భారతీయ మార్కెట్లో 2022 లో విడుదలైన టాటా ఎలక్ట్రిక్ కార్లు - వివరాలు

2022 ముగియటానికి 2023 రావడానికి ఇక ఎన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఈ 2022 సంవత్సరంలో మన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో విడుదల చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా టియాగో ఈవి (Tata Tiago EV):

టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో 'టియాగో ఈవి' ఒకటి. ఇది గత సెప్టెంబర్ నెలలో అధికారికంగా విడుదలైంది. ఇది మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ.8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

భారతీయ మార్కెట్లో 2022 లో విడుదలైన టాటా ఎలక్ట్రిక్ కార్లు

టాటా టియాగో ఈవి ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లను కలిగి, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, గ్రిల్‌పై ఉన్న ట్రై-యారో మోటిఫ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో టీల్ బ్లూ కలర్ తో ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. 'టాటా టిగోర్ ఈవీ'లో Ziptron హై-వోల్టేజ్ ఆర్కిటెక్చర్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి IP67 రేటింగ్‌ కలిగి ఉంది. టియాగో ఈవి కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌తో 250కిమీ పరిధిని, 24kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్‌తో 315 కిమీ పరిధిని అందిస్తుంది.

టాటా టిగోర్ ఈవి (Tata Tigor EV):

టాటా మోటార్స్ ఇటీవలే అప్డేటెడ్ 'టాటా టిగోర్ ఈవి' విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. 2022 టాటా టిగోర్ EV 'మాగ్నెటిక్ రెడ్' అనే కొత్త కలర్ ఆప్సన్ లో కూడా అందుబాటులో ఉంది. ఇది దాని మునుపటి మోడల్ ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం ఇది ఒక ఛార్జ్‌తో 315 కిమీ రేంజ్ అందిస్తుంది.

కొత్త అప్డేటెడ్ టాటా టిగోర్ EV మల్టీ మోడ్ రీజెన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు టైర్ పంక్చర్ రిపేర్ కిట్ వంటి 10 కొత్త స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది. మల్టీ మోడ్ రీజెన్ అనేది నెక్సాన్ ఈవి మ్యాక్స్ వంటి వాటిలో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. టియాగో ఈవి కేవలం 5.7 సెకన్లలోనే 0-60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

టాటా నెక్సాన్ ఈవి ప్రైమ్ (Tata Nexon EV Prime):

టాటా మోటార్స్ తన అత్యధిక ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుని 'నెక్సాన్ ఈవి ప్రైమ్' పేరుతో విడుదల చేసింది. ఇది మొత్తమ్ 9 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 14.99 లక్షల నుంచి రూ. 17.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మల్టీ-లెవల్ రీజెన్ బ్రేకింగ్‌ సిస్టమ్, యాక్టివ్ మోడ్ డిస్‌ప్లేతో కూడిన కంట్రోల్ నాబ్ మరియు సరికొత్త మకరనా బేజ్ ఇంటీరియర్స్ పొందుతుంది.

అంతే కాకూండా ఇందులోని ముందు ప్రయాణికుల కోసం వెంటిలేషన్‌తో కూడిన లెథెరెట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో వెహికల్ హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు 4 చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్టాండర్డ్ టాటా నెక్సాన్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ ప్రైమ్ రెండూ కూడా 30.3 kWh చిన్న బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటాయి. ఇవి పూర్తి చార్జ్ పై 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అందిస్తాయి. అయితే వాస్తవ ప్రపంచంలో తప్పకుండా 250 కిలోమీటర్లకు పైగా అందిస్తుంది. స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ 125 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది.

Most Read Articles

English summary
List of new tata electric cars launched in 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X