్‌లను చూపుతుంది. అంతే కాకుండా ఇందులో 8 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేగా పనిచేస్తుంది. వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం 11.6 ఇంచెస్ వైర్‌లెస్ రిమోట్ కంట్రోల్‌తో కూడిన టచ్‌స్క్రీన్‌లు ఉంటాయి.
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త లెక్సస్ ఎల్ఎక్స్ 500డి కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్సన్ లో మాత్రమే లభిస్తుంది. కావున ఇందులో 3.3-లీటర్ ట్విన్-టర్బో V6 డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 309 హెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో నార్మల్, ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ S, స్పోర్ట్ S+ మరియు కస్టమ్ అనే మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి.
లెక్సస్ కంపెనీ యొక్క ఎల్ఎక్స్ 500డి (LX 500d) భారతీయ మార్కెట్లో రేంజ్ రోవర్ యొక్క లాంగ్-వీల్‌బేస్ వెర్షన్ (రూ. 2.56 - రూ. 3.43 కోట్లు, ఎక్స్-షోరూమ్) మరియు మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ జిఎల్ఎస్ 600 (రూ. 2.92 కోట్లు, ఎక్స్-షోరూమ్) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున దేశీయ విఫణిలో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనేది త్వరలో తెలియాల్సి ఉంది.
భారతీయ మార్కెట్లో లెక్సస్ కార్లకు కూడా మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే దేశీయ విఫణిలో కంపెనీ Lexus NX 350h మరియు Lexus ES300h వంటి వాటిని విడుదల చేసింది. అంతే కాకుండా 2023 జనవరి నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో RX SUV మరియు LC కూపే వంటి వాటిని కూడా ప్రదర్శించనుంది. ఈ కొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








