యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' ఓనర్ 'ఎమ్ఏ యూసఫ్ అలీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఈయన కూడా ఒకరు. అయితే యూసఫ్ అలీ ఇటీవల ఒక కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. ఈ ఆధునిక లగ్జరీ కారు ధర రూ. 2.80 కోట్లు (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం రండి.

యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

నివేదికల ప్రకారం.. ఎమ్ఏ యూసఫ్ అలీ కొనుగోలు చేసిన ఈ జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్600' (Mercedes-Maybach GLS600). దీనిని యూసఫ్ అలీ కేరళలోని మెర్సిడెస్ బెంజ్ బ్రిడ్జ్‌వే మోటార్స్ డీలర్‌షిప్ నుండి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

అయితే ఈ లగ్జరీ SUV ని లులు గ్రూప్ ఇండియా COO & RD శ్రీ రెజిత్ రాధాకృష్ణన్ స్వీకరించారు. దీనిని బ్రిడ్జ్‌వే మోటార్స్ వారు తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఈ ఆధునిక SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో నింది ఉంటుంది. అదే సమయంలో అద్భుతమైన పనితీరుని కూడా అందిస్తుంది.

యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

మెర్సిడెస్ బెంజ్ మొదటసారి తన మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీని 2021 జూన్ నెలలో విడుదల చేసింది. ఆ సమయంలో ఈ SUV ధర రూ. 2.43 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ ఎస్‌యూవీలో క్రోమ్‌లో ఫినిష్ చేసిన ఎక్స్టీరియర్ ట్రిమ్స్ ఉన్నాయి. ఇందులో పెద్ద వర్టికల్ స్లాట్ గ్రిల్, విండో లైన్, సైడ్-స్టెప్, ముందు మరియు రియర్ బంపర్‌లపై డిజైన్ ట్వీక్స్, రూఫ్ రెయిల్స్ మరియు ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా చూడవచ్చు.

యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

అదే సమయంలో ఈ లగ్జరీ ఎస్‌యూవీ పెద్ద 22 ఇంచెస్ లేదా 23 ఇంచెస్ బ్రష్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, అంతే కాకుండా డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన విండో పిల్లర్స్ మరియు రూఫ్, 'మేబాచ్' బ్రాండ్ లోగో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

మెర్సెడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్ఎస్ 600 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ బెస్పోక్ మెటీరియల్ మరియు ఫీచర్లు ఉంటాయి. వెనుక సీట్లు వెంటిలేషన్‌తో పాటుగా మసాజింగ్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంటాయి. అంతే కాకుండా వెనుక సీటులోని ప్రయాణీకులకు మరింత అనుకూలమైన ప్రయాణాన్ని అందించడానికి ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్స్ కూడా ఉంటాయి. వెనుక వరుసలో ఫోల్డింగ్ టాబ్లెట్స్ మరియు రిఫ్రిజిరేటర్ సౌకర్యం కూడా ఉంటుంది.

యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 12.3 ఇంచెస్ ఎమ్‌బియూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 64 కలర్స్ తో కూడిన ఎల్ఈడి ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్ వంటి మరిన్నో ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. వెనుక సీట్లు యొక్క ముందు భాగంలో మధ్యలో అమర్చిన టాబ్లెట్ స్క్రీన్ సాయంతో వివిధ అంశాలను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఆడియో, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్ మరియు నావిగేషన్ మొదలైనవి ఉన్నాయి. కావున ఇవన్నీ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 SUV 4.0-లీటర్ వి8 ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుది. ఇంజన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

యూసఫ్ అలీ గ్యారేజిలో చేరిన జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 2 కోట్లకు పైనే..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సాధారణంగా సెలబ్రెటీలు, పారిశ్రామికవేత్తలు మొదలైనవారు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే 'యూసఫ్ అలీ' ఈ మేబ్యాక్ GLS600 లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. ఇది మాత్రమే కాకుండా యూసఫ్ అలీ గ్యారేజిలో మినీ కూపర్ కంట్రీమ్యాన్, రోల్స్ రాయిస్ ఘోస్ట్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, బెంట్లీ బెంటాయగా, రోల్స్ రాయిస్ కల్లినన్, లెక్సస్ ఎల్ఎక్స్750 మరియు బిఎండబ్ల్యు 750 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ వంటి కార్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 27, 2022, 16:44 [IST]
English summary
Ma yusuf ali boughts new mercedes benz suv maybach gls 600 luxury cars details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+