జులై 2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

భారతీయ మార్కెట్లో అత్యంత పాపులర్ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఇటీవల తన 2022 జులై నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో మంచి అమ్మకాలతో మంచి వృద్ధిని నమోదు చేయగలిగింది. మహీంద్రా యొక్క మొత్తం అమ్మకాలను గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

మహీంద్రా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 జులై నెలలో 56,148 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు 2021 జులై నెలకంటే కూడా చాలా ఎక్కువ. జులై 2021 లో కంపెనీ 21,046 యూనిట్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు 2021 కంటే కూడా 2022 లో 33 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

కంపెనీ యొక్క మొత్తం విక్రయాలలో 27,854 యూనిట్ల SUV లను మరియు 20,946 యూనిట్ల కమర్షియల్ వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించింది. అదే సమయంలో 199 యూనిట్ల SUV లను మరియు 2,798 యూనిట్ల కమర్షియల్ వాహనాలను విదేశీ మార్కెట్ కి ఎగుమతి చేసింది.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

మహీంద్రా కంపెనీ 2021 జులై నెలలో మొత్తం 20,979 యూనిట్ల SUV లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే SUV అమ్మకాల్లో కూడా కంపెనీ గత సంవత్సరం జులై నెలకంటే 34 శాతం వృద్ధిని మవుదు చేయగలిగింది. దేశీయ మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700, థార్, ఎక్స్‌యూవీ300 మరియు మహీంద్రా బొలెరో వంటి వాటికి మంచి డిమాండ్ ఉన్న కారణంగా కంపెనీ SUV అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

మహీంద్రా కంపెనీ యొక్క కమర్షియల్ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే, 2022 జూలై నెలలో మొత్తం 20,946 యూనిట్లు విక్రయించబడ్డాయి. వృధ్దిలో 2021 జులై నెలకంటే 2022 జులై నెలలో 32 శాతం ఎక్కువ నమోదైంది.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

త్రీ వీలర్ల అమ్మకాలు కూడా కంపెనీ భారీగా అభివృద్ధిని నమోదు చేసింది. 2022 జూలైలో కంపెనీ 2,148 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో 2021 జూలై నెలలో కేవలం 4,351 యూనిట్లు అమ్ముడయ్యాయి. కావున త్రీ వీలర్ అమ్మకాల్లో కూడా కంపెనీ 103 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

ఇక చివరగా కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, 2021 జులైలో 2,798 యూనిట్లను విక్రయించింది. ఇదే నెల 2021 లో కంపెనీ 2,123 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. కావున ఎగుమతుల్లో కూడా కంపెనీ 32 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మొత్తం మీద మహీంద్రా కంపెనీ గత నెలలో మంచి అమ్మకాలను నమోదుచేసింది.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల కాలంలో మహీంద్రా స్కార్పియో-ఎన్‌ అనే కొత్త SUVని రూ. 11.99 లక్షల పారంభ ధర వద్ద విడుదల చేసింది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని కోసం కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. స్కార్పియో-ఎన్ కోసం బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 30 నిముషాల్లో 1 లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. డెలివరీలు 2022 సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. దీని కింద వినియోగదారులకు 6.99% వడ్డీ రేటు లోన్ తో కొనుగోలు చేయవచ్చు.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

అంతే కాకూండా మహీంద్రా కంపెనీ యొక్క XUV700 మార్కెట్లో బుకింగ్స్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటి వరకు ఏకంగా 1.5 లక్షల బుకింగ్స్ స్వీకరించ గలిగింది. అయితే ఇందులో 50,000 యూనిట్లు డెలివరీ చేయబడ్డాయి. ఇంకా కంపెనీ భారీ సంఖ్యలో డెలివరీ చేయాల్సి ఉంది. కంపెనీ కూడా తమ కస్టమర్లకు మరింత త్వరగా డెలివరీలను చేయడానికి తగిన సన్నాహాలుసిద్ధం చేస్తోంది.

2022 మహీంద్రా సేల్స్: దేశీయ విక్రయాలు & ఎగుమతులు ఇలా ఉన్నాయి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా కంపెనీ భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న భారతీయ వాహన తయారు సంస్థ. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో తమ కస్టమర్లను ఆకర్శించడానికి తగిన సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంఛ్ చేసింది. ఇది అతి తక్కువ కాలంలోనే మంచి బుకింగ్స్ పొందింది. కావున రానున్న రోజుల్లో కూడా మహీంద్రా మరింత గొప్ప అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Mahindra 2022 july car sales and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X